వాతాపి గణపతిం భజే… …. మహనీయులు – 2020… మార్చి 24



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా వద్దకు చక్రనారాయణ అనే పోలీసు వచ్చాడు. అక్కడున్నవారు “ఈ ఫౌజుదార్ క్రైస్తవుడు” అన్నారు.

“ఐతేనేం? అతను నా సోదరుడు” అన్నారు సాయి. సాయివంటి సత్పురుషులు అన్ని మతాలను ఆదరిస్తారు. ఏదీ నిరాదరణకులోను కాదు.

ముత్తుస్వామి దీక్షితులు తండ్రితో మద్రాసులోని సెయింట్ జార్జి కోటకు పోతుండేవారు.

అక్కడ బ్రిటిష్ వారి “గాడ్ సేవ్ ది కింగ్” వినటం జరిగింది. సంగీత సాహిత్యాలలో కావేవీ స్వీకరణకనర్హం.

ముత్తుస్వామి ఆ ఆంగ్ల గీతానికి సంస్కృత శబ్ధాలతోడుగు అమర్చి దేవీస్తుతిని తయారు చేశారు. ఆ స్తుతి మన్ననలను పొందింది.

ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత త్రయంలో ఒకరు. అయన కీర్తి అపారం.

ఒకసారి ముత్తుస్వామి దీక్షితుల వారి భార్యకు ఆభరణాలు ధరించాలనే కోర్కె కలిగింది.

అయన లలిత రాగంలో ” హిరణ్మయీం లక్ష్మీం  సదా భజామి…”అంటూ లక్ష్మీదేవిని ప్రార్ధించారు.

ఆ నాటి రాత్రి అయన భార్యకు స్వప్న దర్శనం వచ్చింది. లక్ష్మీ దేవి సకలాభరణ భూషితయై దర్శనమిచ్చి “నీ భర్తయే నా స్వరూపుడు” అని పలికింది.

అంటే ముత్తుస్వామియే సంగీతాలక్ష్మి అని ఆయన భార్యకు అర్థమైంది. ఇక ఆమెకు ఏ ఆభరణాలు కావాలి?

తెల్లవారగానే స్వప్న వృత్తాంతాన్ని భర్తకు చెప్పింది. “మంగళ దేవతాయా బహుమానితోహుం… అని మహాలక్ష్మిని కీర్తించారు ముత్తుస్వామి.

“అన్న వస్త్రముల కొరకు ప్రయాసపడవద్దు” అంటారు సాయిబాబా.

ముత్తుస్వామి గారింట్లో శిష్యులు కూడా ఉండేవారు. భోజన ఏర్పాట్లను ఆయన భార్య చేసేది.

ఒకనాడు ఆ ఇంట్లో ఆహార పదార్దాలన్నీ నిండుకున్నాయి. ఈ విషయం తెలిసిన కమలమ్మ అనే శిష్యురాలు తన నగలను అమ్మి ధనము తేవటానికి బయలుదేరబోతొంది.

ముత్తుస్వామి విషయాన్నీ గ్రహించి, శిష్యురాలిని వారించాడు.

త్యాగేశుని కోవెలకు వెళ్ళి “త్యాగరాజన్ భజరే …” అని గానం చేసి ఇంటికి వచ్చారు.

ఇంటికి వచ్చేసరికి ఒక సత్రపు యజమాని ఆహార పదార్దాలను ముత్తుస్వామి గృహంలో ఇచ్చి వెళ్ళాడు.

ముత్తుస్వామి “త్యాగరాజేన సంరక్షణ తోహం….” అని కీర్తన రచించి కృతఙ్ఞతలు తెలుపుకున్నారు త్యాగరాజస్వామి (దైవాని)కి.

ఈయన ఎట్టయాపురం వెళుతుంటే ప్రజలు వర్షం లేక బాధలుపడుతున్నారు.

ఈయన సలిలం “వర్షయం వర్షయ అమృతేశ్వరి….”అంటూ దేవిని కీర్తించారు. అమ్మ కరుణించింది. కుంభ వృష్టి కురిసింది.

“వాతాపి గణపతిం భజే….”ఈయన రచనే.

మార్చి 24, 1775  ముత్తుస్వామిగారి జన్మదినం.

నేడు మార్చి 24. ముత్తుస్వామిగారి జయంతి రోజు. ఆయనను స్మరిద్దాం.

“వాతాపి గణపతిం భజే….”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles