షిర్డీ లో నేను(సాయి సురేష్) పొందిన అనుభవాలు 2వ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

మూడవ రోజు మార్నింగ్ కాకడారతికి వెళ్దాం అనుకున్నాము కానీ లేవడం ఆలస్యమై,  శ్రీనివాస మూర్తి గారు  టైం కి కాకడారతి కి వెళ్లారు గాని, నేను హారతి చివరిలో ద్వారకామాయి కి వెళ్లి బాబా దర్శనం చేసుకొని కొంత సమయం కూర్చొని సమాది మందిరం దర్శనం కు వెళ్ళాను. బాబా దర్శనం తో తనివి తీర ఆనందించి మా ఫ్రెండ్  వస్తాడని రూమ్ కి వెళ్తున్నాను. నేను షిర్డీ వెళ్ళే ముందు బాబా మీరు ఎందరో భక్తులకు షిర్డీ లో సజీవ దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ నేను ఇన్ని సార్లు షిర్డీ వచ్చిన నాకు అటువంటి అనుభవం కలుగలేదు. ఈ సారైనా నాకు మీ దర్శనం ఇవ్వండి అనుకున్నాను. నేను షిర్డీ వెళ్ళిన మొదటి రెండు రోజులు బిచ్చగాళ్ల అందరిని అడుగుతున్నారు కానీ నన్ను ఎవరు అడుగలేదు. బాబా ఏ రూపంలోనైన రావొచ్చు. ఈ బిచ్చగాళ్ల రూపంలో కూడా రావొచ్చు. అలా వస్తే మీరు నన్ను ప్రత్యేకంగా అడిగితే నేను ఇస్తాను అని అనుకున్నాను. నేను రూమ్ కి వెళ్తుండగా లక్ష్మి మందిరం వద్ద ఒక ముసలి వ్యక్తీ నిలబడి ఉన్నారు. అతను ఎవరిని ఏమి అడగటం లేదు. నేను అతని వద్దకు రాగానే టీ త్రాగడానికి డబ్బులు అడిగారు. నేను పట్టించుకోకుండా నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిపోయాను. అప్పుడు  నా సంకల్పం గుర్తువచ్చి 2 రూపాయలు యివ్వలనుకున్నాను. కానీ 2 రూపాయలకు టీ ఏమి వస్తుందని. 10 రూపాయలు ఇవ్వాలని వెనుకకు వెళ్లి, అతని కి 10 రూపాయలు ఇచ్చాను.  వెంటనే అతడు సాయిరాం అని నా శిరస్సుపై తమ రెండు చేతులు ఉంచి ఆశీర్వదించారు. అతను నా తలపై వారి చేతులు ఉంచగానే నా తల అంత చాలా చల్లగా అనిపించింది. ఆ చేతి స్పర్శకు నాకు ఏంతో హాయ్ గా, ప్రశాంతంగా అనిపించింది. తర్వాత నేను రూమ్ కి వచ్చాక గాని అర్ధం కాలేదు. ఆ రూపంలో వచ్చింది  ఎవరో కాదు నా బాబా అని.  చాల బాధపడ్డాను. నేను ఏవిధంగా బాబా దర్శనం కావాలని కోరుకున్నానో అదే రూపంలో బాబా వచ్చినప్పటికీ గుర్తించలేని అజ్ఞాని. బాబా సజీవ దర్శనం ఇచ్చిన బాబా పరిక్షిస్తారో, లేక మాయ ప్రలోభ పెడుతుందో కానీ ఆ క్షణం లో గుర్తించలేకపోయాను. అయినప్పటికీ బాబా దర్శనం, ఆశీస్సులు లభించాయి. అదే మహదానందం.

చివరి రోజు మేము కార్తీక పౌర్ణమి సందర్బంగా సాయి సత్యవ్రతం చేసుకున్నాము.  కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేసుకుంటాము. మన కు మన బాబా యే కదా ఆ కేదరినాధుడు, అందువలన ఆ రోజు సాయి సత్యవ్రతం ఎందుకు చేసుకోరాదు అని అనిపించేది. ఆ కోరికను బాబా ఈ రూపంలో తీర్చారు. ఈ సంవత్సరం సరిగా కార్తీక పౌర్ణమి రోజు షిర్డీ లో ఉండేలా చేసి పవిత్రమైన షిర్డీ క్షేత్రంలో సాయి సన్నిధిలో సాయి సత్యవ్రతం చేసే అవకాసం ఇచ్చి ఆ కేధారినాదుడే తమని నిరూపించారు..

ఎప్పుడు షిర్డీ వెళ్ళిన తిరిగి వచ్చే సమయంలో చాలా  భాధ  కలుగుతుంది. షిర్డీ విడిచి వేల్లిపోతున్నాము, మళ్ళి ఎప్పుడు వస్తామోనని. బహుశా చాలా మంది భక్తులు కూడా ఈ భాధ అనుభవిస్తారు. ఈసారి కూడా చివరి క్షణం ఆసన్నమైంది. కానీ ఈసారి ప్రత్యేకమైనది. చివరిగా మేము ద్వారకామాయి గేటు వద్ద నుండి బాబా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని నిర్ణయించుకొని రూమ్ నుండి లగేజి తో బయలుదేరాము. ముందు గా చావడిలోనికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. ఆశ్చర్యము బాబా ముఖంలో ఒక రకమైన ఆనంద పారవశ్యాన్ని చూసాను. అది నిజామా, కల అని మనసులో అనుకున్నంత లో నిజమే అని బాబా తెలుపుతున్నట్లు పరిమిలాల వాసన వచ్చింది. చాలా సంతోసమనిపింసింది. అక్కడి నుండి ద్వారకామాయి గేటు వద్దకు వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుంటే, భక్తులు బాబా దర్శనం చేసుకుంటుంటే బాబా మాత్రం ప్రత్యేకించి నన్ను చూస్తున్న అనుభూతి పొందాను. బాబా వారు సంతోషంగా వెళ్ళిరమ్మని ఆశీర్వదించారని అనిపించి మాటలలో చెప్పలేని ఆనందం అనుభూతి చెందను. గత 4 రోజులుగా చూస్తున్న ద్వారకామాయిలో గాని, చావడిలో గాని బాబా వద్ద నాకు ఏవిధమైన అనుభూతి కలగలేదు. కానీ చివరి దర్శనంలో నాకు ఈ రెండు చోట్ల గొప్ప అనుభూతి ని ప్రసాదించి నా మనస్సుని పరవశింపజేసారు. ఆ ఆనందంతో ఎటువంటి బాధ లేకుండా హ్యాపీ గా షిర్డీ నుండి తిరిగి వచ్చేసాను. ఇప్పటికి కనులు మూసుకుంటే చాలు ఆ చివరి దర్శనం కనుల ముందు మెదిలి ఆనందానుభూతి కలుగుతుంది. ఇదంతా వింతగా అనిపించవచ్చు కానీ ఇది నాకు ప్రత్యక్ష అనుభూతి.

నాకు ఇంత మంచి అనుభవాలను ప్రసాదించి ఆనందపారవశ్యంలో ముంచిన నా గురు సాయి కి నా శతకోటి ప్రణామాల దక్షిణ సమర్పించుకుంటున్నాను. అందరికి అనుభవాలను ప్రసాదించి వారి భక్తీ ని పంపొందింపజేయాలని సాయి ని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles