Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నెల్లూరు కు చెందిన బాలాజీ గారు తమకు కలిగిన రెండు అనుభవాలను saileelas.com ద్వార సాయి బందువాలతో పంచుకోవడానికి పంపారు.
వారికీ బాబా వారి దివ్య ఆశీస్సులు లభించుగాక! ప్రియ సాయి బంధువులరా ఈ రోజు ఒక లీలను, రేపు మరో లీలను చదివి ఆనందించండి. ఇక బాలాజీ గారి మాటలలోనే వారి అనుభవాన్ని చదవండి.
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా ఈ రోజు సాయినాథుని అనుగ్రహము నాకు కొంచమైనా కలిగిన దంటే అది ప్రాతస్మరణీయులు కీ. శే. శ్రీ బాపట్ల హనుమంతరావు గారి దయవల్లేనని చెబుతున్నాను.
మాది గుంటూరు జిల్లా బాపట్ల. నా విద్యాభ్యాసం ఇంటర్ వరకూ అక్కడే జరిగింది. నాకు సాయి సమర్ద ఎవరో తెలియదు.
మన చిన్ననాటి చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం, మన ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం బట్టే మనకి ఒక దేవుని పై గురి ఏర్పడుతుందని నా ప్రగాఢ నమ్మకం.
అలాగే మా ఇంటి ప్రక్కన నందనవనం సుబ్బమ్మ గారు అనే టీచర్ ఉండేవారు. ఆమె అఖంఠిత సాయిబాబా భక్తురాలు,
మరి నేనేమీ అఖండిత ప్రసాద భక్తుడిని. ఆమె బాబా వారికి హారతి ఇవ్వగానే కలకండ ప్రసాదం పంచే వారు. అలా ఆ ప్రసాద భక్తుడిని, ఆయన పటం చూసీ చూసీ, హన్మంతుడో, శివుడు, వేంకటేశ్వర స్వామినో పూజించ వచ్చు గాని, ఈమేంటీ ఊరు , పేరు లేని ముస్లిం తాతయ్య ని పూజిస్తున్నారేంటి అని అనుకునే వాణ్ణి. అయినా మన ప్రసాదం మనకొస్తుంటే ఆమె ఎవరిని పూజిస్తే మనకెందుకు అని అనుకునేవాడ్ని.
మెల్లగా నేను 7వ తరగతిలో ప్రవేశించాను. కామన్ పరీక్ష. బాగా చదువుకో అలానే దేవుడి మీద కూడా భక్తి పెంచుకోమని అమ్మ చెప్పారు.
అప్పట్లో హనుమంతల వారు, వేంకటేశ్వర స్వామి వార్ల భక్తుడిని. హనుమాన్ ఛాలీసా, వేంకటేశ్వర సంప్రదాయం బాగా నోటికొచ్చేట్లు అర్థం తెలియక పోయినా బట్టి పట్టేశాను.
అబ్బాయి బాబా వారిని నమ్ముకో, నీవు పరీక్షల్లో విజయం సాధిస్తావని మా ఇంటి ప్రక్కన టీచర్ గారు చెప్పి, నా చేతిలో శ్రీ బాపట్ల హనుమంతరావు గారి సాయి ప్రార్థనాగీత అనే తెలుగు పుస్తకాన్ని నాచేతికిచ్ఛారు.
అందులో తొలి పది పద్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అయితే నా దురదృష్టకరమేమిటంటే ఓ గాలివాన లో మా ఇంటితో పాటు ఆ పుస్తకం కూడా పాడైపోయింది.
ఈలోగా నాకు ఉద్యోగం, పెళ్ళి, ఇద్దరు పిల్లలు. నా శ్రీమతి మంచి సాయి భక్తురాలు. ఆమె సాంగత్యం లో మరింత సాయి పై భక్తి పెరిగి.,ఆఖరికి మా ఇద్దరి పిల్లలకు సాయి పేరే పెట్టుకోవడం జరిగింది.
ఉద్యోగ్యరీత్యా నెల్లూరు లో స్ధిరపడి, బాబా కృప తో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నాము. ఇక్కడి మిత్రుడు శ్రీ కృష్ణాపురం శ్రీనివాస్ అనే సాయి భక్తడితో పరిచయం, అలాగే వారింట్లో బాబా సత్సంగ్ం ప్రతి గురువారం జరిపేవాళ్ళం. అలా మూడేళ్లు బాబా జరిపించారు.
ఆ తర్వాత మేము బాబా దయతో కొత్త ఇంట్లో జేరాము. ఆతర్వాత మేము కూడా సాయి సత్సంగం ప్రతి గురువారం మాఇంట్లో ప్రారంభించాము. అది ఇప్పటికీ కొనసాగుతోంది.
మరల 6 నెలల క్రితం నాకు అదే పుస్తకం శ్రీ బాపట్ల హనుమంతరావు గారి ది వారి పుత్ర రత్నం శ్రీ బాపట్ల వేంకటేశ్వర సాయి ద్వారా బాబా నాకందించారు.
నా ఆనందానికి అవధులు లేవు, నాపై సాయి సమర్దుని అనుగ్రహానికి ఆయనకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో అర్థం కావడం లేదు.
మా మీద దయతో, ప్రేమతో శ్రీ వేంకటేశ్వర సాయి గుర్తు పెట్టుకొని ఈ సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా బాబా ప్రసాదం మాకు పంపితే, కళ్లవెంట అశ్రుధారలు ముంచెత్తాయి.
బాబా వారి అనుగ్రహము ఏమని చెప్పగలం? ఈ జీవితం నాకు బాబా వారిచ్చిన భిక్ష. ఎన్ని మలుపులు తిరిగి ఎంతోమంది సాయి బంధువుల్ని కలిపారో. నేనేమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను. నా శృతి, నా అంతిమ గతి శ్రీ సాయి సద్గురువే.
శ్రీ కీ. శే. శ్రీ బాపట్ల హనుమంతరావు గారు, బాబా గురించి స్వయంగా ఎన్నో పుస్తకాలు రచించారు.
అందులోని ఆణిముత్యాలు “ఏమీ నిన్ను ఉపేక్షింతునా” పార్టు1&2, శ్రీ బీ. వీ. నరసింహాస్వామి గారి “లైఫ్ ఆఫ్ సాయి బాబా” పుస్తకాన్ని తనదైన శైలిలో తెలుగులో అనువాదం చేశారు. ప్రతి సాయి భక్తులు చదవాల్సిన పుస్తకాలు.
కీ. శే. శ్రీ బాపట్ల హనుమంతరావు గారు ప్రాత:స్మరణీయులు. ఆంధ్ర ప్రదేశ్ లో సాయినాథుడు పరిచయం తెలుగు భక్తలకు చేసింది శ్రీ కీ. శే. శ్రీ బాపట్ల హనుమంతరావు గారి రచనలు, అలాగే శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి రచనలే అంటే అతిశయోక్తి కాదు.
జై సాయి సమర్దా.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సమయమునకు రైలు టికెట్ ఇచ్చిన బాబా–Audio
- రైలు ప్రమాదం నుండి రక్షించిన బాబా – బాలాజీ గారి అనుభవం–Audio
- తన భక్తుడిని రక్షించడానికి బాబా లాయరుగా ప్రవేశం
- నా జీవితంలో 9 సంఖ్యతో బాబా యొక్క ఉనికి
- నా నాలుగు చేతులు చాచి వానిని రక్షింతును–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాలాజీ గారి జీవితంలో బాబా ప్రవేశం–Audio”
kishore Babu
November 24, 2016 at 11:29 pmసాయివంటి దైవంబు లేడోయి లేడోయి…సాయి బాబా…సాయి బాబా