వీరిని చావకుండా రక్షించినవారు శ్రీసాయిబాబాయేయని శ్రీ రాధాకృష్ణస్వామి గ్రహించిరి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

 

  1. Mir-180-1712-వీరిని చావకుండా 4:11

శ్రీ సాయి పదానందరాధాకృష్ణ స్వామి బాబా దేహాంతర పిచ్చుక. గడచిన జన్మ సంస్కారాలు ప్రస్తుత జన్మలో ఫలిస్తాయంటారు.

అది స్వామివారి విషయములో యదార్థమని చెప్పవచ్చు. వీరు తమిళనాడులోని తిరుచునాపల్లి జిల్లా కులితలం తాలూకాలో లక్ష్మీ అమ్మాళ్ దంపతులకు 1906 ఏప్రియల్ 15న జన్మించిరి. వీరి అసలు పేరు శేషాద్రి.

వీరు చిన్నవయస్సుననే కామాక్షి అమ్మవారి అనుగ్రహమును పొందినారు. సంగీతము మొదలగు అనేక వాటియందు వీరికి పరిచయమున్నది.

వీరు ఆధ్యాత్మిక గ్రంధములయందు మంచి పట్టు సంపాదించిరి. వీరు 1927లో వివాహము చేసుకొన్నాను వెంటనే సన్యాసమును స్వీకరించిరి.

ఒకప్పుడు పూనే దగ్గరలో ఒకగుహలో 48 రోజులు తపస్సు చేయగా దత్తాత్రేయస్వామి సాక్షాత్కరించి “ఈ ప్రపంచములో ఇతరులకు సేవ చేయుటకు నీవు ఇంకా జీవించి యుండాలని” వీరిని ఆదేశించిరి.

రాధాకృష్ణస్వామి సాయి మార్గములో ప్రవేశము
అనేక మంది మహాత్ములను దర్శించుచు దత్తమంత్రమును ఉపదేశము పొందిరి.

ఒకసారి చిదంబరం దగ్గరలో “కోలేరున్ నది”ని దాటుచుండగా రైలులోనుండి నదిలో దూకబోవ వీరిని పడకుండా ఎవరో వెనుకకు లాగిరి. అలా వీరిని చావకుండా రక్షించినవారు శ్రీసాయిబాబాయేయని శ్రీ రాధాకృష్ణస్వామి గ్రహించిరి.

శ్రీబి.వి.నరసింహస్వామిగారు 1942 లో అచ్చటి వారి ఆహ్వానంపై ఊటి వచ్చిరి. ఆ సమయములో రాధాకృష్ణస్వామి అచ్చట యుండిరి.

నరసింహస్వామి వారు ఎప్పుడు తమవెంట శ్రీసాయిబాబా పటమును తెచ్చుకొనువారు. ఆపటమును అచ్చట పెట్టి సూటుతో యున్న రాధాకృష్ణస్వామిగారిచే బాబాకు పూజ చేయించిరి.

“నీ బాహ్యాడంబరములతో శ్రీ సాయిబాబాకు పనిలేదు. ఆయనకు కావలసినది మనస్సు మాత్రమే” అని నరసింహస్వామివారు చెప్పిరి.

ఈవిధముగా 1942 వ సంవత్సరములో బాబా తన చెంతకే వచ్చి 36 ఏళ్ల వయస్సులో యున్న శ్రీరాధాకృష్ణస్వామిజీని అనుగ్రహించిరి.

అప్పటి నుండి శ్రీ నరసింహస్వామి వారిని తమ గురువుగా భావించి వారితో సన్నిహితముగా ఉంటూ మద్రాసు కూడా వస్తూ శ్రీ సాయిసేవకు అంకితమైరి. మద్రాసులోని ఏ.ఐ.యస్.యస్ లెక్కలు మొదలగునవి చూచుచూ నరసింహస్వామివారికి సహాయపడసాగిరి.

రాధాకృష్ణస్వామి గార్కి బి.వి.నరసింహస్వామి నిర్యాణము చెందిన 1956 అక్టోబరు, 10 వ తేదీన సాయిబాబా ఆత్మసాక్షాత్కారమును ప్రాసాదించిరి.

అప్పటి నుండి వీరిలో పెద్ద మార్పు వచ్చి బాబాకు నిజమైన సేవకునిగా జీవితమును సాగించిరి.
నరసింహస్వామివారి నిర్యాణము తరువాత రాధాకృష్ణస్వామి
అటు మద్రాసులోని ఆల్ ఇండియా సాయి సమాజ్, ఇటు బెంగుళూరు లోని సాయి స్పిరిచ్యుయల్ సెంటరు, రెండు బాధ్యతలు చాలా కాలము నిర్వహించిరి. వారికి బాబా అనేక లీలలు చూపించిరి.

వాటిని ముందు ముందు తెలుసుకుందాము. శ్రీ రాధాకృష్ణస్వామిజీ 74వ ఏట 1980వ సంవత్సరములో దేహమును చాలించి సాయి సాయుజ్యము పొందిరి.

ప్రస్తుతము బెంగుళూరులోని సాయి స్పిర్చ్యుల్ సెంటరును శ్రీ ఆర్. శేషాద్రిగారు నిర్వహించుచున్నారు.

వారికి తోడుగా శ్యామారావు తోడ్పడుచుండిరి. ప్రస్తుత నిర్వాహకులైన వీరిద్దరితో నాకు(రచయితకు) సన్నిహిత సంబంధమున్నది. వారి ద్వారా అప్పటి లీలలన్నీ విని యుంటిని. వాటిని ఒక్కొక్కటే తెలుపుదును.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( సెప్టెంబర్ – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “వీరిని చావకుండా రక్షించినవారు శ్రీసాయిబాబాయేయని శ్రీ రాధాకృష్ణస్వామి గ్రహించిరి–Audio

kishore Babu

మనము ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లు అయితే, చివరి వరుకు మనము సాయి బాబా వారి కృపకు పాత్రులం అవుతాము అని ఈ లీలా ద్వారా గ్రహించవచ్చు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles