రైలు ప్రమాదం నుండి రక్షించిన బాబా – బాలాజీ గారి అనుభవం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈరోజు సాయి తో నా రెండవ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

నేను వృత్తి రీత్యా రైల్వే లో బిట్రగుంట స్టేషన్ కి 2016 లో  వచ్చాను.

పిల్లల చదువులు కోసం నెల్లూరులో ఉంటున్నాము.  

2012 సంవత్సరం లో  ఒక  రోజు డ్యూటీ ముగించుకుని నెల్లూరు రావాలి.  సమయం ఉదయం 07:40 అవుతుంది. నేను రైల్వే ట్రాక్ దాటుతున్నాను. 

అది  కేవలం ఇంజన్,  లేదా ఒక ఆఫీసర్ సెలూన్ కోచ్ పెట్టే సైడింగ్ లైన్లో  నడుస్తున్నాననుకుంటున్నాను, కానీ నిజానికి అది ట్రై న్స్ నడిచే రన్నింగ్ లైన్.

ఏదో కొంచెం శబ్దం వస్తే వెనక్కి తిరిగి చూసా, అంతే నా గుండె లయ తప్పింది.  వంద మీటర్ల దూరంలో విజయవాడ వెళ్లే పాసింజర్ ట్రయిన్ వస్తుంది. 

ఆలోచించే సమయం లేదు. ఆ సమయంలో బిట్రగుంట ఆగాలి కనుక 30 కిలోమీటర్ల వేగంతో దూసుకొని వస్తుంది.

డ్రైవర్,  సహాయ డ్రైవర్లు బిట్రగుంట లో మారాలి కాబట్టి ఇద్దరూ తమ సామానులు సర్దుకుంటున్నారు. నేను అదే ట్రాక్ మీద నడుస్తున్నానన్న విషయం వాళ్లు గమనించడం లేదు. హారన్ కొట్టడం లేదు.

నాకు ట్రాక్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన రాలేదు. అంత సమయం లేదు.  కానీ ఎవరో నెట్టి వేసినట్లు ట్రాక్ష్న్ సెకండ్స్ లో మృత్యవు నుంచి బయిట పడ్డాను.

మెదడు మొద్దు బారింది.  అక్కడే ఓ  అరగంట కూర్చున్నాను.  జీవితం అంటే ఇంతేనా అనిపించింది.

కానీ ఎలా బయిటపడ్డానో….. కేవలం నా తండ్రి బాబా కృప తో మాత్రమే అని నాకు తెలుసు.  అందుకే నా ఈ  మిగిలిన జీవితం సాయి సమర్దుని భిక్షే.

నాచేత ఇంకా కొన్ని చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయేమో, బాబా నన్ను మీ అందరితో కలిసి ఆయన తత్వాన్ని పంచుకోవాల్సిన రుణం ఉన్నది కాబట్టి, ఇంతమంది సాయి బంధువులతో పరిచయ భాగ్యం కలిగి, మీ అందరి ఆశీర్వాద బలంతో సాయి పధం వైపు అడుగులు వేస్తున్నాము. ఇంతకంటే ఈ జీవితానికేం కావాలి చెప్పండి?

 సాయి సఛ్ఛరిత 8వ.అ.ఓవీ.6లో

 ” ప్రతిరోజూ  ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా  అనేక సంవత్సరాలు వృధాగా గడిచి పోయాయి.  సగం జన్మ నిద్రావస్తలో గడచి పోతుంది. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు”.

 అదే అధ్యాయం లో 40వ ఓవీ

    ” మహా భాగ్యం వలన ఎంతో పుణ్య సంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి ఘఢియా సద్వినియోగం చేసుకోండి”

    ఎందుకంటే ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు.   కేవలం అదృష్టవశాత్తు అనుకోకుండా చేజిక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేయాకండి.

సాయి బంధువులందరూ నా అనుభవాన్ని చదివారు కదా! సాయినాథుని లీలలు అగాధాలు. మీ జీవితంలో మీ అనుభవాలను మన సాయి బంధువులందరితో పంచుకోండి.

జై సాయి సమర్దా.

మీ

ఇందిరా బాలాజీ రావు

నెల్లూరు.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “రైలు ప్రమాదం నుండి రక్షించిన బాబా – బాలాజీ గారి అనుభవం–Audio

kishore Babu

సాయివంటి దైవంబు లేడోయి లేడోయి…సాయి బాబా…సాయి బాబా

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles