Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయిబాబాను ‘సాయి మా’ అని భక్తులు సంబోధించే వారు.
సాయి సమకాలికురాలు బాబా జాన్. ఈమె నివాసం పూనా. నివాసం అంటే ఏమీ లేదు. పూనా కంటోన్మెంట్ లో ఒక వేప చెట్టు. సాయికి తలుపులు, కిటికీలు లేని పాడుబడ్డ మసీదే గృహం.
అయితే బాబా జాన్ తనను ‘అమ్మ’గా సంబోధించటానికి ఇష్టపడేది. దానికి ఒక కారణం ఉన్నది.
ప్రపంచాన్ని ప్రేమించేది స్త్రీ జాతి అని, దైవాన్ని ప్రేమించేది పురుష జాతి అని, స్వర్గాన్ని ప్రేమించేది నపుంసకులు అని ప్రవక్త మహమ్మద్ తెలిపారు.
ఆమె నిరంతరం దైవాన్ని స్మరించేది. అందుకే తనను పురుష జాతి క్రింద లెక్క కట్టుకున్నది.
సాయివలె ఆమె ఆహారాన్ని అతి తక్కువగా తినేది. చలి కాలంలో ఎవరో వణుకుతూ వస్తే తన ఒంటిపైనున్న శాలువాను ఇచ్చి వేసిందామె
సాయి చేయి కాలింది. మందు ఇవ్వటానికి బొంబాయి నుండి డాక్టర్ పరమానందను భక్తులు పిలిపించారు.
సాయి వైద్యం చేయించుకోలేదు. బాబా జాన్‌కు అన్ని వేళ్ళకు ఉంగరాలు ఉండేవి. అవి బంగారపు లేదా వెండి ఉంగరాలు కావు. రాగి, ఇనుము, కంచుతో తయారయినవి.
ఆ ఉంగరాల వేళ్ళకు బొబ్బలు కట్టి, పుండ్లు అయినా భరించేది, వేలు తీసివేయడానికి కూడా సంసిద్ధురాలైంది ఆమె.
కాని డాక్టరుచే చికిత్స చేయించుకొని, ఆ వ్రేలును అంటిపెట్టుకున్న పురుగులను (క్రిములను) తీసివేయ నిచ్చేది కాదు.
సాయిబాబాకు వెండి పల్లకి ఎవరో సమర్పింపగా ఆయన ”దీనిని తీసుకు పొండు. నాకు వలదు” అన్నారు.
ఆ పల్లకిని ద్వారకామాయి ప్రాంగణంలో ఉంచగా దానికి ఉన్న వెండి గుర్రములను ఎవరో దొంగిలించారు.
ఈ విషయమును సాయికి తెలుపగా ”పల్లకి మొత్తమేల దొంగిలించ లేదు” అన్నారు. ఇదీ సంపదల పట్ల సాయి ప్రవర్తన.
బొంబాయి భక్తుడొకడు భక్తితో బాబా జాన్‌కు బంగారు గాజులను తొడిగినాడు. ఆ నాటి రాత్రి ఒక దొంగ వచ్చి ఆమె చేతుల నుండి గాజులను మెల్లగా తీసి దొంగింలించాడు.
బాబా జాన్‌కు ఈ విషయం తెలుసు. అయినా ఆమె నిశ్శబ్దంగా ఉండి, గాజులను దొంగిలించటానికి సహకరించింది. ఇది ఆమె సంపదల పట్ల నిర్వ్యామోహత్వము.
సాయిబాబా ”మా ఖజానా నిండి పొంగి పొర్లుతున్నది. ఒక్కడూ బండి తెచ్చుకొని తీసుకు పోడు” అనే వాడు.
బాబా జాన్ ”నేను ఇచ్చే సరకులను ఎవరూ కోరటం లేదు వాటిని ఆ ఇచ్చిన దాతకే ఇచ్చివేస్తాను” అనేది. ఆమె సెప్టెంబరు 21, 1931లో సమాధి చెందింది.
కనీసం మనం ఆ సరుకులను సంపాదిద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఫకీరుగా ఉంచండి …. మహనీయులు – 2020… సెప్టెంబరు 21
- గజానన…..సాయి@366 సెప్టెంబర్ 8…Audio
- బాబా …..సాయి@366 జనవరి 28….Audio
- కర్రలతో కొడతాను…..సాయి@366 నవంబర్ 5….Audio
- షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామము – 1 వ బాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments