షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామము – 1 వ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ / షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకలు ఎక్కడ ఉన్నాయి?

షిర్డీ సాయి నిజ సహజ పాదుకలు రహత తాలుకా లో షిర్డీ కి 8 KMs దూరంలో క్రొత్తగా నిర్మిస్తున్న Shirdi Airport కు సమీపంలో గల కొర్హలె(Korhale) అనే గ్రామంలో శ్రీ షిర్డీ సాయి మందిర్ లో కలవు. కొర్హలె – డోర్హలె (Korhale – Dorhale) అనేవి రెండు జంట గ్రామాలు. ఈ రెండు గ్రామాలను కోరాల-డోరాల ( Koraala – Doraala) అని ఇక్కడి వారు పిలుస్తారు. ఆటో రిక్షా వారికి కుడా కోరాల-డోరాల జంట గ్రామాలలోని కోరాల సాయి మందిర్ కు తీసుకుని వెళ్ళమని అడగాలి. ఈ రెండు గ్రామాలలో ఉన్న బంజరు భూముల్లో గులాబీ, సబ్జా వంటి మొక్కలు పెంచుతారు. వీటిని పూల బోకే (Flower Bokeh) లాగ చుట్టి షిర్డీలో సాయి సమాధి మందిరం వద్ద అమ్ముతారు.  షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామ ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. కోరాల నుండి 2 KMs దూరంలో గల డోరాల (Doraala) గ్రామం నందు నవనాథ దేవాలయం కలదు. ఇది కుడా చూడవలసిన ప్రదేశమే.

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ చరిత్ర / స్థలపురాణం

అబ్దుల్ జాన్ పఠాన్ అనే ముస్లిం యువకుడు తార్బెల’ అనే గ్రామ (ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్తాన్ లో ఉంది) వాస్తవ్యుడు. అతను చిన్న నాటి నుండి ; హిందూద్వేషి;.  అతని  జీవిత ఆశయం ఎలాగైనా; మక్కా’ యాత్ర చేయాలనీ, తదుపరి శేషజీవితం అక్కడే (మక్కాలో) గడపాలనేది అతని లక్ష్యం. అయితే మక్కాయాత్ర చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు కావాలి. పుట్టుక తోనే కడు బీదవాడైన అబ్దుల్ జాన్ పఠాన్ తన జీవిత లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎలా డబ్బు సంపాదించాలో ఆ గ్రామంలో గల తన తోటి వారిని అడిగినప్పుడు వారు, ” జీవిత లక్ష్యం అయిన మక్కాయాత్ర చేయాలంటే నిన్ను అక్కడకు పంపే దాతను (Sponsor) ముందుగా వెతుక్కోవాలి. అటువంటి దాతలు మన ప్రాంతంలో అతి అరుదుగా ఉన్నారు. నువ్వు ఉన్న పళంగా బొంబాయి దగ్గరలో గల మన్మాడ్ చేరుకో. అక్కడ Shirdi అనే గ్రామంలో సాయి ఫకీర్  అనే ఒక మహ్మదీయ ఔలియా ఉన్నారు. వారికి కొద్ది రోజులు భక్తుడిగా ఉండు. తదుపరి వారి భక్తుడిని అని చెప్పుకో… నీకల వెంటనే నెరవేరుతుంది. ఆయనే నిన్ను ఎవరి ద్వారానైనా మక్కాకి పంపించవచ్చును కుడా! వెంటనే బయలుదేరు” అని చెప్పారు. వారిచ్చిన సలహా నచ్చిన అబ్దుల్ జాన్ పఠాన్ తార్బెల నుండి బొంబాయి, బొంబాయి నుండి మన్మాడ్ చేరి తదుపరి అక్కడ నుండి Shirdi చేరాడు. అక్కడ ఊరు బయట గల ద్వారకామాయిలో ఉన్న సాయిబాబా వారిని దర్శించాలనీ, దర్శనానంతరం తన; మక్కాయాత్ర డబ్బు’ విషయం విన్నవించుకోవాలని అనుకున్నాడు. అబ్దుల్ జాన్ పఠాన్ ద్వారకామాయికి చేరుకునే సమయానికి అక్కడే ఉన్నారు శ్రీ సాయిబాబా.  అబ్దుల్ జాన్ పఠాన్ ను చూసిన సాయిబాబా ఏమీ మాట్లాడలేదు. కేవలం ఇరువురి చూపులు మాత్రమే కలుసుకున్నాయి. బాబాను చూసిన అబ్దుల్ జాన్ పఠాన్ కుడా ఏమీ మాట్లాడలేదు, ఏ విన్నపమూ విన్నవించుకోనూ లేదు. అలాగే అబ్దుల్ జాన్ పఠాన్ ను చూసిన సాయిబాబా ఏమీ మాట్లాడ లేదు. ఆ విధంగా రోజు పొద్దున్న- సాయంత్రం ఇరువురి చూపులు కలిసేవి, అంతే. అది తప్ప ఇంకేమీ జరిగేది కాదు. అలా కొద్ది రోజులు గడిచిన తదుపరి అక్కడి వారు అబ్దుల్ జాన్ పఠాన్ వచ్చిన కారణం అడిగి తెలుసుకున్నారు. తదుపరి బాబా వారితో సన్నిహితంగా ఉండే “అబ్దుల్ ” అనే మరొక ముస్లిం భక్తుడి ద్వారా అబ్దుల్ జాన్ పఠాన్ యొక్క జీవిత లక్ష్యాన్ని బాబాకు విన్నవించారు. అంతా సావదానంగా విన్న సాయి “ఇక్కడ అందర్నీద్వేషిస్తూ (హిందువులను)… అక్కడికెళ్ళి (మక్కా) ఏ గడ్డి పీకుతాడు? – ముందు ముందు చూద్దాం” అని అన్నారు. ఆవిధంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మూడు సంవత్సరాలలో బాబా అబ్దుల్ జాన్ పఠాన్ ను మానసికంగా ఎంతో ఉద్ధరించారు. ఎంతలా అంటే.. హిందూద్వేషి ఆయన అబ్దుల్ జాన్ పఠాన్ హిందువులతోనే సాన్నిహిత్యంగా ఉండేటట్లుగా…అన్నిటికంటే ముఖ్యంగా ఆయన జీవిత లక్ష్యమైన “మక్కాయాత్ర” మరిచిపోయేటట్లుగా చేసారు. అదీ బాబా అంటే… మూడు సంవత్సరాల తరువాత ఒక రోజు సాయిబాబా అబ్దుల్ జాన్ పఠాన్ ను పిలిచి ” నీకేం కావాలో కోరుకో అది వెంటనే తీరుస్తాను” అని అన్నారు. దానికి అబ్దుల్ జాన్ పఠాన్ ” నాకు మీ పాదాలు తప్ప మరేమీ వద్దు! అయినా నాకేం కావలి బాబా.. మీ12 అంగుళాల పాదాలు మరియు నేను పోతే పాతిపెట్టడానికి 6 అడుగుల భూమి తప్ప”.  అది విన్న సాయిబాబా తనలో తనే నవ్వుకొని ” తథాస్తు – వెంటనే కోర్హలె గ్రామం బయలుదేరు. అక్కడే ఉండు! అన్ని అవే వస్తాయి” అన్నారు.  తదుపరి అబ్దుల్ జాన్ పఠాన్ కొర్హలె  గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. అక్కడే సమాధి చెందాడు. అతను మక్కాయాత్ర చెయ్యలేదు. అబ్దుల్ జాన్ పఠాన్ సాయిబాబానే అతని “అల్లా”, షిర్డీ యే అతని అతని “మక్కా- మదీనా” గా భావించాడు. తదుపరి వారి వంశస్తులు కుడా ఇప్పటికీ కోర్హలె లోనే ఉంటున్నారు. అబ్దుల్ జాన్ పఠాన్ తదుపరి వారి వంశంలోని గొప్ప సాయి భక్తుడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు).

రేపు తరువాయి భాగం….

 సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామము – 1 వ బాగం

kishore Babu

సాయి బాబా వారు చాల సార్లు హిందూ దేవుళ్ళు రూపం లో దర్శనం ఇచ్చినారు. కానీ ఈ ఆర్టికల్ ద్వారా తన భక్తుడికి అల్లా రూపంలో దర్శనం ఇచ్చినారు.
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles