పసివాళ్లుగా దర్శనం ఇచ్చిన బాబా, దత్త భగవానుడు…!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒక రోజు నా గదిలోనే పడుకున్నాను. నా మంచం పక్కనే బాబా ఫోటో ఉంది.

నేను ఆయన్ని చూస్తూ ”బాబా నువ్వు అందరికీ దర్శనమిస్తావు కదా, మరి నాకెందుకు అలా కనపడవు” అని అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను.

బాబా ఫోటో పక్కనే దత్తభగవానుడి ఫోటో కూడా ఉంది. నా కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చాయి.

నాకు ఒక కల వచ్చింది. అందులో మూడు తలలు ఉన్న పసివాడు, సుమారు ఏడాది ఏడాదిన్నర వయసుంటుందా పసివాడికి.

పాలుగారే బూరెబుగ్గలు చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ బాబుని ఎత్తుకున్నాను, అలా ఆ బాబుని ముద్దు చేస్తూనే ఉన్నాను.

ఆ పక్కనే ఉన్న కుర్చీలో నేనూ కూర్చున్నాను. ఆ పసివాడు క్రిందకి దిగి మళ్ళీ నా కాళ్ళ మీద నుండి పైకి ఎగబాకి పొట్ట మీద ఇష్టం వచ్చినట్లు గంతులు వేసాడు.

ఇంకా ఇంకా పైకి ఎక్కుతున్నాడు. ఇంకా ఎక్కడికి ఎక్కుతావు నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటావా అని అడిగాను.

వాడు నిజంగానే నా నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు. నేనూ నెమ్మదిగా క్రిందకి దించాను.

ఈ లోపు మరో పసివాడు వచ్చాడు. ముందు పసివాడు దత్తుడిగా నాకు తెలుస్తుంది. మరో పసివాడు ”శ్రీ సాయి నాథుడు”.

ఇప్పుడు ఇక ఇద్దరు ఎత్తుకోమని మారం చేసారు. నేనూ ఇద్దరినీ చెరో చంకన వేసుకున్నాను. చాలా సేపు నాతోటే ఆడుకున్నారు వాళ్ళు.

అంతలో మా అత్తగారు కూడా అక్కడికి వచ్చారు. ఆవిడా వాళ్ళని చూసారు.

”అత్తయ్యా చూడండి వీళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారో”  అంటున్నాను.

ఆవిడ వాళ్ళని చూసి ఆనందిస్తోంది. మా అత్తగారు వాళ్ళకేమైనా పెట్టవే కళ్యాణి అంది. నేనూ బిస్కెట్స్ తీసుకువచ్చి పెట్టాను.

దత్తు బాబు ”నాకు బిస్కెట్ వద్దు” అన్నాడు  ముద్దు ముద్దుగా. బాబా ఒక బిస్కెట్ తీసుకుతిన్నాడు.

ఏది అడిగినా అది వద్దు ఇది వద్దు అంటున్నాడు దత్తు బాబు. అన్నీ వద్దు వద్దు అనకపోతే ఏది కావాలో చెప్పారా అన్నాను నేను ‘‘నాకూ నాకూ పాలేచి, బువ్వేచి  ఉప్పేసి పెట్టు” అన్నాడు.

”పాలల్లో ఉప్పా ఇదేమి కాంబినేషన్ రా బాబు” అన్నాను.

”ఉప్పు కాదు పంచదార వేసుకోవాలి పాలలో” అన్నాను నేను. ”కాదు కాదు ఉప్పే కావాలి అన్నాడు.

సరే అని నేను అన్నంలో పాలు పోసి ఉప్పు వేస్తే ఏం బావుంటుంది అందుకే ఏది వేయకుండా తీసుకువచ్చాను.

”ఉప్పు వేశావా ఉప్పు వెయ్యి అందులో” అంటూ దత్తు బాబు ఉప్పు డబ్బా చూపిస్తున్నాడు. ఇంక తప్పేటట్టు లేదని ఉప్పు డబ్బా దగ్గరికి వెళ్లి ఉప్పు వేసి వేయనట్లుగా వేసి వాడికి పెట్టాను, తిన్నాడు.

ఈ లోపు బాబా బాబుని నీకేం కావాలి అని అడిగాను. నాకు శనగలు కావాలి అని అన్నాడు. ఇప్పటికిప్పుడు శనగలు అంటే నేను ఎక్కడినుండి తేవాలి అనుకుని మొత్తానికి ఎదో పెట్టాను, తిన్నాడు.

మళ్ళీ ఇద్దరినీ చెరో చంకన వేసుకుని అక్కడ ఒక నది లాగా ఉంది, ఆ నది వొడ్డున కూర్చోవడానికి బెంచీలు కూడా ఉన్నాయి.

ఆ బెంచీల దగ్గరికి తీసుకువెళ్ళి ఇద్దరినీ అక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి లోపల పని చేసుకుని మళ్ళీ వస్తాను అని లోపలికి వచ్చాను.

ఆ తర్వాత నేను పని అంతా చేసుకుని వెళ్లి చూస్తే అక్కడ పిల్లలు లేరు. ఇదీ కల.

నాకు దర్శనం కావాలి అన్నందుకు ఇంత కల వచ్చింది. ఆ బాబు ఉప్పు అడిగాడేమిటి అనుకున్నాను.

కానీ ఆ తర్వాత నేను ఎక్కడో చదివాను గానుగాపురం లో దత్తుడికి పాలల్లో ఉప్పు వేసి పెడతారట. ఆ కల లో నేను చూసిన నదీ తీరం కూడా గానుగాపురమే అనిపించింది. నేను చూడలేదు కానీ విన్నాను.

ఆ తర్వాత నేను శనగలు నానబోసి సాతాళించి బాబాకి, అన్నం వండి అందులో పాలు పోసి పిసరంత ఉప్పు వేసి దత్తుడికి నైవేద్యంగా పెట్టాను.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles