గురుపాదమునుంచ నేను …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“నా గురువు ప్రతిబింబము నాకండ్లలో నిలువనిచో, నాకు దృష్టి లేకుండినచో బాగుండెడిది అనిపించేది” అన్నారు. సాయిబాబా తన గురువును గురించి మాట్లాడుతూ.

సీతారాందాస్ ఓంకారనాథ్ గురువు దాశరధీ దేవ్. తన గురుదేవుల స్పర్శను అనుక్షణము పొందుటకై గురు పాదుకలను హృదయముపై ఉంచుకునే వాడు.

ఆయన (సీతారాం దాస్ ఓంకారనాథ్) ఏ సమయంలో తన భక్త బృందంతో పూరి జగన్నాధ ఆలయానికి నామ సంకీర్తన చేస్తూ వస్తాడో, అచ్యుతానంద దాదాపు 400 ఏండ్ల క్రితమే తన రచనలలో తెలియచేసారు.

దివ్య నామము లేక మహామంత్రమే ఇప్పటి యుగాన్ని కాపాడేదని, దానిని వ్యాప్తి చేయమని సీతారాందాసు ప్రోత్సహించేవారు.

భారతదేశంలో ఒక ఉన్నతాధికారి అయన శిష్యుడు, యుద్ధంలో ఉన్న ఆ అధికారి ఆచూకీ ఎంతకీ తెలియటంలేదు.

ఆ అధికారి భార్య గురువుకు ఈ విషయం చెబుదామని వెళ్ళింది. ఆమె గోడు వినకుండా “నామ్ కారో” (ప్రార్థనచేయి) అన్నాడు.

ఆమెకు తెలిసిన వ్యక్తి ఒకరు, అలా భావించవద్దని, గురువు సర్వజ్ఞుడని చెప్పారు.

వెంటనే ఆమె ప్రార్థనలు చేయసాగింది. తెల్లవారగనే ఆ అధికారి యోగక్షేమాలు తెలిసాయి.

ఇది ఆ భక్తురాలి నమ్మకమా?

గురుదేవుల అద్భుత లీలా?

లేదా ఇది నామ మహత్యమా?

ఏది ఐనా, ఒకటే.

సీతారామదాసు వద్ద మాధవస్వామి అనే వ్యక్తి ప్రసాదాలను తయారు చేసేవాడు.

ఒకొక్కసారి ఎంతో ఆహార పదార్థం మిగిలిపోతుంటే, ఆ పదార్దాన్ని గంగలో పడవేసేవాడు మాధవస్వామి.

అది చూచి సీతారాందాసు “ఎంతో ఆహారం వృథా అవుతొంది” అన్నారు. “నేనేం చేయగలను?” అన్నారు మాధవస్వామి.

“ప్రసాదం చేసేముందు ఎంతమందికి చేయాలి అని నన్ను అడుగు” అన్నారు సీతారాందాసు మాధవదాసుని.

ప్రతిసారి మాధవస్వామి అడిగేవాడు. సీతారాందాసు చెప్పేవారు.

ఒక్కొక్కసారి సందర్శకులు తక్కువగా వచ్చేవారు. ఒక్కొక్కసారి ఎంతోమంది వచ్చేవారు. తక్కువ వచ్చిననాడు మిగిలిపోవటం గాని, ఎక్కువమంది వచ్చినప్పుడు ఆహారం సరిపోకపోవటం గాని జరగలేదు.

ఇది సద్గురు వాక్కు మహిమ.

సద్గురు సాంప్రదాయ సంస్థను స్థాపించిన ఆయన ఫిబ్రవరి 17 (1892)న జన్మించారు.

నేడు వారి జయంతి.

ఆయనను స్మరిద్దాం!

శ్రీరామ జయరామ జయ జయ రామ!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles