Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఆదరించి , అనుసరించే ప్రతి హృదయం విశ్వరూప సందర్శనానుభూతి పొందగలదు.
**********
దేశం ఏమైపోయినా పర్వాలేదు , ఎవరు ముఖ్యమంత్రో , ఎవరు ప్రధానమంత్రిగా అయినా వాళ్లకు అక్కరలేదు ..
బక్కచిక్కిన రైతు వర్షంకోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూసేట్టు , వార్డు ఎన్నికలమొదలూ కేంద్ర ఎన్నికలవరకూ , ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా , వ్యక్తుల ప్రాధాన్యంకన్నా , వ్యక్తిగతంగా ఎంత గిట్టుబాటవుతుందా అని ఎదురు చూసే వర్గం ఒకటి లోకాచారమైపోయింది ..
ఎవరొచ్చినా ఎవడి స్వప్రయోజనాలు వాళ్ళవే , ఓటు వేసే వాడు , ఓటు వెయించుకొనేవాడు , ఎవరికి వాళ్లకు , వాళ్ళ మాటల్లో నిజాయతీ ఎంతో వాళ్ళకే స్పష్టంగా అర్ధమవుతుంటుంది ..
రాజులకు , రాజులకు మధ్య ఐక్యతలేక , దేశాన్నే బ్రిటీషువాళ్ళకు తాకట్టుపెట్టి , చివరకు వందల సంవత్సరాలు , దుర్భర దరిద్రాన్ని అనుభవిస్తూ , వాళ్ళ పాదాలకు దాస్యంచేయవలసివొచ్చింది అప్పుడు ..
అధికారదాహం , గద్దెనెక్కాలనే తాపత్రయం, రాజకీయం ఒక వ్యాపారమైపోయి , రికార్డుల్లో దేశం వెలిగిపోతోంది తప్ప , సామాన్యుడి నిజజీవితాలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు , రోజురోజుకూ దిగజారిపోతోంది ..
పాలించేవాడిని దుయ్యపట్టేముందు , పాలకుడిని ఎన్నుకొనే విధానంలో అవినీతికి సంకెళ్లుపడందే , వ్యవస్థ ఎన్నటికి దుర్బరపరిస్థిని ఎదుర్కొనక తప్పదు ..
సనాతనధర్మం , ఆచారాలు కూడా మనోనైజానికి విధి , విధానాలనందించి , మనిషి శుభ్రమార్గాన్ని అనుసరించి , సమాజ శ్రేయస్సుకు ఉద్దేశింపబడినవే ..
ప్రబోధించె ఎన్నో పురాణాలు , నీతికధలు అందించబడ్డాయి , అయినా మాయకు బలికాకుండా , అప్పుడప్పుడు మహాత్ములూ ప్రకటమౌతుంటారు …
సృష్టికార్యం , సృష్టిలో మనిషి మనుగడ ,తన విధిని గుర్తించి , తనను తాను ఉద్ధరించుకొనే ప్రయత్నమే విశ్వరూప సందర్శనం ..
సద్గ్రంథం , సచ్చరిత్ర ఏదైనాసరే మొదట నమ్మకం , గురుత్వం ,శ్రద్ధా లేక , కేవలం ప్రతిఫలాపేక్షకే పరిమితమైతే , గ్రంధాలు ఆశించిన ఫలం ఎన్నటికి నెరవేరదు సరికదా , అది భావితరాల సంస్కృతికి ద్రోహం చేసినట్టే ..
ఆదరించి , అనుసరించిన ప్రతి మనసు తనకుతానే ఆ విశ్వరూప సందర్శన అనుభూతిని పొందగలుగుతుంది .
ఒక దేవుడైనా , సద్గురువైన కేవలం భౌతిక భోగాలు సిద్ధిస్తాయని , స్వప్రయోజనాలకోసం అల్పబుద్ధి ప్రచారాలు మొదలైనప్పుడు , వక్త , శ్రోతలకు , ఇప్పటి రాజకీయ వ్యవస్థకూ తేడాఉండదని ఆర్యులమాట …
శ్రీ గురు దివ్య పాదార్పణమస్తు
********
Latest Miracles:
- ప్రదర్శన కాదు సందర్శన…..సాయి@366 అక్టోబర్ 23….Audio
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
- బాబాతో మొట్టమొదటి అనుభూతి
- హేమద్పంత్ – 2 తొలి దర్శన అనుభూతి
- నేనుండ నీకు భయమేల — అషిమా, బాబా అనుభూతి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments