నాకు ప్రాణభిక్ష పెట్టి, తమ చేతి స్పర్శ తో నా కాళ్ళ బాధల నుండి విముక్తి చేసిన బాబా …!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


కొన్ని రోజులకి నా కొక పాప పుట్టింది, ఆ తర్వాత ఏడాది నేను మా పిన్ని కూతురికి అవసరమని రక్తం ఇవ్వటానికి వెడితే

డాక్టర్ నా చేయి పట్టుకొని నాడి చూసి నువ్వా! ఎలా ఇస్తావు చాలా నీరసంగా ఉన్నావు పైగా కడుపుతోటి వున్నావు, అంది అప్పుడు టెస్ట్ చేస్తే ఆరవనెల అని తెలిసింది,

అప్పటి నుండి బెడ్ రెస్ట్ అన్నారు 9 వ నెల నిండగానే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది ఇంక ఆగటం లేదు ఒక ఆసుపత్రికి తీసుకు వెళ్లారు

అక్కడ ఈ అమ్మాయి బ్రతకదు వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నారు, ఒక చీర దుప్పటి మాత్రమే నా ఒంటి మీద వుంది అక్కడ కూడా డాక్టర్స్ చెప్పేసారు బ్రతకడం చాలా కష్టం 1 % కూడా ఛాన్స్ లేదు అన్నారు

అమ్మ చేత బయలు దేరేముందు ”ఊదీ” పెట్టించు కొని, నేను మా అమ్మ తో భయపడద్దు. నాతో కూడా బాబా ఫోటో ఒకటి ఉంచుకుంటానని చెప్పాను.

బ్లీడింగ్ మొదలయ్యేటప్పటికీ ఇంట్లోనే నా పరిస్థితి పెద్ద వాళ్ళకి అర్ధం అయిపోయింది.

ఈ లోపు డాక్టర్ వచ్చింది, నేను చూస్తూండాగానే నా పల్సు పట్టుకుని చూసింది. నేను ఆమె ముఖం గమనిస్తూనే వున్నాను, ఇంక లాభం లేదున్నట్లుగా మొహం పెట్టింది.

నేను ఆవిడ్ని అడిగాను ఎలా ఉంది డాక్టర్ అని, ఏమైంది నీకేం కాలేదు అంతా బాగానే ఉంది. కాసేపట్లో ఆపరేషన్ చేస్తాము అంతా బాగానే వుంటుంది అంది.

నేను ”బాబా” ఫోటోను డాక్టర్ కి చూపించి ”ఆపరేషన్ థియేటర్ లోకి ఈ ఫోటో తీసుకు వెళ్లవచ్చా” అని అడిగాను ”తీసుకు వెళ్ళమ్మా దానికేం అంది”,

ఎలాగో చనిపోతుంది, చనిపోయేముందు ఈమె ఆఖరు కోరిక ఎందుకు కాదనాలి అనుకుందేమో .

నాకు రక్తం ప్రవాహంలాగా పోతూనే వుంది దుప్పట్లు దుప్పట్లు మారుస్తూనే వున్నారు

ఆపరేషన్ థియేటర్ లోకి నన్ను తీసుకువెళ్ళారు, నేను బాబా ఫోటో చేత పట్టుకొని లోపలికి వెళ్ళాను, ఫోటో దిండు కింద పెట్టాను,

బాబా అంతా నీదే భారం అనుకున్నాను, ఆపరేషన్ అయ్యింది పాప పుట్టింది. అంతకు ముందు ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అన్నారు ఇద్దరమూ బాగానే వున్నాము.

నాకు సృహ లేదు, సృహ వచ్చిందంటే అందర్నీ గుర్తు పడుతుందనే నమ్మకం లేదని డాక్టర్ చెప్పిందట,

నాకు మెలకువ వచ్చింది, నువ్వు ఎవరు? అన్నారు, చుట్టూ అందరూ మూగి ఉన్నారు, నేను సుహాసినిని అని చెప్పాను,

ఎలా ఉంది అని అడిగారు బాగానే వుందన్నాను. నాకు బ్లీడింగ్ మాత్రం కంట్రోల్ కావడం లేదు ఇంకా ఇంకా పోతూనే ఉంది 23  సీసాల రక్తం ఎక్కించారు.

నేను ఎలాగో చనిపోతానని అందరికీ ముందే తెలిసిపోయింది కాబట్టి డాక్టర్ కూడా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువేళ్ళినా ఏదో చేయాలి కాబట్టి చేసినట్లుగా చాలా నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసారుట,

ఆ సమయంలో డాక్టర్ ఉపయోంగించిన ఫోర్ సిప్స్ నా గర్భసంచి కి తగిలిందట, అది చూసి కూడా చూడనట్టు పట్టించుకోకుండా నా పొట్టకి కుట్లు వేసేసారు.

అందుకే బ్లీడింగ్ ఆగటంలేదు, ఈ సంగతి తర్వాత తెలిసింది. అందరూ ఆవిడ మీద కేసు వేయమన్నారు.

మా వాళ్ళు వూరుకోమన్నారు, ఎందుకులే అని వూరుకున్నాము, మర్నాడు రాత్రి కి మళ్ళీ ఆపరేషన్ చేసి నా గర్భసంచి తీసేసారు.

దీనితో నేను చాలా నిరసించి పోయి ఏ పని చేయలేని స్థితికి చేరుకున్నాను, కానీ పాప 5వ నెల వచ్చేటప్పటికి చనిపోయింది.

ఒక రోజు మా ఇంట్లో కి కోయిల వచ్చింది మంచిదే అని కొందరు, మంచిది కాదని కొందరు అన్నారు.

ఇల్లంతా శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అని కొందరంటే సరేనని ఇల్లు మొత్తం అలమరాలతో సైతం తీసి గోడల తో సహా రుద్ది కడిగి అంతా సర్దేటప్పటికి నాకు ఇంక చేత కాకుండా అయి పోయింది.

కాళ్ళ ల్లోంచి ఎముకలలోంచి భయంకరమైన పోట్లు వస్తున్నాయి అది కూడా ఒక కాలు మోకాలు క్రింద ఎముకలలోంచి నెప్పి వస్తోంది నేను గోడకి జాల పడి కాళ్ళు రెండు చాపి కూర్చున్నాను

ఆ నెప్పి నేను తట్టుకోలేక పోతున్నాను, ఏడుస్తూ కళ్ళు మూసుకున్నాను, ”బాబా ఎందుకు నాకే ఈ కష్టాలు పెట్టావు ఆయనకేమో హార్ట్ కంప్లికేషన్ పెట్టావు, నాకేమో ఇలా నెప్పులు పెట్టావు”అని భయపడుతూ కూర్చున్నాను.

నాకు రెండవ డెలివరీ నుండి నెప్పులు వస్తున్నాయి, మా వారికి పెళ్లి కి ముందు నుండి హార్ట్ కంప్లికేషన్ వుంది, ”పేస్ మేకర్” పెట్టారు.

అది ఆయన పెళ్ళి చూపులకి వచ్చినప్పుడే నాతోటి పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పేసారు.

వాళ్ళమ్మ వాళ్ళతో కూడా చెప్పేయమని చెప్పాడట, కానీ వాళ్ళు చిన్న ప్రాబ్లం అన్నారు కానీ విషయం ఇది అని చెప్పలేదు.

అది విని మా వాళ్ళు ఈ సంబంధం వద్దు అన్నారు, ఎప్పుడు ఏ మవుతుందో తెలియని అబ్బాయి ని తెలిసి తెలిసి ఎలా చేసుకుంటావు అన్నారంతా,

నాకు ”బాబా” వున్నాడు బాబా చూపించిన సంబంధం నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటా నని చెప్పేసాను.

ఈ సమస్య వుండటాన ఆయన గట్టిగా పని చేయలేడు, అందుకే బాబా ని అడుగుతున్నానన్నమాట.

కళ్ళు మూసుకుని వున్నాను, వీధి తలుపు తెరిచే ఉంది, ఒక తెల్లని బట్టలతో ఒక ఆకారం లోపలి కి వచ్చింది, కూడా ఒక కుక్క కూడా ఉంది,

ఆ ఆకారం వచ్చి నా కాళ్ళ దగ్గర గా కూర్చుంది, ఆకారం ”ఏంటి కాళ్ళ నెప్పులంటావు వుండు’ అంటూ నాకాలు పట్టుకుని చర్మం ఓపెన్ చేసి లోపల ఎముక కి ఒక ఇంజక్షన్ చేసాడు,

బాబాయే వచ్చింది ఇంకెవరు, లేకపోతే నాకు స్పష్టంగా ఆ చేతుల స్పర్శ కాళ్ళ మీద తెలుస్తోంది, ఇంజక్షన్ మందు పైకి ఎక్కటమూ అనుభవం అవుతోంది, శరీరం అంతా కూడా చల్లగా మారుతోంది, ”అయిపోతోంది”, అన్నాడు.

”ఇంకో కాలికి కూడా నెప్పి వుందా” అన్నాడు నేను లేదు ఒక కాలికే అన్నాను ”సరేపో ఇంక నీకు నెప్పులు రావులే సరే నా” అంటున్నారు,

నేను కళ్ళు తెరిచాను ఎవరూ లేరు ఆ రోజు నుండి ఈ రోజు వరకూ నాకే కాళ్ళ నెప్పులు లేవు.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles