ప్రదర్శన కాదు సందర్శన…..సాయి@366 అక్టోబర్ 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సత్పురుషుల మహాసమాధులు పూజనీయములు, అలాగే వారు చరించిన ప్రదేశాలు, వారు ఉపయోగించిన వస్తువులు సందర్శనీయ మైనవే.

సాయిబాబా విషయంలో ఒక్క షిరిడీలోనే వారికి 50 ఏండ్ల పైబడి అనుబంధం ఉన్నది.

2001 విజయదశమి సాయి భక్తులు జ్ఞప్తి యందుంచుకొన వలసిన దినము. అది అక్టోబరు 23 శుక్రవారము. దీక్షిత్‌ వాడాలో సాయినాథునికి సంబంధించిన అనేక వస్తువులు ఉన్నాయి.

అది ప్రదర్శన కాదు – సందర్శన కొరకు. వెండి సింహాసనంపై కొలువైన సాయి పటంలో దర్శనమిస్తాడు.

అది అసలు ఫోటో. దానిపై ఆసీనుడై ఉన్న సాయికి వెండి ఛత్రము నీడనిస్తుంది. వెండి పడితో చామరం కూడా ఉన్నది.

1954 వరకు అంటే బూటీ వాడాలో సాయినాథుని విగ్రహము ప్రతిష్టించే వరకు, ఆ చిత్రరాజము అక్కడ కొలువై ఉండేది.

ఎడమవైపున ఉన్న గోడకు సమాధి మందిరపు ఫోటోకు అటు, ఇటు నెమలి ఫించములు  కనబడతాయి.

సమాధి మందిరంలో కొలువై ఉన్నది మురళీధరుని రూపంలోని సాయియే కదా! కృష్ణునకు నెమలి ఈకకు (ఫించము) బంధము ఏనాటిదో! నెమలి ఫించము ఈ ప్రపంచంలోని ప్రకృతికి చిహ్నం.

తరించవలసినది సాయినాథుని అందమును చూచి కాని, నెమలి పింఛంలోని పలువన్నెల తళుకు బెళుకులకు కాదు అయినా సాయి వేయి కనులతో కనిపెట్టుచునే ఉంటాడు, కనుక వీలైనంతవరకు ప్రపంచ వ్యామోహాలలోనికి పోకుండా చూచుకోవాలి.

గతంలో సాయినాథుడు ఉపయోగించిన వస్తువులలో కొన్నింటిని, సాయికి సంబంధించిన వస్తువులను బూటీవాడాలో షోకేసులో ఉంచేవారు.

ఇంకా సౌకర్యంగా ఆ వస్తువులను భక్తులు దర్శిస్తారని దీక్షిత్‌ వాడాలో మ్యూజియంలో ఉంచారు. అక్కడ గ్రామ ఫోను, రికార్డులు, పాదరక్షలు, కఫ్నీ బట్ట మొదలైనవి దర్శించిన వాటికి సాయితో గల అనుబంధాన్ని తెలుసుకోవటానికి వీలవుతుంది.

వాటిని దర్శించటం అంటే, శారీరకంగా, దీక్షిత్‌ వాడాలో మనం ఉన్న సాయినాథుని కాలంనాటికి మనస్సును తీసుకుపోతాయి.

ఉదాహరణకు చిలుం, సటకాలు. చిలుం సాయి పీలుస్తున్నట్లు దగ్గర ఉన్న భక్తులకు అందిస్తున్నట్లు కలిగే ఊహే ఎంతో ఆనందదాయకమైనది.

అదే సమయంలో సాయినాథుని సుందర వదనాన్ని ఊహిస్తుంటే చాలు ఇంకొంచెంసేపు చూడాలనిపిస్తుంది.

మ్యూజియంలోని ప్రతి వస్తువు సజీవమే.

కనులుండే మనసును అలరింపచేయటమే కర్తవ్యం.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles