Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
రమణ మహర్షి మహాసమాధి చెందారు. భగవాన్ నిర్యాణాన్ని భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రే ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు.
సమాధి జరిగిన ఒకటి, రెండు రోజుల్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు. భౌతికంగా భగవాన్ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడకు పోతుంది?
కాలం గుస్తున్నకొద్దీ తిరిగి భక్తులు రాసాగారు. వారి రాకతో ఆశ్రమం పూర్వపు వైభవంతో విలసిల్లసాగింది.
ఇక సాయినాథుని విషయం:
అబ్దుల్లాజాన్ అనే భక్తుడు సాయి మహా సమాధి అనంతరం ఇతరుల అనుభవాలను గూర్చి గాక తన స్వీయ అనుభవాన్నే నవంబరు 5న తెలిపాడు.
సాయిబాబా భౌతికంగా ఉన్న రోజులలో మసీదు భక్తులతో నిండిపోయి ఉండేది. కూర్చునేందుకు చోటు దొరికేది కాదు. సాయి మహా సమాధి అనంతరం ద్వారకామాయి నిర్మానుష్యంగా ఉండేది.
అబ్దుల్‌జాన్ సాయినాథుని దర్శించుకున్నాడు. దాదాపు అయిదు సంవత్సరాలు సాయి చెంత ఉన్నాడు. అక్కడ సుఖ జీవనం గడిపాడు.
సాయి మహా సమాధి అనంతరం సాయినాథుని నుండి లబ్ధి పొందలేక పోయానని భావించి షిరిడీని విడచి నిరాశ, నిస్పృహలతో యాత్రలు చేయసాగాడు.
స్వాట్ లోయలో అకున్ బాబా మహా సమాధి ఉంది. ఆయనను మహానుభావునిగా కీర్తిస్తారు అక్కడి వారు. ”నాకు సాయి బాబా సాయం చేయలేదు. మీరైనా సాయం చేయండి” అని అకున్ బాబాను ప్రార్ధించాడు.
ఆయన సమాధి వద్ద ఒక రోజు నిద్రించాడు. స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కనిపించింది అకున్ బాబా కాదు సాయి బాబా దర్శనమిచ్చాడు. వెంటనే అబ్దుల్‌జాన్ పశ్చాత్తాప్తుడయ్యాడు.
షిరిడీ నుండి 1500 మైళ్ళ దూరంలో ఉన్నా సాయి తనను గమనిస్తూనే ఉన్నాడు. ఆయన సాయం చేయలేదన్నది తప్పు అని గ్రహించాడు.
తిరిగి సాయిపై విశ్వాసం కలిగింది. వెనుకకు తిరిగి వచ్చాడు. ఆయనకు అప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆ సంఘటన తాను చూస్తుండగా, వింటుండగా జరిగింది.
ఒక భక్తుడు ”బాబా మీరు సమాధి చెందిన తరువాత మీ ప్రాభవం మీతోనే అంతరించిపోతుందేమో” అని సాయిని ప్రశ్నించాడు. సాయి ”నేను సమాధి నుండే కర్రలతో కొడతాను” అన్నారు.
ఈ మాటలు స్వయంగా అబ్దుల్‌జాన్ విన్నాడు. అది సత్యమే అని ఆయన గ్రహించాడు. ఈ ప్రపంచం కూడా విశ్వసిస్తోంది ఈ నాటికి కూడా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మొక్కును పూర్తిగా తీర్చాలి…..సాయి@366 నవంబర్ 24….Audio
- హెచ్చరిక …..సాయి@366 జూన్ 5…Audio
- ప్రధమ చిత్ర సాహిత్య ప్రదర్శన…..సాయి@366 నవంబర్ 9….Audio
- సతీ అనసూయ మాత …..సాయి@366 మే 5….Audio
- మూగవోని గొంతు…..సాయి@366 అక్టోబర్ 5….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments