Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు రాజ్యలక్ష్మి. మేము గుంటూరు ఏటి అగ్రహారంలో ఉంటాము, నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు.
నేను పుట్టి ఊహ తెలిసినప్పటినుండి బాబానే అన్ని అనుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు బాబా భక్తురాలు.
అమ్మని చూసి చిన్నతనంలోనే హారతులు, భజనలు అన్ని నోటికి వచ్చాయి.
మా ఇంటి దగ్గర బాబా విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఒకామె కంజీరా వాయిస్తోంది. అది చూసి నేను కూడా వాయిస్తే బాగుండు అనుకున్నాను.
ఇంటి దగ్గర ట్రై చేశాను బాబాను తలచుకుని. నాకు అనుకోకుండానే వాయించడం వచ్చేసింది.
అప్పటినుండి బాబా భజనలకి, పాటలు పాడటం, కంజీరా వాయించడం మొదలైంది. అలా నన్ను ”షిరిడి” కూడా తీసుకెళ్లేవారు.
నేను ఇంటర్ పాస్ అవ్వగానే, నాకు పెళ్లి అయ్యింది. నేను నెల తప్పాను. బాబా నా కలలో కనిపించి ”శ్రీ రామ చంద్రుడు లాంటి కొడుకు పుడతాడు” అని అన్నారు. అలాగే జరిగింది.
ఆ తర్వాత నాకు ఇంక సంతానం కలగదన్నారు. నేను చాలా బాధపడ్డాను.
అయ్యో నేను అమ్మకి ఒక్కదాన్నే, నాకు ఒక్కడే అనుకున్నాను. లేదు ఇలా జరగకూడదు అని పట్టుదలతో ”బాబా పారాయణం” చేశాను.
అప్పుడు మూడు సప్తాహాలు అవ్వగానే, నేను నెల తప్పాను అని తెల్సింది. బాబాకి ఎంతో కృతజ్ఞతలు చెప్పేటప్పుడు నేను ఏడ్చేసాను.
ఆ తరువాత నాకు మరల బాబు పుట్టాడు. కానీ పుట్టకతోనే గుండెలో చిల్లుతో పుట్టాడు. 21 రోజుల పిల్లాడపుడే పిల్లల డాక్టర్ Dr. రఘురాం గారి ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం.
కానీ డాక్టర్స్ ఆపరేషన్ చేయటం లేదు. నేను రెండు నెలల పాటు సూర్యుడ్ని, చంద్రుడ్ని కూడా చూడడానికి కూడా లేకుండా హాస్పిటల్ లోనే పిల్లవాడి పెట్టుకుని అలాగే మొండిగా ఉన్నాను.
నేను అక్కడ కూడా ”బాబా పారాయణం” స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక ముసలామె వచ్చి ”పిల్లవాడిని సాయి అని పేరు పెట్టి పిలిస్తేనే మీకు మంచి జరుగుతుంది” అన్నారు. వెంటనే మేము సాయి అని పిలవడం మొదలు పెట్టాము.
ఎప్పుడైతే పిలిచామో వెంటనే ఆపరేషన్ డేట్ confirm చేసారు. అంతా బాబా దయ అనుకున్నాము.
కానీ డాక్టర్ వచ్చి పిల్లవాడు బ్రతుకుతాడో లేదో ఇంతవరకు ఆపరేషన్ అందుకే చేయలేదు. కానీ మొండిగా ఉన్నారు కాబట్టి ఏది అయితే అది జరుగుతుంది, అన్నిటికి రెడీ గా ఉండండి అని అన్నారు.
సరేనని నేను సంతకం చేశాను. ఆపరేషన్ హాల్ లోకి చిన్న బాబుని భుజాన వేసుకొని, ఒక చేత్తో సచ్చరిత్ర పుస్తకం, ఒక చేత్తో బాబుని ఎత్తుకుని ”బాబా నువ్వే కాపాడాలి” అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ లోపలి వెళ్ళాను.
బాబు నా భుజాన ఉన్నప్పుడే వాళ్ళు ఇంజక్షన్ చేసారు. నా కళ్ళ ముందే వాడి పిర్రలో ఇంజక్షన్ సూది ఇరుక్కు పోయింది.
అది చూసి ఏడవటం. ఇదేంటి ఆపరేషన్ ముందే ఇలా ఉంది. సూది పిర్రలో ఇరికించారు. ఆపరేషన్ ఏమి చేస్తారో బాబా అని నేను బాగా ఏడుస్తున్నాను.
ఆ తరువాత ఆపరేషన్ నాలుగు గంటలు పట్టింది. డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ అయితే చేసాము, ఆ తర్వాత బాబు తిప్పుకోవాలి. ఓన్లీ 15 రోజులలో ICU లో రికవరీ కావాలి అని అన్నారు.
నేను పారాయణం మాత్రం ఏడుస్తూనే చేస్తున్నాను. ICU లోకి మమ్మల్ని రానివ్వడం లేదు. బాబుకి ఆకలివేస్తే ట్యూబ్స్ ద్వారా తల్లి పాలు గ్లాస్ లో పిండి ఇవ్వడానికి మాత్రమే పిలిచేవారు.
అక్కడ కూడా టెన్షన్ ఎందుకంటే పక్కనే ఆపరేషన్ అయిన పిల్లలు మృతి చెందేవారు, అప్పుడు ICU బయట ఉన్నవాళ్ళని పిలిచేవారు, ఆ పిలుపు పాలకా లేక ఏమైనా జరిగిందా అని లోపలికి వెళ్ళేదాకా తెలియదు.
కొంతమంది పేరెంట్స్ ఏడుస్తూ బయటికి వచ్చే వాళ్ళు. నాకు ఒక పక్క టెన్షన్ ఎందుకు పిలుస్తున్నారు అని భయం భయంగా బిక్కు బిక్కు మంటూ వెళ్లేదాన్ని. పాల కోసం అమ్మా అనేవాళ్ళు. హమ్మయ్య అని అనుకునేదాన్ని.
ఆ పాలు కూడా సాయి నామం చెప్తూ పిండి ఇచ్చేదాన్ని. కానీ నర్స్ ఒకామె చెప్పింది, ”ఎవరో ఒక ముసలాయన కూడా కాపలా ఉంటున్నట్టు కనిపించింది. ఎవరండీ? ఎవరో ముసలాయన వస్తున్నాడు. చూసి వెళ్తున్నాడు” అనేది.
నేను ఏమి మాట్లాడే దాన్ని కాదు ఎందుకంటే నాకు ఎవరో తెల్సు కాబట్టి. నేను చనుబాలు పిండేటప్పుడు కూడా ‘బాబా బాబా అంటూ’, ‘బాబా బిడ్డని కాపాడు’ అంటూ, మంత్రయుక్తమై, ఆ పాలు సాయి (మా అబ్బాయి) కడుపులోకి వెళ్లి ఎంతో సుగుణాన్ని ఇచ్చింది.
నెల రోజులు ICU లో ఉండవలసిన బాబుని 15 రోజులలోనే జనరల్ వార్డ్ కి మార్చారు. బాగా తగ్గింది. మేము గుంటూరుకి బయలుదేరాము.
మేము అదే రోజు రాత్రి డెల్టా express కి జనరల్ కంపార్ట్ మెంట్ లోనే వచ్చాము. బాగా వానలు పడుతున్నాయి. అటునుండి అంటే గుంటూరు నుండి డెల్టా బయలుదేరుతుంది. ఇటు హైదరాబాద్ డెల్టా బయలుదేరింది.
మరి ఏమైందో ఏమో ఆ వానలకు పట్టాలు క్రింద మట్టి కొట్టుకొని అటు నుండి వచ్చే బండి వలిగొండ దగ్గర పట్టాలు తప్పింది.
ఆ రోజు మా రైలు పట్టాలు తప్పేది, కానీ మేము వలిగొండ దాటేశాము. ఆ తర్వాత వచ్చే రైలు పట్టాలు తప్పింది. ఎంతోమంది బాలి అయినారు. బాబాకు ఎంతో కృతజ్ఞతలు.
బాబాకు ఎంతో రుణపడి ఉన్నా తీర్చుకోలేము. ఇంటికి వచ్చాము. బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.
వాడికి 8 సంవత్సరాలు వచ్చాక బాగా అల్లరి చేస్తుంటే వీపుపై కొట్టేదాన్ని మా అమ్మగారికి బాబా కనపడి ”నా బిడ్డను వీపుపై బాదుతోంది. ఒక దెబ్బ పడ్డా కూడా క్షమించను” అన్నారట. అమ్మ ఫోన్ చేసి చెప్పింది.
అప్పటి నుండి నేను కానీ ఎవరం కానీ సాయిని కొట్టం. చూసారా నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- శ్రీమతి ఔరంగాబాద్ కర్ కు చేసిన లీల మరల ఇప్పుడు చేసి, ఎప్పుడు తనను నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయనని నిరూపించుకున్న బాబా వారు.
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- బాబా నామస్మరణ , తప్పించిన ప్రసవ వేదన ……
- ఆమె జీవితం బాబా యొక్క బహుమతి
- ఆరాత్రి కలలో బాబా కన్పించి ఎందుకు భయపడతావు?–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments