షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – రెండవ భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-40-Anugraham-2-by-Lakshmi-Prasanna 6:17

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం

మా రైలు బెంగళూరులో రాత్రి 7.30 కి బయలుదేరుతుంది. ఆరోజు వర్కింగ్ డే మూలాన స్వామిగారు,

ఆయన భార్య, నా భర్త ఆఫీసులకు వెళ్లిపోయారు. ఆఫీసు నుంచి తిన్నగా మెజెస్టిక్ స్టేషన్ కి  రావాలి.

మరొక విషయమేమిటంటే నేను బాబాకి కోవా ఇద్దామనుకున్నాను. ఇంటికి వచ్చేటప్పుడు 1 కే.జీ. కోవా తీసుకురమ్మని నా భర్తతో చెప్పాను.

దారిలో ట్రాఫిక్ జాం వల్ల నా భర్త ఆలస్యంగా 6.30 కి యింటికి వచ్చారు. కోవా తీసుకురావడం మర్చిపోయారు.

కోవా తీసుకురానందుకు నాకు చాలా నిరాశ కలిగింది. మాయింటికి స్టేషన్ దూరంలో ఉండటంవల్ల సరైన సమయానికి స్టేషనుకు చేరుకోలేమోనని నాకు ఆందోళనగా ఉంది.

మేము యింటి నుంచి మా మరిదితో కారులో 6.45 కి బయలుదేరాము.

ఆ సమయంలో అందరూ ఆఫీసులనుంచి తిరిగి వచ్చే వేళ కావడంతో ట్రాఫిక్ లో మేము చాలాసేపు చిక్కుకుపోయాము. 

నా భర్త స్వామిగారికి ఫోన్ చేసి ‘నువ్వు ఎక్కడ ఉన్నావు?’  అని అడిగారు. తాను కూడా దారిలో ఉన్నాననీ, 

రైలు బయలుదేరేవేళకి స్టేషన్ కి చేరుకుంటానని చెప్పారు. ఆయన భార్య కూడా ఆటోలో వస్తూ దారిలో ఉంది.

ట్రాఫిక్ లో  చాలా ఆలస్యం అయిపోవచ్చని భావించి, నా భర్త దగ్గరలో ఉన్న బెంగళూరు కంటొన్మెంట్ స్టేషన్ కి వెడదామని చెప్పారు.

దీని వల్ల మాకు సమయం కలిసివచ్చి సరైన టైముకి రైలు అందుకోగలుగుతాము.

నిమిష నిమిషానికి నాలో ఆశ సన్నగిల్లుతోంది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 10 నిమిషాలు ఆగిపోవలసివచ్చింది. అక్కడినుంచి ఆటోలో తొందరగా, మూడవ స్టాప్ యెలహంక స్టేషన్ కి సరిగా 8.15 కి రైలు చేరుకుంటుందని,

ఆ టైముకి రైలు అందుకోవచ్చని చెప్పారు.

టైము 7.25 అయింది.  మేము స్వామికి ఫోన్ చేసి రైలు సిధ్ధంగా ఉందా అని అడిగాము.

తాను అప్పుడే స్టేషన్ కి చేరుకుని రైలు ఎక్కినట్లు చెప్పారు. తన భార్య ఇంకా స్టేషన్ కి రాలేదని చెప్పారు.

మరొక 5 నిమిషాలలో రైలు బయలుదేరుతుందనీ, ఆలోగా తన భార్య, మేము కూడా రైలు అందుకోలేమని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఒకవేళ తాను స్టేషన్ కి చేరుకోలేకపోతే  3 వ స్టేషన్ లో మాకు టిక్కెట్లనిచ్చి షిరిడీకి వెళ్ళమని తన భార్య చెప్పిందని స్వామిగారు చెప్పారు.

ఇప్పుడు స్వామి తప్ప మేమెవరమూ రైలు ఎక్కలేదు.

మేమింక మా ప్రయాణం మానుకోవలసిందేనని అనుకున్నాము. 7.35 కి మేము మళ్లీ స్వామికి ఫోన్ చేసి తన భార్య వచ్చినదా లేదా అని, రైలు బయలుదేరిందా లేదా అని అడిగాము.

తన భార్య అప్పుడే వచ్చిందనీ, రైలు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు స్వామిగారు. ఒకవేళ మేము రైలు అందుకోలేకపోతే వాళ్ళని షిరిడీ వెళ్ళిపొమ్మని చెప్పాము.

ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండటం వల్లా, మా ఆటో చాలా మెల్లిగా వెడుతూండటంవల్లా,

మేము మూడవ స్టేషనుకైనా చేరుకుంటామనే ఆశ కూడా పోయింది. మేము స్వామికి ఫోన్ చేసి రెండవ స్టేషన్ రాగానే మాకు ఫోన్ చేయమని చెప్పాము. 7.55 కి ఫోన్ చేసి రైలు రెండవ స్తేషన్ ని సమీపిస్తోందని చెప్పారు.

మేమిక స్టేషన్ కి చేరుకుంటామనగా ఆ క్షణంలోనే జరిగింది అనుకోని సంఘటన (చిన్న ట్విస్ట్).  స్టేషన్ కి దగ్గరగా రెండు సిటీ బస్సుల వల్ల ట్రాఫిక్ జాం అయింది.

మేము చిన్నరోడ్డు మీద ఇరుక్కుపోయాము. ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది.

నా భర్త ఆటో దిగి ట్రాఫిక్ ఆగిపోయిన చోటుకు వెళ్ళి, ఆగిపోయిన బస్సులని ఒకదాని తరువాత ఒకటి వెళ్ళమని సూచించారు.  రెండు నిమిషాలలో రోడ్డు మీద ట్రాఫిక్ యథాస్థితికి వచ్చింది.

నాభర్త నా చేయి పట్టుకుని ఫరవాలేదు, భయపడకు, నీకు నీ బాబా దర్శనం చేయిస్తాను అని చెప్పారు. నమ్మకం ఉంచు అన్నారు.

రైలు అప్పటికే రెండవ స్టేషన్ నుంచి బయలుదేరింది. 15నిమిషాలలో యెలహంక చేరుకుంటుంది. మేము స్టేషన్ కి చేరుకునేటప్పటికి రైలు వస్తోందని అనౌన్స్ మెంట్  వినిపించింది.

నా భర్త, “ప్లాట్ ఫారమ్ మీద డెయిరీ పార్లర్ షాపు ఉంది, నీకేమన్నా కావాలా?” అని నన్నడిగారు. నేను చాలా ఆత్రుతలో ఉన్నాను. అందుకే నాకేమీ వద్దని చెప్పాను.

నాభర్త డైరీ పార్లర్ నుంచి ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున 10 కోవా పెట్టెలు తీసుకుని వచ్చారు. షాపులో చిన్న ప్యాకెట్లే ఉన్నాయనీ, అందుకే అవి తీసుకువచ్చాననీ చెప్పారు.

మేము బయలుదేరడానికి ముందే బాబా నా కోరికను ఆవిధంగా తీర్చినందుకు నేనెంతో ఆనందపడ్డాను.

స్వామి దంపతులని చూసాక మా మనసు ఆనంద పారవశ్యంతో నిండిపోయింది.

ఈ మా రైలు ప్రయాణం ఇంతకు ముందెపుడూ చవిచూడని ఒక విధమైన గుండెలు ఝల్లుమనిపించే అనుభూతి. ఇక మా రైలుప్రయాణం సాఫీగా జరిగి, శుక్రవారము మధ్యాహ్నం 1.30కి కోపర్గాఁవ్ చేరుకున్నాము.

అక్కడినించి ఆటోలో షిరిడీ చేరుకున్నాము. కానీ కోపర్గాఁవ్ నించి బయలుదేరేముందు నేను తపోభూమిలో ఉన్న మందిరానికి వెడదామనుకున్నాను, కాని అందరూ బాగా అలసిపోయి ఉంటారని భావించి తిరుగు ప్రయాణంలో చూడవచ్చులే అనుకున్నాను.

బాబా నా మనోభావాలని చదువుతున్నారనిపించింది. ఆటొ అతను ఆటోని తపోభూమి మందిరం ముందు ఆపి దాని చరిత్రను కొంత చెప్పి, షిరిడీకి వెళ్ళేముందు అక్కడ దర్శనం చేసుకోమని చెప్పాడు.

మాకు అక్కడ మంచి దర్శనభాగ్యం కలిగింది.  తరువాత షిరిడీకి బయలుదేరాము.

రేపు తరువాయి భాగం

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles