Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
వామనరావు షిరిడీ వెళ్ళేముందు తండ్రి అతనికి బాబావారి స్వభావాన్ని, ఆయన తన భక్తులను ఏవిధంగా అనుగ్రహిస్తూ ఉంటారో అన్నీ వివరంగా చెప్పాడు. ఇంకా ఇలా చెప్పాడు
“బాబా ఒక అసాధారణమయిన వ్యక్తి. ఆయనతో వాదన పెట్టుకోకు. ఆయన చెప్పే మాటలన్నీ శ్రధ్ధగా ఆలకించి, వాటిలోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన చెప్పే మాటలు మంచైనా, చెడ్డయినా, ప్రేమతో చెప్పినా లేక ఆగ్రహంతో చెప్పినా వాటిని కృతజ్ఞతా భావంతో స్వీకరించు.
అటువంటి సత్పురుషుల నుండి మనం కానుకగా ఏది స్వీకరించినా అది మన క్షేమం కోసమే”, అని హితవు చెప్పారు. తండ్రి చెప్పిన మాటలను సావధానంగా ఆలకించి, బాలభావూకు వ్రాయబడిన పరిచయ పత్రం తీసుకుని డిసెంబరు, 10, 1911 వ సంవత్సరంలో షిరిడీకి బయలుదేరాడు.
అతను షిరిడీలోకి ప్రవేశించగానే ఎదురుగా చిన్న గుంపులోనుండి “సాయి బాబాకి జై’ అనే కేకలు వినిపించాయి. మార్వాడీ టాంగావాలా టాంగాని ఆపి “ఆ గుంపు మధ్యలో నడచుకుంటూ వస్తున్న ఆయనే సాయిబాబా. కాలినడకన లెండీ బాగ్ కు వెడుతున్నారు” అన్నాడు.
అలా చెబుతూ టాంగా నుండి దిగి సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసాడు. వామనరావు కూడా టాంగా దిగి నమస్కారం చేసాడు.
వామనరావుని చూడగానే బాబా “ఈశ్వర్ ఆహేకే మెహనున్, నహీమ్హ్వన్ తో నిఘ్, అర్ధం “మానవుడవయి ఉండి భగవంతుని ఉనికినే సందేహిస్తున్నావు. ఇక్కడినుంచి వెళ్ళిపో” అన్నారు.
“నేను అన్వేషిస్తున్న భగవంతుడు ఈయనే” అనుకున్నాడు వామనరావు.
తన తండ్రి షిరిడీ వచ్చినపుడు భోజనం చేసేవేళకి బాబా షీరా తెప్పించి తన తండ్రి కష్టాన్ని తొలగించిన లీల, తన తండ్రి అనుభవం గుర్తుకు వచ్చింది.
వామనరావు నానాసాహెబ్ చందోర్కర్ నుంచి ఉత్తరం తీసుకొని రావడం వల్ల బాలాభావు అతనికి దీక్షిత్ వాడాలో బస ఏర్పాటు చేసి, బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు.
బాబాను దర్శించుకుందామనే తహతహ అతని హృదయంలో రవ్వంతయినా తగ్గలేదు. అందుచేత మరలా మార్వాడీ యాత్రికునితో కలిసి ద్వారకామాయికి వెళ్ళాడు.
కాని బాబా కోపంగా కూర్చొని ఉన్నారు. వీరిద్దరినీ ద్వారకామాయిలోకి అడుగు పెట్టనివ్వలేదు. దానితో ఇద్దరికీ భయంవేసి మధ్యాహ్న ఆరతికి వెళ్ళే సాహసం చేయలేదు.
వారు రాధాకృష్ణమాయి ఇంటిలో కూర్చొని, ఆరతి సమయంలో అక్కడినుండే బాబా దర్శనం చేసుకొన్నారు.
మధ్యాహ్నం భోజనమయిన తరువాత హైకోర్టు జడ్జీ శ్రీషింగానేతో కలిసి ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా తన చేతిని దిండుమీద ఆన్చుకొని ఆసనంమీద కూర్చొని ఉన్నారు.
రాధాకృష్ణమాయి పంపించిన ద్రాక్షపళ్లని వామనరావుకు ప్రసాదంగా ఇచ్చారు బాబా. ఆ దిండుకు ప్రక్కనే ఉన్న రాతిమీద వామనరావు కూర్చొన్నాడు.
కొద్ది నిమిషాల తరువాత భక్తుల బృందం ద్వారకామాయి వైపు రాసాగింది. భక్తులంతా తమని ప్లేగువ్యాధినుండి కాపాడి రక్షించమని వేడుకొన్నారు.
1913 వ.సంవత్సరంలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో చేరిన తరువాత సెలవులలో మే 13 న షిరిడీకి వచ్చాడు. తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వకపోవడంతో 1914 సం. మార్చ్ వరకు పదకొండు నెలలపాటు షిరిడీలోనే ఉండిపోయాడు.
అతని తల్లిదండ్రులు కుమారుడి యోగక్షేమాల గురించి, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకపోవడంతో చాలా బెంగ పెట్టుకొన్నారు. వారు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించారు.
ఆ జ్యోతిష్కుడు “మీ కుమారుడు క్షేమంగా భగవంతుని స్వర్గధామం (షిరిడీ) లో ఉన్నాడు” అని చెప్పాడు. ఆఖరికి బాబా అనుమతి ప్రసాదించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు.
1916 సంవత్సరంలో అతని స్నేహితుడు షిరిడీ ప్రయాణమయి వెడుతున్నపుడు సాగనంపడానికి స్టేషన్ కు వచ్చి, అప్పటికప్పుడే తనుకూడా షిరిడీకి బయలుదేరాడు.
అతని రాక గురించి తనకు తెలుసని చెప్పి బాబా అతనిని షిరిడీలో 21 రోజులు ఉంచేశారు.
ఒక రోజున నిర్మాణం లో ఉన్న బూటీవాడా మీదుగా వెడుతుండగా ప్రమాదవశాత్తు అతని తలమీద పెద్ద బండరాయి పడి తలకి పెద్ద గాయమయింది. రక్తం బాగా కారడం మొదలయింది.
దాంతో తెలివితప్పి పడిపోయాడు. కాని బాబా ఇచ్చిన మందులతో, ఆయన అనుగ్రహంతో తల లోపల ఎటువంటి గాయం, ఆఖరికి దెబ్బ తగిలిన మచ్చ కూడా లేకుండా కోలుకొన్నాడు.
గాయం గురించి వామనరావుని అడిగినపుడు తనకు ఎంతో ఆధ్యాత్మికానందం, అనుభూతి కలిగాయని చెప్పాడు. ఆ రోజునుండి బాబాకు అంకిత భక్తుడయ్యాడు. బాబా మీద స్థిరమయిన నమ్మకం కలిగింది.
రేపు తరువాయి భాగం ….
శ్రీ సాయి అంకిత భక్తుడయిన స్వామి శరణానంద గారి గురించిన సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- స్వామి శరణానంద ఒకటవ భాగం–Audio
- వామన నార్వేకర్
- స్వామి శరణానంద రెండవ భాగం–Audio
- యోగవిద్యలో ఆరితేరిన వ్యక్తి బాబా
- చిన్ననాటి స్నేహితునితో కలయిక (తాత్యాసాహెబ్ నూల్కర్)–Tatya Saheb Nulkar.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments