భక్త విజయం…..సాయి@366 ఆగస్టు 30



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


భగవంతునికి భక్తునికి మధ్య మధ్యవర్తులుండరు. భగవంతునికి భక్తునికి మధ్య అడ్డంకులు ఉండవు.

హేమాడ్‌పంత్‌ రచించిన శ్రీ సాయి సచ్చరితలో మద్రాసు రాష్ట్రం నుండి ఒక కుటుంబం వచ్చి సాయిని దర్శించినట్టుంది.

ఆ కుటుంబంలోని భార్య పేరు ఆదిలక్ష్మీ అమ్మాళ్‌, భర్త పేరు గోవింద స్వామి.

ఆదిలక్ష్మీ అమ్మాళ్‌, తన భర్త, ఇద్దరు పిల్లలతో తీర్ధయాత్రలకు బయలుదేరారు. నాసిక్‌ చేరారు.

అక్కడ నర్సింగ్‌ మహారాజ్‌ ఆ కుటుంబాన్ని సాయి దర్శనం గావించుకొనుమని ఆదేశించాడు. వారు సాయి సన్నిధిలో నెలన్నర పైగా ఉన్నారు.

సాయిబాబా ప్రతి దినం మిఠాయి, రెండు రూపాయలు ఇచ్చేవాడు.

ఆదిలక్ష్మీ అమ్మాళ్‌ రామ భక్తురాలు. అప్పుడప్పుడు ఆమెకు రామ దర్శనం కూడా అయ్యేది.

కాని ప్రాపంచిక వ్యామోహము భక్తి స్థానాన్ని ఆక్రమించటం వలన ఆమెకు తరచు రామ దర్శనం కలిగెడిది కాదు. ఆమె షిరిడీకి చేరి, సాయిని సందర్శించిన అనంతరం ఆమె భక్తి మరల పూర్వ స్థాయికి చేరింది.

ఆగస్టు 30, 1915న ఆమె స్వయంగా సాయిబాబాకు బజ్జీలు, పాయసం తయారు చేసింది.

ఆ నైవేద్యమును అత్యంత భక్తితో ద్వారకామాయిలో కొలువైన సాయి సన్నిధి చెంత నుంచినది. అంతకంటె ఎవరు ఏమి చేయగలరు?

ఆమె సాయి ముందు ఉంచిన నైవేద్యపు పళ్ళెమును దుర్గాబాయి అనే మరో భక్తురాలు సాయికి దూరంగా జరిపింది.

అయితే సాయిబాబా కొంచెం కొంచెం కదులుతూ ఆదిలక్ష్మీ నైవేద్యం పళ్ళెం వద్దకు వచ్చి, దానినే స్వీకరించారు.

ఆ నైవేద్యాన్ని అక్కడున్న శ్యామా మొదలైన భక్తులకు పంచిపెట్టి పళ్ళాన్ని ఖాళీ చేశారు. సాయి అలా చేయటం ఆదిలక్ష్మీకి ఎంతో సంతసమును కలిగించింది.

”సాయికి మా హృదయాలు తెలుసు, మా ప్రేమకు స్పందించారు” అన్నది ఆదిలక్ష్మీ.

భగవంతునికి భక్తునికి మధ్య ఉండవలసినది భక్తి మాత్రమే గాని వేరేది కాదు. భగవంతునకు భక్తితో అర్పించిన దానియందే ప్రీతి. భగవంతునికి ఆడంబరాలతో పనిలేదు.

పంచ భక్ష్య పరమాణ్ణాలు అసలే అవసరం లేదు. భక్తితో సమర్పించినది పట్టెడైనను చాలు. మనం భగవంతునికి ఏమి సమర్పించినను అది భక్తి, శ్రద్ధలతో కూడినదై ఉండాలి. అప్పుడే భగవంతుడు దానిని స్వీకరిస్తాడని మనం గ్రహించాలి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles