నిజమైన శ్రద్ధాభక్తులు వుంటే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

సక్రమంగా వాడుకొంటే , చివరివరకూ శరీరం సహకరిస్తుంది ..తత్వాన్ని కూడా బాధ్యతగా కాపాడుకొంటే అది ప్రలయం వొచ్చినా రక్షగా నిలుస్తుంది

జీవంలేని శరీరానికి ఎన్ని రసాయనాలు అద్ది భద్రపరచినా నశించిపోయిన చైతన్యం తిరిగి రావటం దుర్లభం..

రాతిని చెక్కి రూపంగా మలిచినంతమాత్రాన దానిలో జీవకళ తొంగిచూడదు ..

దేహం నేలరాలేంతవరకు , దానికి నియమంగా నిత్యం స్నానాదికాలు , అన్న , పానాదులు  మొదలూ ఒక బిడ్డలా దాన్ని కాపాడుకొంటే శుదీర్ఘమైన ఆయుష్షుతో శోభిల్లుతుంది .

ఆహార నియమాలు పాటించక , వ్యసనాల బలహీనతలకు తలొగ్గితే , శరీరానికి క్రమంగా జీవకళ తగ్గడమేగాక , ఆయుఃపరిణామమూ తరిగిపోవొచ్చు …

మనిషి శరీరాన్ని శుభ్రంచేసుకొంటే దానిని స్నానమంటారు , అర్చనామూర్తిని నీటితో , పన్నీటితో శుభ్రంచేస్తే దానిని అభిషేకం అంటారు.

మనిషి తింటే దాన్ని తిండి అంటారు , దేవుడికి సమర్పించుకొంటే దాన్ని నివేదన , నైవేద్యం అంటారు , ఇలా మనిషి తన శరీరాన్ని ఎలా పొషించుకొంటున్నాడో , అవే చర్యలు దేవతా సపర్యల్లో కూడా సేవలరూపంలో జరుపబడుతుంటాయి ..

మనిషి తన శరీరాన్ని సక్రమంగా కాపాడుకొంటే నేలరాలేంతవరకూ అది సహకరించగలదు ..

నాశములేనిది , శాశ్వతమైనది అయిన ఆద్యాత్మిక తత్త్వం కూడా మొదట పూజా , పునస్కారాలనే షోఢశోపచర్యలతోనే ఆరంభమౌతుంది ..

కాశీలాంటి సనాతనమైన ఆలయాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయంటే , సజీవ మూర్తిగాఆరాధిస్తూ , సపర్యలు చేస్తున్న భక్తుల సేవా , కైంకర్యాలవల్లనే ..

ఆలయాలు కట్టుకొడం విశేషమనిపించదు .. ఆలయంలో ప్రతిష్టించుకొన్న మూర్తిని ఆరాధించుకొనే విధానం లోపభూయిష్టమైన , ఆదరణ కరువైనా , ఆ తత్వాన్ని కాపాడుకునే విషయంలో అశ్రద్ధవహించినా అక్కడ మిగిలేది జీవం లేని శిలమాత్రమే ..ఆ ఆదరణ నోచక ఎన్నో ఆలయాలు శిథిలావస్థకు చేరుకోడం లోకవిదితమే.

పొగడ్తలకు , ఆడంబరాలకు పరిమిత బుద్దికి తలొగ్గే మనిషి లొంగవొచ్చు , నిజమైన శ్రద్ధాభక్తులు లేక సర్వహృన్నిలయుడైన భగవంతుని అనుగ్రహం లభించడం , తత్వాన్ని కాపాడుకోడం సాద్యం కాకపోవొచ్చని పెద్దలమాట …

జయ్ సాయి గురుదేవ సమర్థ
******

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles