Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
బాబూరాం మొక్కల సంరక్షణ చేసే స్వాములతో గులాబీ మొక్కల కొమ్మలను కత్తిరించమని, లేకపోతే గురుదేవులయిన రామకృష్ణ పరమహంస బట్టలకు పట్టుకుంటాయనే వారు.
తాంబూలం సమర్పించేటప్పుడు సున్నం ఎక్కువగా వేయవద్దని, గురుదేవుల నోరు పొక్కుతుందనీ అనేవారు. రామకృష్ణులు వేడిగా అన్నం తింటారని, అందుచేత చల్లారిన అన్నం వడ్డించవద్దనే వారు. ఇలా ఎన్నో సూచనలను స్వామీజీలకు ఇచ్చేవారు బాబూరాం.
అంటే రామకృష్ణ పరమహంస 1886లో మహాసమాధి చెందినా, ఆయనకు చేసే పూజ, సేవ, అర్పణ మొదలైనవి ఆయన సజీవంగా ఉన్నాడనే భావనతో చేయాలనే వారు.
ఇక సాయి బాబా విషయం:
వల్లీ నాయగం, బెంగళారు హైకోర్టులో న్యాయాధీశుడు. ఆయనకు ఒకసారి శ్రీ సాయివిభూతిబాబా సాయిబాబా పటాన్ని ఇచ్చారు ప్రసాదంగా.
వల్లీనాయగం సాయిబాబా పటాన్ని చుట్ట చుట్టి చేతిలో పెట్టుకున్నారు. దీనిని విభూతి బాబా చూచారు.
”అలా చుట్టగా చుట్టం వలన ఆ పటంలోని సాయికి బాధ కలిగిస్తుందని తెలియదా?” అన్నారు విభూతిబాబా.
విభూతిబాబా సాయినాథుడు సర్వత్రా రక్తమాంసాలతో నిండి ఉన్నట్లు అనుభూతి చెందేవారు. సాయినాథుడు ఆ ఫొటోలో ఉన్నాడన్న భావం చాలదు. ఆ భావాన్ని అనుభూతిలోనికి తెచ్చుకోవాలి.
సాయివిభూతిబాబా ఎవరో కాదు. తెలుగు వెలుగు. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో నవంబరు 7, 1900 సం||లో ఆదిమూలం పిళ్ళై అగ్రహారంలో జన్మించారు.
పూర్వాశ్రమంలోని పేరు జగన్నాథం. ఈయన అన్నగారు అహమ్మద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆర్.పి.ఎఫ్.లో పని చేసేవారు.
ఈయన అన్నగారి వద్ద ఉన్నప్పుడు సుమారు 12 సంవత్సరాల వయస్సులో షిరిడీలోని సాయినాథుని దర్శించారు. సాయిబాబా ఆ బాలుని తన తొడపై కూర్చుండబెట్టుకొని, తాను నములుతున్న తాంబూలపు ఆకులను ఈ పిల్లవాని నోటిలో పెట్టారు.
కొంతకాలం తరువాత జగన్నాథం గారు సాయి భక్తుడైనాడు. ఆయన ఒంటి నుండి విభూతి వస్తూ ఉండటం వలన ఆయన సాయి విభూతి బాబా అయ్యారు. ఈయన మహాసమాధి చీట్లపాక్క, చెన్నైలో ఉంది.
ఈనాడు నవంబరు 7 సాయివిభూతిబాబా జన్మదినం. సాయిని సర్వత్రా తిలకించుదుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ద్వారకామాయిలో బాలకృష్ణుడు…..సాయి@366 నవంబర్ 10….Audio
- అందరిని ఆదరించు ….. సాయి @366 ఫిబ్రవరి 7….Audio
- మొక్కును పూర్తిగా తీర్చాలి…..సాయి@366 నవంబర్ 24….Audio
- ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio
- సేవకు వేళాయె!…..సాయి@366 నవంబర్ 30…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments