Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
బాబా మాతోనే ఉన్నారు రెండవ బాగం..
హాస్పిటల్ లో చేరినప్పటి నుండి మా చెల్లి బాబా ని తలచుకుంటూనే ఉంది. ఆశ్చర్యంగా ఆపరేషన్ థియేటర్ లో ఒక నిలువెత్తు బాబా పటమును చూసింది. అక్కడ బాబాను చూడగానే సగం భాధ మాయమైపోయింది. అక్కడ బాబా ఇద్దరు నర్సుల రూపంలో వచ్చారు. వాళ్ళు మా చెల్లి తో నీకు నార్మల్ డెలివరీ అయ్యేందుకు సహాయం చేస్తాము, దానికి నీవు మాతో సహకరించాలని చెప్పి ఈ విషయం డాక్టర్ కి చెప్పద్దు, చెప్తే తమ ఉద్యోగాలకే ప్రమాదం రావచ్చు అని చెప్పారు.
మేము దానికి ఒప్పుకున్నాము. బాబా మాతోనే ఉన్నారు. చెల్లికి నార్మల్ డెలివరీ అయ్యింది. బిడ్డ ఏ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా పుట్టింది. ఏ డాక్టర్ అయితే సి-సెక్షన్ చెయ్యాల్సి వస్తుందని సలహా ఇచ్చారో, ఆ డాక్టర్ ఇలా నార్మల్ డెలివరీ అవ్వడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు దాదాపు మూడు రోజులు నుండి నార్మల్ డెలివరీ అవుతుందని చూసి, చివరికి కాక సిజేరియన్ చేయాలనుకున్నారు. కాని ఇప్పుడు అద్భుతంగా నార్మల్ డెలివరీ అయ్యింది.
ఇది అంతా నా దేవుడు సాయి వల్లనే జరిగింది. ఆయన లేకుండా ఏది సాధ్యపడదు. బాబా ఎప్పుడూ మాతో ఉన్నారు. ఆయన ప్రతి నిమిషం మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. సాయీ! మా జీవితమంతా మీ ఉనికిని చూపిస్తూనే ఉన్నందుకు , మీ ఉనికిని మేము తెలుసుకొనేలా చేస్తున్నందుకు ఐ లవ్ యు సాయీ!
మీరు ఎప్పుడూ మాతో ఉండాలని, మా అందరినీ దీవిస్తుండాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను బాబా. బాబా! నీవు నా తండ్రి, తల్లి, నా స్నేహితుడివి; నాకు అన్నీ నీవే. నీకు బాగా తెలుసు, నీ పేరు తలవకుండా నేను ఉండలేనని. కాబట్టి ఒక్క క్షణమైన నన్ను వదిలి వెళ్ళకు బాబా, ఎందుకంటే నీవు లేకుండా నా జీవితానికి అర్థమే లేదు. ఐ లవ్ యు బాబా. నా జీవితమంతా నా బాబా తో నిండిపోయింది.
మాకు జరిగిన ఇంకో అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనకు ఏది మంచిదో, ఏది ఎప్పుడు మనకు ఇవ్వాలో నా బాబా కి బాగా తెలుసు. మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. నా ఆరోగ్య పరిస్థితులవల్ల రెండవ బిడ్డను కనాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు.
కాని మేమనుకున్నది కాకుండా బాబా మా గురించి ఇంకో విధంగా తలచాడు. మళ్ళీ బాబా ఎప్పుడు మాతోనే ఉన్నారని నిరూపించారు. బాబా దయ వలన నా ఆరోగ్య పరిస్థితి చాలా తొందరగానే పూర్తిగా మెరుగయింది. నేను మందులు తీసుకోవడం మానేసి పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నానని మాకే నమ్మశక్యం కాలేదు. ఇప్పుడు నేను ఎటువంటి సమస్య లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. మా కుటుంబసభ్యులు మమ్మల్ని రెండో బిడ్డ గురించి అడగడం మొదలుపెట్టారు.
బాబా మా మనసుని మార్చి ఎలాగో రెండో బిడ్డ గురించి ఆలోచించేలా చేసారు. బాబా తో నేను ఎప్పుడూ అంటుండేదాన్ని, బాబా నేను మీ కూతుర్ని. మాకేది మంచో మీకన్న తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు. ఈవిధంగా ఆలోచించి ప్రతీదీ నాబాబా కే వదిలేశాను.
బాబా ప్రతి సారి నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నా గురించి ఎంత జాగ్రత్త పడుతున్నారో మాకు అర్థమయ్యేలా చేస్తున్నారు. మొదట నా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేలా చూశారు. తర్వాత నేను గర్భవతిని అవడానికి పూర్తిగా ఆరోగ్యంగా కోలుకునేలా చేశారు. ఇప్పుడు నేను గర్భవతిని. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.
బాబా నీవు మాకు చేసిన దానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? నీ ఉనికిని ఎప్పుడూ చాటుతూ నా జీవితాన్ని ఆనందంతో నింపారు. దయచేసి ఎప్పుడూ నాతో ఇలాగే ఉండు సాయి. నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకు, లేదా నా మీద కోపం తెచ్చుకోకు సాయి. ఎంతైనా నేను మామూలు మనిషిని. నా వల్ల ఎన్నో తప్పులు జరిగి ఉంటాయి.
దయచేసి నా తప్పులన్నీ మన్నించి నన్ను క్షమించు. నన్ను నీ కూతురిగా స్వీకరించి నాకు ఎప్పుడూ తోడుగా ఉండు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఒక భాగంగా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరినీ సుఖ సంతోషాలతో ఉండేలా దీవించు. మరియు ప్రతి ఒక్కరు మంచి మనిషిగా వుండి అర్థవంతమైన జీవితం గడిపేలా సహాయం చేయి తండ్రీ!
ఐ లవ్ యు సాయిబాబా.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా మాతోనే ఉన్నారు మొదటి బాగం..
- బాబా ఉన్నారు రెండవ బాగం…
- బాబా ఉన్నారు మొదటి బాగం…
- కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం రెండవ బాగం …..
- బాబా సమస్యలు తొలగించి నా పెళ్ళి జరిపించారు రెండవ బాగం…..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా మాతోనే ఉన్నారు రెండవ బాగం..”
సాయినాథుని ప్రణతి
March 2, 2017 at 10:26 amచాలా బాగుంది ఈ లీల .సాయి భక్తులైన ప్రగనేంట్ లేడ్సికి నాది ఒక చిన్న సలహ .కడుపుతో వునపుడు మనం రోజు కొంచం సచ్చరిత్ర పారాయణ చెస్తు.బాబా నామ స్మరణ చెస్తు సమయం దొరికినపుడలా బాబాను ఆయన లీలను స్మరించుకుంటు వుంటె మనం అపరిమిత ఆనందాని పొందుతాం.ఇంకా బాబా ప్రేమను మరింతగా పొందగలుగుతాం. ఇది నా అనుభవం .