Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీధర వేంకటేశ, సదాశివ బ్రహ్మేంద్రుల సహాధ్యాయి. ఆయన ఒకసారి మంటపంలో తులా పురాణం చెబుతున్నారు.
అది వారం రోజుల పాటు సాగింది. చివరి దినాన ఆయన, అక్కడ ఉన్న ఇతరులకు తనతో ఆ మంటపం బైటకు రమ్మన్నారు. అందరూ బయటకు వచ్చారు. ఆ మంటపం కూలిపోయింది.
సాయిబాబా “ఆగు” అని ద్వారకామాయి (మసీదు) కప్పుకేసి చూశారు. సాయిబాబా ఇతరులతో పాటు బయటకు వచ్చారు. అంతే! ఆ మసీదు కప్పు కూలిపోయింది.
శ్రీధరుని వద్ద శిష్యులు అనేక శాస్త్రాలు అభ్యసించేవారు. వారిలో ఒకడు బీదవాడు. వివాహమైంది.
ధనం తెమ్మని భర్తను కోరింది ఆ ఇల్లాలు. అతను శ్రీధరుని వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఎదురుగా ఉన్న ఒక బూడిద గుమ్మడి కాయను ఇచ్చారు గురువైన శ్రీధరుడు.
ఆ శిష్యుని భార్య, భర్తనే కాక, గురువును కూడా దెప్పి పొడిచింది. ఒకసారి వారు కొత్త ఇంటికి పోవలసి వచ్చింది.
ఆచారం ప్రకారం బూడిద గుమ్మడిని పగులగొట్టాలి. భర్త చేతికి ఆమె బూడిద గుమ్మడి కాయను ఇచ్చి, గురువు ఇచ్చిన బూడిద కాయ. ఇందుకు పనికి వచ్చింది అంది ఈసడింపుగా.
భర్త ఆ బూడిద గుమ్మడిని పగుల గొట్టాడు. బంగారు కాసులు అందులో నుండి బయటకు వచ్చాయి.
శ్రీధరుని మహిమకు ఆమె తెల్లబోయింది. భార్యాభర్తలు ఆ గురువు (శ్రీధరుడు) వద్దకు పోయి క్షమింపుమని వేడుకున్నారు. గురువు కరుణా మూర్తి కదా!
ఒకసారి శ్రీధరుని ఇంట శ్రాద్దాం పెట్టవలసి వచ్చింది. అన్ని ఏర్పాట్లు జరిగాయి. శ్రీధరుడు కావేరీ నదిలో స్నానం చేసి వస్తున్నాడు.
దారిలో ఒకడు నీరసంగా పడి ఉన్నాడు. శ్రీధరుడు వెంటనే తన కమండలంలోని నీరును అతని నోటిలో పోశాడు.
ఇంటికి వెళ్ళి పితృ కార్యమును (తద్దినమునకు) పదార్థములను తెచ్చి తినిపించాడు. దీనిని చూచిన బ్రాహ్మణులు తాము తద్దినమును పెట్టించమని వెళ్లిపోయి, ఊరంతా ఈ విషయాన్ని చాటించారు కూడా.
సాయంకాలం అవుతుండగా ఇద్దరు పురోహితులు వచ్చి, శ్రాద్ధ విధులు నిర్వహించారు. శ్రీధరుడు వచ్చిన వారు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరులని అందరుకూ వివరించాడు.
అయినా శ్రీధరుడు కాశీకి పోయి గంగలో స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు.
“కాశీకి ఎందుకు మా ఇంటి బావిలో గంగ ఉద్బవిస్తుంది రండి” అన్నారు శ్రీధరుడు.
“ఎప్పుడు?” అడిగారు అందరూ. “కార్తీక పూర్ణిమనాడు” అన్నారాయన గంగా మాతను స్మరిస్తూ.
కార్తీక పూర్ణిమ రానే వచ్చింది. జనం ఎందరో వచ్చారు. శ్రీధర వేంకటేశుని బావిలో గంగ పైకి ఉబకసాగింది.
ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం అచట (తిరువిశనల్లూరు)లో జరుగుతుంది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రీరామ విజయం…..సాయి@366 అక్టోబర్ 1….Audio
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- మానవ జన్మ…. మహనీయులు – 2020… ఆగస్టు 26
- తస్మై గురవే నమః …. మహనీయులు – 2020… సెప్టెంబరు 26
- ఈశుడు దాసుడైనాడు…. మహనీయులు – 2020… నవంబర్ 17
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments