Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
తాను పత్రిలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించానని స్వయంగా బాబాయే మహల్సాపతికి తెలియజేసినట్టుగా కొంత సమాచారం వారి పరిశోధనల ద్వారా తెలియవచ్చింది.
బాబా శిష్యుడు స్వామి శరణ్ ఆనంద్ కూడా బాబా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని చెప్పాడు. దానిని సోదాహరణంగా ఇలా తెలియజేశాడతను.ఆనంద్ తండ్రి జలోదరంతో బాధపడేవాడట! చికిత్సకు అందక ఆ జబ్బు అతన్ని బాధించేదట!
అప్పుడు తండ్రిని బాబా దగ్గరకు తీసుకుని వెళ్ళేందుకు ఆనంద్ ఆత్రపడుతోంటే, తండ్రి అందుకు నిరాకరించాడనీ, దానికి కారణం బాబా ఫకీరు అని, తానేమో బ్రాహ్మణుణ్ణని, చికిత్స కుదరదన్నారట!
అయితే విషయం ముందుగానే గ్రహించిన బాబా ఆనంద్‌తో ఇలా అన్నారట!‘‘నేనూ బ్రాహ్మణుణ్ణే’’యోగి మాధవ్‌నాథ్ కూడా సాయిబాబా పత్రిలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడని తెలియజేశారు.
సంప్రదాయబద్ధులయిన బాబా తల్లిదండ్రులు, పిల్లాణ్ణి సన్యాసం స్వీకరించాల్సిందిగా ప్రార్థించడంతో బాబా ఎనిమిదేళ్ళ వయసులో ఇంటిని వదిలేశారట! అప్పుడు ఒక ఫకీరు బాబాని చేరదీశారని, అతని దగ్గరే పన్నెండేళ్ళ వరుకు అంటే నాలుగేళ్ళ పాటు బాబా ఉన్నారంటారు.ఆనాటికి దేశంలో సూఫీమతం బాగా ప్రచారంలో ఉన్నమాట నిజం.
సూఫీ యోగుల్ని హిందువులు బాగా ఆరాధించేవారు. ఫలితంగా హిందూ శిష్యుల్ని సూఫీ యోగులు చేరదీసేవారు. ఈ కారణంగా బాబా హిందువు అంటారు కొందరు. అందుకు కొన్ని ఆధారాలు కూడా చెబుతారు.
బాబా ఫకీరులా ఉన్నా ఆయనకు చెవులు కుట్టి ఉండేవంటారు. అంతేకాదు, హనుమంతుడు అంటే బాబాకి చాలా నమ్మకం అని, ఆ నమ్మకానికి కారణం తాను హిందూ కావడమేనంటారు కొందరు. ఎందరు ఎన్ని అనుకున్నా తాను రెండు మతాలకూ చెందిన వాణ్ణని అంటారు బాబా.
రెండు మతాల్నీ సమానంగా గౌరవించేవారు. మతం కన్నా మనిషి గొప్పవాడు అనేవారు. కులం కన్నా గుణం గొప్పదనేవారు.
ప్రతి రోజూ బాబా క్రమం తప్పకుండా కొన్ని పనులు చేసేవారు. షిరిడీ గ్రామ పొలిమేరల్లో ఉన్న మర్రిచెట్టు కింది బావి దగ్గరే ఆయన కాలకృత్యాలు తీర్చుకునేవారు. అక్కడే ముఖ ప్రక్షాళన చేసి, స్నానం చేసేవారు. ‘ధౌతి’ యోగాను కూడా అక్కడే సాధన చేసేవారాయన.
మూడు అంగుళాల వెడల్పు, ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మింగి, అరగంటపాటు కడుపులో ఉంచి, దానిని బయటికి తీయడాన్ని ‘ధౌతి’ అంటారు. ఇలా చేస్తే కడుపులోని ఊపిరితిత్తులు, పేగులు శుభ్రమవుతాయి.
కాని బాబా చేసే ‘ధౌతి’ వేరే విధంగా ఉండేది. ఊపిరి తిత్తుల్ని, పేగుల్ని బాబా వమనం చేసుకునేవారు. బయట పడ్డ వాటిని తీసుకుని, నీళ్ళలో శుభ్రంగా కడిగేవారు. కడిగిన వాటిని ఎండలో ఆరబెట్టేవారు. ఎండిన తర్వాత మళ్ళీ వాటిని మింగేసేవారు. దీనిని షిరిడీ వాసులు చాలా మంది చూసి, భయంతో పరుగులు దీశారు.
యోగవిద్యలో నిష్ణాతులు బాబా. ఆ విషయాన్ని చెప్పడం ఆయనికి ఇష్టం ఉండేది కాదు. కాకపోతే ద్వారకామాయిలో రకరకాల యోగవిద్యలను సాధన చేస్తూ ప్రదర్శించేవారు బాబా.
ఖండయోగం కూడా సాధన చేసేవారాయన. శరీర అవయవాల్ని దేనికది వేరు చెయ్యడాన్ని ‘ఖండయోగం’ అంటారు.
తరువాతి సాయి పారాయణం భాగం కోసం ఈ క్రింది link ని click చెయండి
http://saileelas.com/telugu/దేవుణ్ణి-దర్శించుకునే/
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా ఒక అసాధారణమయిన వ్యక్తి. ఆయనతో వాదన పెట్టుకోకు-Sarana Nanda-3–Audio
- బాబా ఆశీర్వదించి దృష్టిని ప్రసాదించారు
- భక్తి శ్రద్దలతో చేసిన పూజని స్వీకరించిన బాబా …!
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments