Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – ఐదవ భాగం -గీతాంజలి
నిన్నటి తరువాయి భాగం
ఉదయం 9 గంటల దర్శనానికి మాకు పాసులు ఉన్నాయి. మాకు నిర్ణయించిన టైము ప్రకారం శని గేట్ వద్దకు వెళ్ళి పాసులు చూపించి, దర్శనానికి వెళ్ళాము. బాగా రద్దీగా ఉన్నా కూడా, శనివారమునాడు మేము చక్కగా దర్శనం చేసుకోగలిగాము. షిరిడీ నుండి బయలుదేరేముందు ఇదే మా ఆఖరి దర్శనం. తిరిగి వెళ్ళడానికి అనుమతినిమ్మనీ, తిరుగుప్రయాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిపించమనీ బాబాని అనుమతి అడిగాను.
మందిరంలో కావలసినంత సేపు ఉండి దర్శనం చేసుకొనే భాగ్యం కలిగింది. స్వామిగారు, ఆయన భార్య, నేను అందరం బయటకి వచ్చాము. నా భర్త 1,2 నిమిషాలలో తనూ వస్తానని చెప్పారు. 10 నిమిషాలు గడిచినా, ఆయన మందిరంలోనించి బయటకి రాలేదు. మేము బయటకు వస్తున్నప్పుడు ఆయన లోపలే ఉన్నారని ఖచ్చితంగా తెలుసు. కానీ సందేహంతో ద్వారకామాయిలోకి, చావడిలోకి వెళ్ళి చూశాము. కానీ కనపడలేదు.
అక్కడ ఆవరణలో ఉన్న ఇతర మందిరాలకు, గురుస్థాన్ దగ్గిర, మ్యూజియం దగ్గర అంతా వెతికాము కాని ఎక్కడా కనపడలేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది, కానీ నా మనసెందుకో ఆయన సమాధి మందిరంలోనే ఉన్నారని చెపుతోంది. ఆయన బయటకు రాలేదు. ఎనౌన్స్ మెంట్ సెంటర్ నించి కూడా ఎనౌన్స్ మెంట్ ఇప్పించినా ఏమీ తెలీలేదు.
మేము శని గేట్ వద్ద (మేము మా చెప్పులను ఉంచినచోట) కూర్చుని ఆయనకోసం ఎదురు చూద్దామని నిర్ణయించుకున్నాము. 40నిమిషాల తరువాత నా భర్త సమాధి మందిరంలోనించి బయటకు వచ్చారు. నేను నమ్మలేకపోయాను, కారణం సాధారణంగా దర్శనం అయిన వెంటనే గార్డు అందరినీ బయటకు తోసేస్తూ ఉంటాడు. ఆయనకి 40 నిమిషాలపాటు దర్శనం కలగడమేకాదు, పూజారిగారు తనంత తానుగా ప్రసాదం కొబ్బరికాయ ఇచ్చారు.
ఆయన బయటకు వచ్చాక నాకు అసూయ కలిగింది. నన్నెందుకు తొందరగా బయటకు పంపించేశావు అని బాబాకి ఫిర్యాదు చేశాను. కాని నా భర్తను అంతలా అనుగ్రహించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఆఖరిసారిగా ద్వారకామాయిని, చావడిని దర్శించుకుని, షిరిడీనించి బాబాకు వీడ్కోలు చెప్పాము. మమ్మల్ని షిరిడీ తీసుకువచ్చిన ఆటో డ్రైవరునే పిలిచి కోపర్గాఁవ్ లో ఉన్న చవన్ బాబా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళమని చెప్పాము. మేము ద్వారావతి నుండి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి ఆశ్రమానికి 3.30 కి చేరుకున్నాము.
అక్కడికి చేరుకున్నాక మొదట బాబాని దర్శించుకుని, అక్కడి పూజారిగారిని చవన్ బాబాగారు ఉన్నారా అని వాకబు చేశాము. నేనింతకుముందు నా తల్లిడండ్రులతో వచ్చినపుడు ఆశ్రమానికి వచ్చాను. కాని అప్పుడు చవన్ బాబాగారిని కలుసుకోలేకపోయాను. ఆయన గురించి చాలా విన్నాను.
కాని నా మనసు కొంచెం చంచలంగా ఉండి, నాలో కొంచెం వణుకు వచ్చింది. మేము ఆశ్రమంలోకి వెళ్ళినపుడు ఆయన అప్పటికే అక్కడ వున్న నలుగురితో మాట్లాడుతున్నారు. మా వంతుకోసం నిరీక్షిస్తూ మేమొక మూల నిలబడ్డాము. హఠాత్తుగా ఆయన నా వైపుకు తిరిగి ముందుకు రమ్మన్నారు.
(ధోండీరాం బాబా చవన్ బాబా)
“గోలీ ఖా కే ఆయీ హై. జబ్ భీ దేఖో పైన్ కే లీయే గోలీ ఖాతీహై, ఆజ్ సే గోలీ బంద్” అన్నారు. (అర్ధం : టాబ్లెట్ వేసుకుని నువ్వు ఇక్కడకు వచ్చావు. ప్రతీదానికి నువ్వు టాబ్లెట్లు అవీ వేసుకుంటావు. ఈరోజునుంచీ ఏ టాబ్లెట్లు, డాక్టర్ అవసరం లేదు) నాకు చాలా ఆశ్చర్యమనిపించింది, అంతకుముందే షిరిడీనించి బయలుదేరేటప్పుడు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకున్నాను.
మా అందరితోనూ ఆయన అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నన్ను, స్వామిగారి భార్యని ‘సంతాన ప్రాప్తిరస్తు’ అని దీవించి శెలవు ఇచ్చారు. వెళ్ళబోయేముందు ఆయన నాతో, “ఆపరేషన్ అవసరం లేదు. బాబా ఊదీని నీటిలో కలిపి తీసుకో. అంతా సరి అవుతుంది” అని చెప్పారు. గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకోవడమా, మానడమా అన్న ప్రశ్నకి నాకు సమాధానం లభించినట్లయింది.
ఆయన మా భర్తలకు “పుఖ్ రాజ్ ” రాళ్ళను ఇచ్చి వాటిని ధరించమని చెప్పారు. మేము ఆయన పాదాలకు నమస్కరించి ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరాము. ఆయన మమ్మల్ని దీవించారు. మేము సరైన సమయానికి స్టేషనుకి చేరుకుని క్షేమంగా బెంగళూరు చేరుకొన్నాము.
నా ఈ అనుభవాన్ని పూర్తి చేస్తున్న సమయంలో, నేను మళ్ళీ షిరిడీకి వెళ్ళినంతగా అనుభూతి చెందుతున్నాను. జన్మజన్మలకూ ఆయన పాదాలవద్దే నాకు ఆశ్రయమిమ్మనమని ఆయన పాదాలకు ప్రణమిల్లుతున్నాను. ఈ అనుభవాన్ని చదివిన సాయిబంధువులందరికీ బాబా తమ ఆశీర్వాదములనిమ్మని, మన జీవితాలలో వెలుగును నింపమని ఆయనను వేడుకుంటున్నాను.
ఇంత సుదీర్ఘంగా ఈ నా అనుభవాన్ని మీకు తెలిపినందుకు నన్ను మన్నించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాని నాకు ఏది వదలివేయాలో, ఏది రాయాలో తెలీదు. నా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించమని మిమ్మల్ని కోరుతున్నాను.
డాక్టర్స్ అందరూ కూడా గాల్ బ్లాడర్ తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కాని ఆపరేషన్ కి నా మనసెందుకనో ప్రస్తుతానికి అంగీకరించటంలేదు. ప్రస్తుతం నేను హోమియోపతీ మందులు వాడుతున్నాను. మీ అందరి ప్రార్థనలు, బాబా ఆశీస్సులు ఫలించి నాకు నయమవుతుందనే నమ్మకం నాకుంది.
అందరికీ బాబా ఆశీర్వాదములు లభించాలని బాబాకు ప్రణమిల్లుతున్నాను.
(అయిపోయింది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – నాల్గవ భాగం
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – రెండవ భాగం–Audio
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మొదటి భాగం–Audio
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మూడవ భాగం–Audio
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మొదటి భాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments