Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా వద్దకు కంటి వ్యాధితో బాధపడుతున్న ఒక రోగి వచ్చాడు. బాబా నల్లజీడి పిక్కలను నూరి, రోగి కంటిలో పెట్టి కట్టుకట్టాడు. మరునాడు కట్టు విప్పి కళ్ళపై నీరు పోసాడు. కంటి బాధ మాయమైంది.
తిరువణ్ణామలైలో ఉంటున్న రాంసూరత్ కుమార్ వద్దకు ఒక వ్యక్తి వచ్చి, వైదులు తనను చప్పిడి మెతుకులను మాత్రమే తినమన్నారని, ఇంకా ఏమి తినవద్దన్నారని వాపోయాడు.
రాంసూరత్ కుమారు పరిచారకుడిని పంపి, మిరియాలపొడి పోట్లాము కొనుక్కురమ్మన్నారు. పోట్లాము వచ్చింది.
అందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఆ మిరియాల పొడిని ఆ రోగిచే తినిపిస్తాడేమోనని.
రాంసూరత్ కుమార్ ఎప్పుడూ తన వద్ద ఉండే కొబ్బరి చిప్పలో వేసి, కొంచెం నీరు కలిపి, అమాంతం నోట్లో పోసుకుని గుటక వేశారు.
అందరూ ఆశ్చర్యపోయారు రెండు, మూడు నిముషాలు అటు, ఇటు తిరిగి “ఇక నీవు నీ కిష్టమైన పదార్దాలను తినవచ్చును” అన్నారు ఆ రోగితో.
వ్యాధి ఒకరికి చికిత్స తనకా? సద్గురువులవన్నీ వింత చికిత్సలు.
రాంసూరత్ కుమార్ కు చిన్నతనం నుండి గంగ అంటే ఇష్టం.
సంసారి. ఆధ్యాత్మిక జిజ్ఞాసవల్ల పాండిచ్చేరిలో అరవిందులను, తిరువణ్ణామలైలోని రమణ మహర్షిని, కన్హన్ గఢ్ రామదాసును కలిశాడు.
ఒకసారి కాదు, రెండుసార్లు ఆ సద్గురువులను కలిశాడు. అరవింద, రమణ మహర్షిలు మహాసమాధి చెందారని విన్నాడు.
ఇక అయన కన్హన్ గఢ్ రామదాసును ఆశ్రయించాడు. రాంసూరత్ కుమార్ తనను ‘బెగ్గర్’ అని చెప్పుకునేవాడు.
‘ఓం శ్రీరాం జయరాం జయరాం’ అనే మంత్రాన్ని రామదాసుగారు రాంసూరత్ కుమార్ చెవిలో ఉపదేశించారు.
గురువుగారు ఇంకా “రాత్రింబవళ్ళు ఆ మంత్రాన్ని జపించు” అని ఆదేశించారు. గురువుగారి మాటలు గుండె లోతులులోనికి చొచ్చుకునిపోయాయి.
ఆ గురువుపై, ఆ మంత్రపైన ఆయనకు పూర్తి నమ్మకం ఏర్పడింది. పరిపూర్ణ మానవుడయ్యాడు.
“ఈ భిక్షుకుని తండ్రులైన త్రయంచే గొప్ప కార్యం నిర్వహించబడ్డది. ఆ పనిని అరవిందులు ప్రారంభించగా, రమణులు కొనసాగించగా, స్వామి రామదాసుగారు పూర్తి చేశారు” అంటారు ఆ పితృత్రయాన్ని స్మరిస్తూ.
అయన రామదాసుగారి ఆదేశంతో తిరువణ్ణామలైలో స్థిరపడ్డారు. ఒక చేతిలో విసనకర్ర, ఒక చేతిలో ఎండిపోయిన టెంకాయచిప్ప, మాసిపోయిన గడ్డం, ముఖము మీద అలౌకికమైన చిరునవ్వు, మనసులో మహా మంత్రంతో అయన దర్శనమిచ్చేవారు.
గురువు అనుగ్రహం తాను పొందటమేగాక, ఇతరులు అటువంటి అనుగ్రహాన్ని పొందాలని ఆయన అభిలాష,
వర్షం పడునప్పుడు మనం ఏ విధంగా గొడుగు పట్టుకుని పొలం పనికిగాని, కర్మాగారానికి మరె ఇతర పనులకోసమైనా బయటకు పోతామో, అదే విధంగా మన చుట్టూ అనేక సమస్యలున్నా, దివ్యనామం మన సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది అంటారాయన.
నేడు ఫిబ్రవరి 20. రాంసూరత్ కుమార్ మహాసమాధి చెందిన దినం. ఆయనను, దివ్య నామాన్ని స్మరించెదము గాక!
“ఓం శ్రీరామ జయరామ జయజయరామ….”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రేయో మార్గము…. మహనీయులు – 2020… జూన్ 20
- మరో బుద్ధుడు …. మహనీయులు – 2020… నవంబర్ 4
- భగవంతుడే గొప్ప ! ….. సాయి@366 ఫిబ్రవరి 20….Audio
- ఆదినాథుడు – ఆది భిక్షుకుడు…. మహనీయులు – 2020… మే 22
- కలుషితం కాదు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 23
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments