సాక్షాత్తు శ్రీ సాయిబాబావారే నాకు ఆయుష్యును ప్రసాదించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

బాబా ఇచ్చిన జీవనదానం.నా పంచప్రాణాలు ఆయనకే అర్పితం.

నా మనసు అనే పూజా గదిలో బాబా అనే ముగ్గులు ఎపుడు వేస్తూనే వుంటాను.

నా జీవితంలో ప్రత్యక్షంగా సాయినే వచ్చి నాకు జీవనదానం చేసారు.

అది 30,జనవరి 2009.మేము 9 మంది సాయి భక్తులము బరోడ నుంచి షిర్డి(400km దూరం),పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం.

నేను స్వయంగా ప్రతిదినం 35km వెళ్ళేవాడిని.రెండు రోజులలో 70km నడుచుకుంటూ వెళ్ళడం నా జీవితంలో ఇదే మొదటి రికార్డ్.

సాయినే నాకు అంత నడిచే శక్తిని ఇచ్చారు,కారణం అప్పుడు నా వయస్సు 60సం||.

అలా నడుస్తూ నడుస్తూ 6 రోజులలో మేము నాసిక్ జిల్లా సటాణా అనే పల్లెకు రాత్రికి చేరుకున్నాము.

రాత్రి 10గంటలకి మేము భోజనాలు చేసి పడుకున్నాము.అపుడు నా గుండెలో మెల్లగా నొప్పి మొదలయింది.అందుకే నేను నిద్రపోలేకపోయాను.

నేను నాఛాతికి బాబా విభూతి పూసుకున్నాను.నొప్పి ఇంకా ఎక్కువ అయింది.ఇంక నేను కంట్రోల్ చేసుకోలేనంతగా నొప్పి వచ్చేసింది.

అయినా నా మిత్రులను ఎవరిని నేను లేపలేదు.రెండుగంటలు ప్రాణం పొయ్యేంత నొప్పి వచ్చింది.అప్పుడు కూడా సాయి స్మరణ వదలకుండా చేస్తున్నాను.

అందరూ దేవి,దేవతలు,గురుదేవులు,నా బంధువులు గుర్తుకు వస్తున్నారు.

అపుడు sudden గా “నా కొడుకు,కోడలు బరోడా నుండి నాసిక్ వెళ్తా వుంటారు ఈరోజు రాత్రి”అవసరమైతే వస్తారులే అనుకుంటూ క్రిందికి చూశాను.

నా కాళ్ళ దగ్గర ఒక కుక్క కూర్చొని ఉంది.నేను ఒకవేళ చనిపోయేటట్లు వుంటే,ఈ కుక్క అరవాలి కదా,అది శాంతంగా పడుకొని ఉంది అనుకుంటూ దాన్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాను.

అపుడు కలలో బాబా విభూతి నా నుదుట పెట్టారు.”రేపు ఇదే సమయానికి మళ్ళీ వస్తాను” అని చెప్పారు.వెంటనే నాకు నొప్పి తగ్గిపోయింది.నార్మల్ అయ్యాను.

తెల్లవారి 4గంటలకు లేచాను.అందరం మళ్ళీ అగరబత్తి బాబా ముందర వెలిగించి,మా బాబా ద్వజం చేత పట్టుకొని వెళ్ళడానికి బయలుదేరాము.

అపుడు నా ఫ్రెండ్ ఇంద్రవదన్ నా దగ్గరికి వచ్చాడు.అతను రోజు 3-4 గంటలు ధ్యానంలో ఉంటాడు.

అతను నాతో అన్నాడు “గోంద్ కర్ బాయి నేను నిన్న రాత్రి ధ్యానములో ఉండగా సాయిబాబా నాకు చెప్పారు గోంద్ కర్ ఆయువు 12సం|| పెంచాను ఆయనను నువ్వు కొంచెం బాగా చూసుకో”అని.

ఇది విని నేను ఆశ్చర్యపోయాను.

అపుడు మనసులో promise చేసుకున్న బాబా ఇచ్చిన ఈ ఆయుష్యును మంచి పనులకే అంటే బాబా సేవకే వినియోగిస్తాను.

మా పాదయాత్ర అయిపోయి షిర్డి చేరాము.అప్పటి నుంచి నేను బాబా సేవలో “ఓం సాయి యాత్ర భజన మండలి” ఏర్పాటు చేసాను.

రోజు మేము రాత్రి 1గం|| నుంచి 1.30గం|| వరకు భజన చేస్తూ ఉంటాము.

నేను 21 మందితో ఒక ‘సాయి లీల ద్వైమాసిక’ పత్రిక నడుపుతున్నాను.

అందుకే నన్ను “సాయి భక్త ప్రసార భూషణ”పదవిని యిచ్చి,సాయిచరిత్ర,విభూతి  నాకు పోస్ట్ ద్వారా పంపుతారు.

ఇదికాక షిర్డి సంస్థాన్ వాళ్ళు అన్ని సాయిబాబా మందిర పూజార్లకు సాయి హారతులు నేర్పటం కోసం బరోడా,గుజరాత్ అన్ని సాయి టెంపుల్స్ పూజార్లను షిర్డి కి తీసుకువెళ్ళే పని కూడా నాకే ఇచ్చారు.

ఇలా బాబా సేవ చేసుకుంటూ బాబా లోనే విలీనం కావాలని నా అంతిమ కోరిక.సాయిరాం.

బాలచంద్ర శ్రీధర్ గోంద్ కర్.

బరోడ,గుజరాత్.

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles