షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామము – 2 వ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

నిన్నటి తరువాయి బాగం….%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b0%be-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a6-%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%81

సాయి నిజ పాదుకల చరిత్ర:

షిర్డీ సాయిబాబా ప్రతీరోజూ 5 ఇళ్ళలో బిక్ష చేసేవారు. అలా బిక్ష చేసే ఇళ్ళలో శ్రీ వామన్ రావ్ గొండ్కర్ ఇల్లు కుడా ఒకటి. అలా బిక్ష రూపంలో తీసుకుని వచ్చిన పదార్ధాలలో కొంత ద్వారకామాయి దగ్గర ఉండే కుక్కలకూ, పక్షులకూ, పిల్లులకూ రోజూ ఒకే ప్రదేశంలో ఒక బండ మీద నిలబడి జల్లేవారు. తదుపరి జంతువులు స్వేచ్చగా వచ్చి తినిపోతుండేవి. అలా అనేక సంవత్సరాలు అదే బండపై నిలబడి ఆహారం వేదజల్లడం వల్ల శ్రీ సాయిబాబా వారి పాద ముద్రలు వాటి మీద శాశ్వతంగా పడ్డాయి. ఇది వింతల్లో కెల్లా వింత. శ్రీ సాయిబాబా నిజ పాద ముద్రలు పడిన ఏకైన బండ అది. అయితే శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ప్రతి రోజూ బిక్షలో ఏదో ఒక ద్రవ పదార్ధాన్ని,(పులుసు, పాయసం, చారు లాంటివి) ఇచ్చేవారు. అది గమనించిన సాయి బండ మీద శాశ్వతంగా పడిన పాద ముద్రల మధ్య తన చూపుడు వ్రేలితో గుండ్రంగా బండ మీద తిప్పి అప్పటికప్పుడు ఒక గుంతను, (Pit Hole) చేసారు. శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ఇచ్చే ద్రవ పదార్ధాలను ఆ గుంతలో పోసేవారు.  ఒక్కోసారి పక్షుల దాహం తీర్చడం కోసం ఆ గుంతలో మంచినీళ్ళు కుడా పోసేవారు .

సాయి నిజ పాదుకలు కోర్హలె  గ్రామానికి ఎలా తీసుకుని రాబడ్డాయి?

శ్రీ సాయి బాబా మహా సమాధి అనంతరం నిజ పాదుకా ముద్రలు కలిగిన ఆ బండ శ్రీ వామన్ రావ్ గొండ్కర్ గారు భద్రపరిచారు. తదుపరి శ్రీ వామన్ రావ్ గొండ్కర్ మనవడైన అమృత రావ్ గొండ్కర్ వద్దకు ఆ నిజ పాదముద్రల బండ చేరింది. వారు ఆ నిజ పాదముద్రల బండను కలిగిన భూమిని నిజ పాద ముద్రలు పడిన బండతో సహా గుజరాతీ వారైన “భికాజీ – షకారాంషెల్కే” కుటుంబానికి అమ్మారు. భికాజీ వారు షిర్డీ  లో “Nrusimha Guest House” (నృసింహ లాడ్జ్) అనే పేరుతో ఒక లాడ్జ్ ను కట్టారు. అలా కడుతున్నప్పుడు ఈ నిజ పాదముద్రలు పడిన బండను ఒక గోడలో పెట్టి సిమెంటు చేసి స్థిరంగా ఏర్పాటుచేసారు. తదుపరి 2004వ సంవత్సరం లో షిర్డీ బాగా ఆధునీకరింపబడినది. ఆధునీకరణలో భాగంగా Nrusimha Guest House ఉన్న రోడ్డును (Pallaki Road) వెడల్పు చేయ సంకల్పించారు. అందులో భాగంగా శ్రీ సాయి బాబా నిజ పాదుకా ముద్రలు ఉన్న ఆ బండను స్థాపించిన గోడను (Nrusimha Guest House ముందు భాగాన్ని) 06/May/2004 రోజున పడగొట్టాలని నిర్ణయించారు. అక్కడి స్థానికులు ఎంత చెప్పినా అధికారులు వినలేదు. బుల్డోజార్ లతో ఆ గోడను కుల్చేసారు. వందల కొద్దీ పగిలిన ఇటుక రాళ్ళు ఆ నిజ పాద ముద్రలపై పడ్డాయి. జరిగేదంతా అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు).  తదుపరి శాకారం షెల్కే (Shakaaram Shelke) వంశస్తులైన వారు అక్కడ నిలబడ్డ ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ను చూసి “ఈ బండను మీరు తీసుకెళ్ళండి” అని వారి చేతిలో పెట్టారు. ఇది వింతలో కెల్లా వింత.. అసలుసిసలైన వింత. ఎక్కడి అబ్దుల్ జాన్ పఠాన్ కాలం(1918) ఎక్కడి 2004వ సంవత్సరం!… బాబా అన్న మాట నిలబెట్టుకున్నారు. బాబా వారి పాదాలను అబ్దుల్ జాన్ పఠాన్ వద్దకు చేర్చారు. ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ద్వారా శ్రీ సాయి నిజ పాదుకా ముద్రలు కలిగిన బండ రాయి కోర్హలె  గ్రామం చేరింది. తదుపరి అక్కడి వారు ఎవరిని అధిక మొత్తంలో విరాళాలను అడగకుండానే సాయిబాబానే మందిరం కట్టడానికి కావాల్సిన డబ్బును కుడా సమకూర్చడం వల్ల ఇప్పుడు అక్కడ (కోర్హలె లో) ఒక అందమైన సాయి బాబా మందిరం కట్టబడినది. ఎంతటి ఆశ్చర్యము.. బాబా లీలలు అంతే ఉంటాయి. శ్రీ బాబా! వారికి వారే సాటి. బాబా వస్తువులు ఎన్నో. .ఎన్నెన్నో సంస్తాన్ వారి మ్యూజియం లో చేరాయి, భద్రపరచబడ్డాయి. ఈ ఒక్క నిజ పాదుకా ముద్రలుపడిన బండ తప్ప. అది ఎప్పటికీ అబ్దుల్ జాన్ పఠాన్ వారిదే!

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles