Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఎవరి భక్తి వారికి ఉంటుంది. ఇతరుల మెప్పుకోసం కాదు భక్తి సాధన. భక్తులమని లోకం ప్రశంసించనక్కరలేదు. భగవంతుడు గమనిస్తుంటారు. అది చాలు.
అర్జునుడు తన అన్నగారగు భీముడు ఎలాంటి పూజ చేయటం లేదని తలచేవాడు.
అందుచేత తానే ఈశ్వర పూజ చేయుచున్నానని పొంగిపోయేవాడు. అది గర్వంగా మారింది.
అర్జునుడు కొన్ని మారేడు దళములతో మాత్రమే నిత్యము పూజ చేసేవాడు. కానీ బీముడు అట్లాకాదు. ప్రపంచము నందలి అన్ని మారేడు దళములతో మానసికముగా పూజ చేస్తుండేవాడు.
ఇట్టి స్థితిలో భీముడు మానసికముగా శివునకు అర్పించిన బిల్వ దళములను శివుని సహచరులు ఎత్తలేక అలసి పోయేవారు.
అర్జునుడికున్న అభిప్రాయాన్ని తెలుసుకున్న కృష్ణుడు భీముడు చేయు పూజా పద్దతిని అర్జునునకు దర్శింప చేయదలచుకున్నాడు.
తన మహాత్తుతో. బిల్వ పత్రములను మేళ తలములతో కొందరు తీసుకొని పోవుట చూచాడు.
అర్జునుడు “మీరు ఈ బిల్వ పత్రములను ఎచట నుండి తెస్తున్నారు?” అని ప్రశ్నించాడు వారిని.
అందుకు వారు “ఈ దళములు మా శివునకు భీముడు మానసిక పూజాయందు సమర్పించినవి” అన్నారు. అది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
తాను చేయు పూజా కంటే అన్న భీముని పూజ ఉత్తమమని గ్రహించాడు. తన తప్పును సరిదిద్దుకున్నాడు. అది చాలును శ్రీకృష్ణునకు.
డిసెంబర్ 8, 1911 న కపర్డే గారు కొన్ని విషయాలను తెలియపరచారు.
“మాధవరావ్ దేశ్ పాండే(శ్యామా) ఇక్కడే(వాడాలోనే) నిద్రపోయాడు.
కేవలం పుస్తకాలలో మాత్రమే చదివినది ఎన్నడూ అనుభవించని చిత్రాన్ని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను, చేవులతో విన్నాను.
మాధవరావ్ దేశ్ పాండే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి “సాయినాధ్ మహారాజ్”, “సాయినాథ్ బాబా” అని స్పష్టంగా శబ్దం వస్తోంది.
ఇవి ఎంత స్పష్టంగా ఉన్నాయంటే మాధవరావ్ గురకతో పాటు ఎంతో దూరానికి కూడా అవి వినిపించేవి. ఇది నిజంగా అత్యద్భుతం అని వ్రాశాడు కపర్డే.
భక్తిని మానవుల దృష్టిలో విలువైన బంగారం, వజ్రాలతో పోల్చకూడదు. అవి భగవంతుని దృష్టిలో ఏ మాత్రం విలువలేనివి.
భక్తి అనేది భక్తుని అసంకల్పిత చర్య కావాలి. అంతకంటే పరమార్థం ఏముంటుంది.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి జ్ఞాన సంగమం… .మహనీయులు – 2020… అక్టోబరు 8
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 26
- తొడిమను వీడిన దోసపండు …..సాయి@366 డిసెంబర్ 15….Audio
- భక్తి సంపద…..సాయి@366 అక్టోబర్ 29….Audio
- చిన్ని నా బొజ్జకు …..సాయి@366 డిసెంబర్ 17….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments