Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఇతర దైవములను కొలచుటమాని, తనను పూజించుమని ఏనాడూ చెప్పలేదు.
కాగా ఏ భక్తునకు ఏ దైవము ఇష్టమగునో, ఆ దైవమునే పూజింపుమనెడి వారు. ఆ దైవముగానే దర్శనమిచ్చినట్లు సాయి సాహిత్యములో నున్నది.
అరుంధతీ అమ్మాళ్కు సాయి రామునిగా సాక్షాత్కరించారు. బల్వంత్ ఖోజోకర్కు సాయి దత్తునిగా దర్శనమిచ్చాడు.
నందిపాటి జగన్నాయకులు విజయవాడలోని ప్రముఖ వైశ్యులు. ఈయనకు కృష్ణుడనిన అభిమానము, భక్తి.
విజయవాడలో శ్రీకృష్ణ జయంతి మహోత్సవములు 8 దినములు అంగరంగ వైభవముగా జరిపెడి వారు.
హరికథా గానములు, పురాణ ఉపన్యాసములు, అష్టపది కీర్తనా కాలక్షేపములు, నారాయణ తీర్ధులు, ముత్తు స్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి కీర్తనా కచేరీలు, ఇలా ఎన్నో జరిపించే వారు.
అట్టి కృష్ణ భక్తునకు కృష్ణుడు దర్శనమీయకుండునా? అయితే సాయి కృష్ణుని విషయమేమై ఉండును?
నందిపాటి జగన్నాయకులు గారు తరచుగా బొంబాయికి వ్యాపార నిమిత్తము వెళ్లెడి వారు.
ఒకసారి 1910లో బొంబాయి వెళ్ళుచుండగా మార్గమధ్యమున షిరిడీ అను గ్రామము కలదనియు, అందలి అవలియాను దర్శింపుమని ఒక వృద్ధుడు తెలిపాడు.
జగన్నాయకులు షిరిడీ వెళ్ళారు. అవలియా పేరు సాయిబాబా అని తెలిసింది. షిరిడీకి వెళ్ళిన ఆయన సాయియందు తనకు గతంలో కనిపించిన వృద్ధమూర్తి కనిపించాడు.
జగన్నాయకులు బాబా చెంత కొంతసేపు నిలబడ్డారు. బాబా జగన్నాయకులు గారికి ఇష్టమైన బాల కృష్ణునిగా – పారాడే బాలకృష్ణునిగా దర్శనమిచ్చాడు.
బాబా ఆయనను ‘జగన్నాయకులూ’ అని చిరునవ్వుతో పలకరించారు. అది మొదలు జగన్నాయకులు బొంబాయి పోవునప్పుడు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునే వారు అని ఆయన కుమారుడు నారాయణరావు తెలిపారు.
నారాయణరావు గారు శ్రీ సాయి అష్టోత్తర శతగీత మాలను, శ్రీ సాయినాథుని దండకము, శ్రీ సాయి మేలుకొలుపు గీతములను రచించి సాయికే అంకితమిచ్చిన పుణ్యమూర్తి.
ఆ దినం 10.11.1971 రాత్రి 9 గంటలు. జగన్నాయకులు గారు శరీరమును త్యజించబోవు చున్నారు. ఆయన కనులలో చెమ్మ కనిపించింది.
కోడలు మామగారు ”మీరు నమ్మిన కృష్ణుడు మిమ్ము కాపాడతాడు” అన్నది. జగన్నాయకులు ”నేను అదే చూస్తున్నాను” అంటూ శ్రీహరిలో ఐక్యమయ్యారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయినాథుని ధుని…..సాయి@366 ఏప్రిల్ 4….Audio
- ఆది భిక్షువు సాయినేమి కోరేది? ….. సాయి @366 ఫిబ్రవరి 10….Audio
- సాయి విభూతి బాబా…..సాయి@366 నవంబర్ 7….Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – నాల్గవ భాగం—Audio
- ప్రధమ చిత్ర సాహిత్య ప్రదర్శన…..సాయి@366 నవంబర్ 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments