Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
శ్రద్ధా , భక్తి , ప్రయత్నం ఇవి మూలానికి మూలమేదో స్ఫురింపచేస్తాయి
*****
అవకాశంవొచ్చి , ప్రధానమంత్రితో ఫొటోకు దిగినంతమాత్రాన ప్రధాని స్థాయి , పదవి ఫొటోకు దిగినవాళ్లకు లభించడం జరగదు ..
గురువుతో అత్యంత సన్నిహితంగా మెలిగినా , గురువు యొక్క బాహ్యచర్యలు అణుకరణకు వొస్తాయేమో కానీ ,.గురువు ప్రబోధాలపై నిలకడగా దృష్టిపెట్టక గురు ప్రబోధాలు మనసు గ్రహించడం కష్టమే .
నాటిన ప్రతి విత్తనం మొలకెత్తుతాయని నమ్మకంలేదు .. మొలకెత్తిన ప్రతి చెట్టు మధురఫలాలాను అందించలేవు ..బీజాన్నిబట్టి వృక్షం , వృక్షాన్నిబట్టి ఫలాలు అందించబడతాయి ..
కాకరకాయ విత్తనాన్ని నాటి , మామిడిపండు కాయాలని ఆశను వ్యక్తంచేసినా , సృష్టి ధర్మం , ఆశకు అనుకూలంగా ఎప్పటికి మారదు ..
అవసరాలకోసమో , ఏదైనా ఆపద ముంచుకొచ్చినప్పుడో , దేవాలయం గడప తొక్కేవాడి మొదలూ తుకారాంలాంటివరకూ , వారిని లోకం భక్తుడు అని సంభోధిచడం ఒక అలవాటయిన సాంప్రదాయం ..
కొన్ని లక్షలమంది పండరిపురాన్ని దర్శనం చేసుకున్నవారు వున్నా , తుకారాం , సక్కుబాయిలాంటి సిద్ధిపొందిన నిజభక్తులను వెళ్ళమీద లెక్కించదగినవారే కనబతారు ..
ఒక మధుర పదార్ధం సువాసనలు ముక్కుపుటాలకుసోకి , నోటిలో లాలాజలం ఊరవొచ్చుకాని , ఆ పదార్ధాన్ని ఆస్వాదించనిదే , దాని రుచి అనుభవయోగ్యానికి రాదు ..
ఒకే తల్లికి పుట్టిన సంతానానికి ఒకే బావాలు సంతరించుకోనట్టు , ఒకే సద్గురువును ఆశ్రయించినా , వినడం , సచ్చరిత్రను చదవటం వలన కలిగే భావాలు , విశ్లేషణలు కూడా ఒకేలా ఉండవు ..
బాబా సశరీరంతో ఉన్నప్పుడు ఏ ఆవరసరాలతోనో , ఏ సమస్యలతోనో ఆశ్రయించిన వారి సంఖ్య వేలకు వేలు ఉన్నా , ఆయన ప్రబోధాలకు స్పందించి , అనుసరిసరించి ఆయన పరిపూర్ణ అనుగ్రహంతో జన్మను సార్థకపరుచుకొన్నవారు ఎందరో పారాయణ చేసే ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే నఘ్నసత్యం ..
అలా ఆయన బోధలను స్ఫూర్తిగా తీసుకుని సాధనలో మునిగినవారు కొందరైతే , తాము పొందిన విశ్లేషణాత్మక అనుభూతిని పదిమందితో పంచుకునే వక్తలు , అదే తత్వాన్ని తమ స్వప్రయోజనాలకు , కీర్తికాంక్షలతోనో వినియోగించుకునే ప్రయత్నంలో , ఆకర్షిస్తూ తత్వప్రయోజనాన్నే కుంటుబరుస్తున్న వర్గం ఒకటి , ఇలా భిన్నంగా వ్యక్తిత్వాలు పరిచయమౌతుంటాయి .
తుకారాంలాంటి వారి భక్తి శిఖరాగ్రాన్ని దాటి , భౌతికంగా వైకుంఠాన్ని చేరినా , అందుకు మూలమైన సాధనకు ఉపక్రమిస్తే తుకారం స్థాయికి ఎదిగీ అవకాశం కలగవొచ్చుకానీ , పాండురంగస్వామితో సమానం ఎన్నటికి కలలోనైనా అసాధ్యమే ..
వక్తా ఒకప్పటి శ్రోతే , ఆ శ్రోతకూ శ్రద్ధాభక్తులు , స్వప్రయత్నమువలన మూలమైన దాని అనుగ్రహంతో వివరణ యివ్వగల యొగ్యత సంప్రాప్తించబడిందే ..
తెలిసి అజ్ఞానంలోపడి , వక్తే మూలమైనదానితో పోటీపడితె , అంతకన్నా మించిన అజ్ఞానం మరొకటి ఉండదని పెద్దలమాట ..
సర్వం శ్రీగురు చరణార్పణమస్తు
. *********
Latest Miracles:
- మనసు నిండా భక్తి ….. సాయి@366 మార్చి 4….Audio
- సాయిని సేవించిన తెలుగు వెలుగు…..సాయి@366 ఏప్రిల్ 12…Audio
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
- భక్త విజయం…..సాయి@366 ఆగస్టు 30
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments