మైనతాయీని గుర్తు చేసే ప్రసవలీల.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

ఓం సాయి రామ్,

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

సాయి బందువులకు నమస్కారం.

నా పేరు మేడా. లక్ష్మి ప్రసన్న,  హైదరాబాద్.

మీరు చూపించే ప్రేమకి బానిసను నేను. ఒక అడుగు నా వైపు వేస్తె పది అడుగులు నీ వైపు వేస్తా అన్నారు బాబా.

ఈ మాటలు అక్షరాల సత్యం చేస్తూ భక్తుల వెన్నంటి వుంటూ ప్రాపంచికమైన కోరికలు నెరవేరుస్తూ అదే విదముగా ఆద్యాత్మికమగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తూ మనల్ని భవసాగరాలు దాటిస్తున్నారు బాబా.  

అందుకే మీకు కోటి ప్రణామాలు, మీ కరుణ అనిర్వచనీయము.

నేను నెల తప్పిన నాటి నుండి తల్లిలా ప్రేమగా నా పక్కనే ఉండి నన్ను చూసుకున్నారు బాబా.

నేను ఏమీ తిన్నా ఆయన పెట్టినవే అయ్యాయి . అప్పుడు నా బరువు నలబై కేజీలు.

చాలా సన్నగా ఉండేదానిని, ఈమె చాలా నీరసంగా ఉన్నారు, రక్తం కూడా ఎక్కించాలి, సరిగా ఒక బిడ్డకి జన్మ ఇచ్చే స్తితిలో లేదు అని చెప్పారు డాక్టర్.

మా వాళ్ళకి దిగులుగా ఉండేది. నాకు మాత్రం చాలా దైర్యంగానే ఉండేది. బాబానే చుసుకుంటారు అని.

ఇది నా నమ్మకానికి పరీక్ష. ఒకసారి నేను మా అమ్మా వాళ్ళా ఊరిలో ఉన్నపుడు ఆ ఊరికి ఒక ముసలి ఆమె వచ్చారు .

ఆమె బాబా సేవకురాలు అని చెప్పారు. అందరూ ఆమెను చూసి వస్తున్నారు అని, మనం వెళ్దాము అని మా అమ్మ అన్నారు, సరే అని వెళ్ళాము.

మేము వెళ్ళేవరకు ఆమె జపంలో ఉన్నారు. మా అమ్మ ఆమెకు చెప్పారు మా అమ్మాయికి సుఖ ప్రసవం జరిగేలా ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగారు.

ఆమె నవ్వుతూ నన్ను చూసారు, ఏమే పెళ్ళి చేస్తే నన్ను మరచిపోయ్యవుగా, ఇంకా వాడు పుడితే ఇంకా మరచిపోతావుగా అన్నారు.

ఈమె, ఈమె కాదు నా బాబా నాకోసం వచ్చిన్నట్టుగా అనిపించింది, లేదు బాబా నిన్ను నేను మరచిపోను తండ్రి అన్నాను.

ఈమె కడుపులో ఉంది ఆయనే, అచ్చంగా ఆయనే, ఒక మందు వేసుకోరు, మాత్రా మింగరు. ఆయన బయటకు రావడానికి ఎటువంటి కత్తులు అవసరంలేదు అంటూ నా కడుపు అంతా ఊదీ రాసారు.

వాడికి సాయి వంశీ అని పేరు కూడా పెట్టండి అని చెప్పారు. అందరూ దీనిని జోతీస్యం అని అనుకున్నారు కాని బాబా మాటలు అని అర్ధం కాలేదు.

చూద్దాం అని ఎదురు చూడసాగారు. ఈ విషయము నేను మా అత్తగారికి చెప్పాను. హా చూద్దాములే అన్నారు.

ఎందుకు అంటే మా అత్తగారు వాళ్ళు అమ్మవారి భక్తులు, నేను ఏమో బాబాకి చేస్తూ ఉంటానుగా, చాల సార్లు ఆమె చెప్పారు.

అమ్మా, మనము అమ్మ సేవకులం అమ్మకి సేవ చేయాలి నువ్వు ఎప్పుడు బాబా, బాబా, బాబా అంటావు ఏంటో అని అనే వారు.

ఇది నా భక్తికి పరీక్ష. చూద్దాము బాబా ఏమి చేయాలనుకున్నారో. నేను ఏమి తినాలో బాబానే తెచ్చేవారు.

నిజంగా కొన్ని సందర్బాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేసాయి.

ఒకసారి నేను పడుకున్నాను, నా పక్కన ఉన్న అమ్మని బాబా లేపారు అంట, లేపి చూడు పిల్ల ఎలా పడుకుందో చూడు అని చెప్పారు అంట.

అమ్మ లేచి చూస్తే నేను సరిగా పడుకోలేదు, అంటే (బోర్ల పడుకోవడo అంటారుగా) అలా పడుకున్నాను అని అమ్మ నన్ను లేపి, అలా పడుకుంటే కడుపులో ఉన్న పిండం నలిగిపోతుంది, లే సరిగా పడుకో అని చెప్పింది.

ఇలా నన్ను ఎప్పుడు గమనిస్తూ నన్ను కంటికిరెప్పలా చూసుకున్నారు బాబా.

ఇలా నెలలు గడిచి నెమ్మదిగా తొమ్మిదో నెలకు దగ్గర పడ్డాను అమ్మ వాళ్ళు సీమంతం చేయాలి అని, అన్ని ఏర్పట్లు చేసారు.

రేపు సీమంతం అనుకున్నారు, అంటే ఈరోజు ఉదయం నాకు కలలో చెప్పారు బాబా, ఏమే వీడు  బయటకు రావడానికి తొందరపడుతున్నాడు, ఇంక నువ్వు నన్ను పట్టించుకోవుకదా అని బాబా గారు దూరంగా వెళ్లారు.

నిద్ర లేవగానే అమ్మకి చెప్పాను. అమ్మ అన్నారు డాక్టర్లు చెప్పిన సమయం ఇంకా చాల రోజులు ఉంది కదా ఏమి కాదులే అన్నారు.

తరువాత రోజు  సీమంతంకదా, వాళ్ళు  చాలా బిజీగా ఉన్నారు. కాని ఎనిమిది నెలల పాటు వాంతులు, కడుపులో మంట చాలా బాదపడ్డాను.

నాకు బాబా చెప్పిన మాటలు గుర్తువచ్చి, ఇంక ఈరోజు పుడితే నేను పదకొండు రోజులు ఏమి చేయను కదా! అని బాబాకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసాను.

ఎందుకు అంటే సీమంతంకదా అందరు వస్తారు బాబా కూడా రెడీ అవ్వాలిగా అని చెప్పాను.

కాని నా మనసులో ఇది విషయము, మద్యాహ్నం  రెండు గంటల సమయములో మా అమ్మ పేరెంటం చెప్పడానికి బయలుదేరుతున్నారు,

అప్పుడే నాకు నొప్పులు మొదలు, పేరుకే నొప్పులు నాకు ఏమి తెలియలేదు. ఒక 5 నిమిషాలలో నాకు మా ప్రక్కన ఉన్న ఒక వదిన ఆ పిల్లకి ఏమి వద్దు, భయం లేదు అని, ఊది నీళ్ళు త్రాపించారు.

అంతే చూస్తూ ఉండగానే నాకు బాబు పుట్టాడు ఇది అంతా కూడా పది నిమిషాల సమయంలో కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేదు.

ఇంట్లో నే ప్రసవం జరిగింది. ఆమె చెప్పింది నిజం అయ్యింది అని చాలా మంది నన్నుచూడడానికి వచ్చారు.

మా అత్తగారు మాత్రం అప్పటి నుండి బాబా, బాబా అనడం మొదలుపెట్టారు.

నేను ఏమి చెప్తే అదే కరెక్ట్ అంటారు. నా మీద కూడా చాలా ప్రేమ ఇచ్చారు బాబా.

ఈ విదంగా నా బాద్యత అంతా బాబా తీసుకుని నాకు తల్లి, డాక్టర్, అన్ని బాబా అయ్యి నన్ను పెద్ద గండం నుంచి తప్పించి కాపాడి నన్ను చూసుకున్నారు.

ఈరోజుకి అదే ప్రేమ బాబా నా మీద చూపిస్తున్నారు.

ఇంక నేను ఆయన సేవలో ఉండక ఎటు పోగలను, నాకు తల్లి, తండ్రి, గురువు, అన్ని ఆయనే అయ్యారు.

బాబా సేవలో తరిస్తూ అయన లీలలు అందరితో పంచుకుంటూ ప్రేమతో లక్ష్మి ప్రసన్న.

సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “మైనతాయీని గుర్తు చేసే ప్రసవలీల.

T.V.Madhavi

Chalaa baagundhi.mam.ee leela.anni share cheyyadi. u r a great devoti.mam…Let me. Know about u mam..Plz write.this is a very gud plate form which kishoregaru give baba devoties..sairam

మీరు చాల అదృష్టవంతులు…బాబా వారితో మీ బంధము ఎంతలా ఉందొ…ఈ లీల ద్వారా అర్ధం అవుతుంది…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles