Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
కంటి సమస్యను తీర్చిన బాబా
ఈ రోజు అమెరికా నుంచి పేరు వెల్లడించ వద్దని కోరిన, ఒక భక్తురాలు పంపించిన బాబా లీల. బాబా మీద అమెకెంత నమ్మకము, విశ్వాసము ఉన్నాయో ఈ లీలను చదివిన తరువాత మనకు అర్ధమౌతుంది. బాబామీద ప్రగాఢమైన నమ్మకం ఉన్న భక్తులు బాబా ఊదీనే పరమౌషధంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆమె ఈ మెయిల్ ద్వరా పంపిన ఈ లీలను ఇప్పుడు చదవండి……
ఈ రోజు నేను బాబా యొక్క అద్భుతమైన లీలను మీఅందరితోను కలిసి పంచుకుంటాను. మా అబ్బాయి పేరు సాయి. 2012 వ సంవత్సరంలోమూడవ సంవత్సరం నడుస్తోంది. మా అబ్బాయి వయసు 3 – 5 నెలల మధ్యలో ఉన్నపుడు డాక్టర్లు మా అబ్బాయికి హ్రస్వదృష్టి(nearsightedness, myopia) ఉందని చెప్పారు. అది విని నేనెంతగా బాధపడ్డానో చెప్పనవసరం లేదు. నాకు 10 సంవత్సరముల వయసు నుండి మయొపియ (దూరపు వస్తువులుకనపడకపోవుట) (హ్రస్వ దృష్ఠి) ఉంది. అది పెరుగుతూ పవరు 7 డయాప్టర్స్ వరకు వచ్చింది. నా కళ్ళు, 50 సంవత్సరాల వయసువున్నవారి కళ్ళలా ఉండేవి, కాని అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు అంతే గాక డాక్టర్ నాకు భవిష్యత్లో గ్లూకో మారావచ్చు రాకపోవచ్చు అని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎన్నొ వెక్కిరింతలుభరించాను. మా అబ్బాయికి మంచి దృష్టినిమ్మని బాబాని చాలా తీవ్రంగా ప్రార్ధించడం మొదలుపెట్టాను. రెండు కళ్ళకీ ఊదీని రాయడం చేసేదానిని. బాబా విగ్రహాన్ని అభిషేకించి ఆ అభిషేక జలంతో బాబు కళ్ళను తుడవడం మొదలుపెట్టాను. మా అమ్మగారికి బాబా మీద అచంచలమైన విశ్వాసం. ఆవిడకి బాబా మీద ఎంత భక్తి ఉన్నదో నాకు తెలుసు. ఆభక్తే బాబా తన అద్భుతమైన లీలని చూపించేలాచేసింది. డాక్టర్ గారు మా అబ్బాయికి హ్రస్వ దృష్ఠి లేదని నిర్దారించి చెప్పారు. భవిష్యత్లో రావచ్చన్నట్లుగా చెప్పారు. నేను బాబాని నిరంతరం ప్రార్ధిస్తూ ఉండాలి. మాఅబ్బాయి కళ్ళు కొంచెం పెద్దవిగా ఉండటం వల్ల నేను గ్లూకోమా సస్పెక్ట్ అవడం మూలానా డాక్టర్ గారు గ్లూకోమ లేదని నిర్ధారణ చేసుకోవడానికి, మాఅబ్బాయిని 3 నెలల తరవాత తీసుకుని రమ్మన్నారు. ఇది వినగానే నాకు చాలా భయం వేసింది. సెప్టెంబరులో మరలా మా అబ్బాయిని డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళాను. ఆ రోజున డాక్టర్ గారు , మా బాబుకి గ్లూకోమా లేదని, దృష్టి కూడా చాలా అద్భుతంగా ఉందని నిర్ధారించి చెప్పారు. ఆవయసులో ఉండే పిల్లల కన్నాకూడా ఇంకా ఎక్కువగానే చక్కటి దృష్టి ఉందని చెప్పారు. డాక్టర్ గారు గ్లూకోమా కాదని తేల్చారు. ఎందుకంటే వాడి కళ్ళు అప్పుడెంత పెద్దగా వున్నాయో ఇప్పుడూ అలానేవున్నయని, అవి పెరగలేదని చెప్పారు. నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను
నేను షిరిడీకి నాప్రార్ధనలను పంపుతూ ఉండేదానిని. షివపూర్లోని బాబా గుడిలోని అమిత్ గారితో కూడా మాట్లాడి మా అబ్బాయి తరపున ప్రార్ధించమని అడిగాను. ఆప్రార్ధనలన్ని కూడా ఫలించాయి. నేను అమిత్ గారితోకూడా మాట్లాడాను. 15 నెలలు ఉన్న అప్పుడు మాబాబు ఆరోగ్యంగా ఉంటాడని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు
నిజమయ్యాయి. నాకన్న మా అమ్మగారికి, అమిత్ గారికి బాబా మీద ఎంతోనమ్మకం.
మా బాబుకు కంటిసమస్యలు తీరిపోవడం బాబా అనుగ్రహము, ఆయన చేసిన అద్భుతమైన లీల. నేనింకా ఇప్పటికీ మా బాబు రెండుకళ్ళకీ బాబా ఊదీ రాస్తూ అభిషేక తీర్ధ జలంతో రెండు కళ్ళనీ కడుగుతున్నాను. బాబాకు నాహృదయపూర్వకమైన ధన్యావాదాలను తెలుపుకుంటున్నాను. నేను మరలా 6 నెలల తరవాత మాబాబుని కళ్ళ డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళాము. డాక్టర్ గారు మా బాబు విషయంలో ఎటువంటి ఆందోళన చెందనవసరము లేదని చెప్పారు.
మందులతో నయంకాని వ్యాధులకు ఊదీ పరమౌషధము.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- అడగకుండానే నా అవసరాన్ని తీర్చిన బాబా వారు ……….!
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- నా కోరికను తీర్చిన బాబా.
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- ఆరాత్రి కలలో బాబా కన్పించి ఎందుకు భయపడతావు?–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments