Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
రెండవ అనుభవం:
ఢిల్లీలో ఒకసారి నేను కాళీమార్గ్ వద్దనున్న కాళీకాదేవి గుడి నుంచి లోకల్ బస్సులో తిరిగి వస్తున్నాను. నేను దిగవలసిన బస్ స్టాప్ దగ్గర్లో వస్తుందనగా , నేను నా సీట్ నుండి లేచి బస్ ముందరుండే ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చాను. బస్ డ్రైవర్ బ్రేక్ సడన్ వేయడం వలన పెద్ద కుదుపు వచ్చేసరికి బస్ లో అందరు పెద్దగ అరిచారు. ఆ కుదుపుకు నేను బస్ మెట్ల మీదకి తోయబడ్డాను. నేను బస్ నుండి క్రిందకి పడిపోతానేమో అని, పెద్ద యాక్సిడెంట్ జరుగుతుందని ఎంతో భయపడి “బాబా” అని పెద్దగా అరిచాను . మరుక్షణం నేను బస్ చివరి మెట్టు మీద కూర్చొని ఉన్నానని తెలిసింది. ఏదో దైవ శక్తి నన్ను తీసుకొని పోయి చివరి మెట్టు మీద కూర్చోబెట్టినట్టు వుంది . చిత్రంగ నాకు ఒక్క గాటు కూడ పడ లేదు. సాయిబాబా నన్ను రక్షించారు.
మూడవ అనుభవం:
2010 వ సంవత్సరంలో ఢిల్లీ లో కరోల్ బాగ్ లో షాపింగ్ చేసేటప్పుడు ఎగుడుదిగుడు గా వున్న రోడ్ లో ఒక చోట కాలు పడి కింద పడ్డాను. నా శరీరం మొత్తం బరువంతా కూడా నా మణికట్టు మీద, మోకాలు మీద పడింది. నా మోకాలికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది. కుడి చేతికి చాలా చోట్ల గాట్లు పడ్డాయి. నేను నొప్పి భరించలేక ఏడుస్తున్నాను. అప్పుడు నా వయస్సు 62 సంవత్సరాలు . ఆ వయసులో సామాన్యంగ ఆస్టియోపొరోసిస్ (అంటే బోలు ఎముక వ్యాధి లేదా ముసలి తనంలో ఎముక మెత్త బడుట) వల్ల ఎముకలు బలహీనంగ వుంటాయి. నేను క్రింద బడటం వలన బహుశ నా ఎముకలు విరిగాయోమో అని చాల భయపడ్డాను. నేను ఆర్థొపెడిక్(ఎముకల డాక్టర్) దగ్గరికి వెళ్ళాను. నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎక్స్ రే తీసారు. ఏమి ఫ్ర్యాక్చర్ కాలేదని చెప్పారు. మోకాలు, చేతి వ్రేళ్ళు ఉబ్బాయి . ఆ వాపు మీద కట్టు(డ్రెస్సింగ్ చేసారు)కట్టారు. దెబ్బలు తగ్గాయి కాని నొప్పి , కొన్ని చోట్ల చేతి మీద వాపు తగ్గలేదు. నొప్పి చేతికి మొత్తం పాకుతూ వచ్చింది. నేను చాలా మంది మంచి ఆర్థోపెడిక్స్ ని కలిశాను. వాళ్ళు నా చేతి యొక్క కార్టిలేజ్ దెబ్బ తినింది అని చెప్పారు. సహజంగా నేను అలోపతి మందులను వాడను. అవి నా శరీరానికి సరిపడవు. ఇది ఆర్ధరైటిస్ (కీళ్ళ వాపు)మొదటి స్టేజ్ లో ఉంది అని నాకు చెప్పారు. దీనికి నేను వాడే హోమియోపతి లో మందు లేదు అని చెప్పారు. నేను ఎంతో మంది ర్యూమటాలజిస్ట్ లను (కీళ్ళ మరియు వాటి కండర వ్యాధుల నిపుణుడు) కలిసాను. కాని వాళ్ళు నాకు రాసిచ్చిన మందులు ఏమి నాశరీరానికి పడవు. నాకు ఎసిడిటి , శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, ఎప్పుడు వాంతికి వచ్చేటట్టు ఉండేది . అందువలన అలోపతి ట్రీట్మెంట్ మానివేయాల్సి వచ్చింది. నొప్పి ఏమీ తగ్గడం లేదు. ఇంకా అంతా వ్యాపిస్తూ వచ్చింది. నాకు చాలా భాధ గా ఉండేది. ఎప్పుడు ఏడుస్తు ఉండేదాన్ని. మంచి హోమియోపతి డాక్టర్ దొరికేలా చేయమని బాబా ని ప్రార్థించాను. చివరగా బాబా దయ వలన ఒక మంచి హోమియోపతి డాక్టర్ దొరికారు. ఆయన ఈ ఆర్ధరైటిస్ మొదటి స్టేజ్ లోనే తగ్గించగలను అని చెప్పారు. కొన్ని నెలలు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక , ఆ డాక్టర్ ఇచ్చిన మందులు పని చేయడం మొదలుపెట్టడం గమనించాను. కొంచెం ఊరట కలిగింది. దాదాపు ఒక సంవత్సరం ట్రీట్మెంట్ తర్వాత నా చేతులకు కొంచెం శక్తి ,పటుత్వం వచ్చాయి. మంచి హోమియోపతి డాక్టర్ ని కలుసుకొనేలా చేసి నాఆర్ధరైటిస్ ని తగ్గించినందుకు బాబా మీకు శతకోటి ధన్యవాదాలు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆపదలో ఆపద్భాందవుడు – బాబా 1వ భాగం.
- సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 2 వ భాగం
- కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా 2వ బాగం…
- బాబా ప్రసాదించిన సంతానం
- ఒక డాక్టర్ గారి భార్య శరీరం లో ఉన్న భూతం వదిలించిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments