Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సాయీ నీలీలలు వర్ణించ తరమా?
ఈ అద్భుతమైన లీల శ్రీ ప్యారేలాల్ ఖన్న, 13 థియేటర్ రోడ్ కోల్ కత్తా వారివి. ఈ లీల శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక నవంబరు-డిసెంబరు 2003వ.సంవత్సరంలో (61వ.నంబరు) ప్రచురింపబడింది.
అందులో ప్రచురింపబడిన ఈ లీల యధాతధంగా మీకందిస్తున్నాను.
నేను నాభార్య 1950వ.సంవత్సరంలో రామేశ్వరం వెళ్ళాము. దక్షిణ భారత దేశమంతా తిరిగాము. మేమెక్కడికి వెళ్ళినా మాకు తలపాగా చుట్టుకొని వున్న ఒక యోగి చిత్రపటాలు మాకు దర్శనమిస్తూ ఉండేవి.
ఆయనెవరో మాకు తెలీదు. ఆఖరికి ఆఫొటోలు శ్రీషిరిడీ సాయిబాబా వారివని తెలిసింది. నా తమ్ముడు షిరిడీ వెళ్ళాడు. షిరిడీ నించి వచ్చిన తరువాత మమ్మల్ని కూడా షిరిడీ వెళ్ళమన్నాడు.
ఆ సమయంలో నేను పెద్ద కష్టంలో ఉన్నాను. ఆఫీసులో విపరీతమయిన పని వత్తిడి. అంతే కాదు నాభార్యకు అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించవలసిన పరిస్థితి.
ఆమెకు బొంబాయిలో మేజర్ ఆపరేషన్ చేయించడానికి వెళ్ళేముందు బాబా ఆశీర్వాదం కోసం మేము 1982 ఏప్రిల్ లో బొంబాయి వెళ్ళాము.
షిరిడీ యింకా చేరుకోకముందే బాబా మమ్మల్ని అనుగ్రహించారు. మేము రైలులో ఉండగా ఎఱ్ఱటి దుస్తులతో ఒక ఫకీరు మా బోగీలోకి వచ్చాడు.
అతను మాకష్టాలన్నీ తీరిపోతాయని అర్ధం వచ్చేటట్లుగా మరాఠీలో ఒక పాట పాడాడు. అతను మమ్మల్ని రూ.5/-అడిగాడు. మేమతనికి 5 రూపాయలు యిచ్చాము.
అతను మమ్మల్ని దీవించి మిగిలినవారెవరినీ ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు.
షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొన్న తరువాత నాభార్యకు ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో నాకు టైఫాయిడ్ వచ్చి జ్వరం తీవ్రంగా ఉంది.
మంచం మీదనించి లేవలేని పరిస్థితి. ఆస్పత్రికి వెళ్ళి నాభార్యకు సపర్యలు చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే బాబావారి విశేషమైన అధ్బుతమైన దయ, అనుగ్రహం మామీద ప్రసరించింది.
ఎవ్వరూ అడగకుండానే ఒక నర్సు వచ్చింది. ఆనర్సు నాభార్య దగ్గరే ఉండి రాత్రంతా ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకుని సపర్యలు చేసింది.
పేషెంట్ అయిన నాభార్యకు యివేమీ తెలియవు. మరునాడు ఉదయం 7గంటలకు నర్సు తాను పేదరాలినని తాను చేసిన సేవకు డబ్బు యిమ్మని అడిగింది.
కాని నాభార్య వద్ద డబ్బు లేకపోవడంతో నర్సును మరుసటి రోజు రమ్మనమని తప్పకుండా డబ్బు యిస్తానని మాట యిచ్చింది. అపుడా నర్సు నాభార్యను తలనుంచి పొట్టవరకు చేతితో తాకి దీవించి వెళ్ళిపోయింది.
ఆతరువాత ఆనర్సు మరలా రాలేదు. ఆమె మాకెక్కడా కనపడలేదు కూడా. తరువాత డాక్టర్ వచ్చి తనవద్ద అటువంటి నర్సు ఎవరూ పని చేయటల్లేదని చెప్పాడు.
మేము 26వ.తారీకున ఆస్పత్రినించి వచ్చేశాము. నర్సు మరలా రాలేదు.
ఎవరూ లేని పరిస్థితిలో బాబాయే నర్సు రూపంలో వచ్చి ఒంటరిగా ఉన్న నా భార్యకు సపర్యలు చేశారని మాకు గట్టి నమ్మకం కలిగింది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దూరమెరుగని దైవం ….. సాయి@366 ఫిబ్రవరి 23….Audio
- నర్సుగా వచ్చింది బాబా కాక మరెవరయ్యుంటారు?
- బాబా ఆమెని జాగ్రత్తగా చూసుకున్నారు –Audio
- సాయీ భాగవతము…..సాయి@366 జూన్ 28….Audio
- సాయీ అంటే ఓయీ అని పలికే సాయి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయీ నీలీలలు వర్ణించ తరమా?–Audio”
B.mallesh
October 1, 2016 at 1:30 pmIts really great baba is always great