”డబ్బుతో పని లేదు బాబా! ఇద్దరూ అనుకూలంగా, ఆనందంగా చివరి దాక కలిసి ఉండాలి.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా చిన్నమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతనికి దీనికి జాతకాలు కలవలేదు. ఆ కారణం గా నేనా సంబంధం వద్దన్నాను.

మా అమ్మాయి ఇంకా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకు రావద్దు అంటూ బాధపడి ఇంగ్లాండులో ఒక సంవత్సర కాలం పాటు చదువు కొరకు వెళ్ళిపోయింది.

పిల్ల ఇలా బాధ పడుతుంది అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండే సరికి ఒకసారి మా అమ్మాయికి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన కల నాకు చెప్పింది నాకు జ్ఞాపకం వచ్చింది.

ఆ కల ఏమిటంటే గుడి కింద అది కూర్చొని ఉంటే, నేను గుళ్లో అమ్మవారి దర్శనానికి వెళ్ళాను.

ఈ లోపు బాబా మా అమ్మాయి దగ్గరికి వచ్చాడుట. ”రా! నేను తీసుకు వెళతాను రా’అన్నాడుట.

”నేను రాను మమ్మీ కూడా రావాలి” అని అన్నదట మా అమ్మాయి .”

“మమ్మీ ఎందుకు నేను  తీసుకెడతానుగా నేనుండగా నీకు భయమా! నేను తీసుకెడతాను రా మమ్మీ ఎందుకు నేనుండగా మమ్మీ తో పనిలేదు ” అన్నాడుట బాబా.

నాకది గుర్తుకు వచ్చింది. అప్పుడు నేను అమ్మవారికి దండం పెట్టి   ”అమ్మా! నేను నీ వ్రతం చేస్తాను.

ఉద్యాపన రోజు ఎవరైనా నన్ను నేరుగా వచ్చి ప్రసాదం అడిగి , తీసుకుంటే, జాతకాల సంగతి పక్కన ఉంచి నేను వాళ్ళ పెళ్ళికి వప్పుకుంటా నాన్నను .

ఉద్యాపన ప్రసాదం తీసుకొని నేను కారు ఎక్కేలోపల  నా దగ్గర ప్రసాదం తీసుకోవాలి అనుకున్నాను.

పూజ అయ్యింది, ఉద్యాపన అయ్యింది, ఆ ప్రసాదం తీసుకొని ఆలా కొంత దూరంలో ఉన్న కారు ఎక్కబోతూ నడుచుకుంటూ వచ్చి  కార్ డోర్ తీసాను. నాకే నిరుత్సాహం ఆవహించింది.

కూతుర్ని డిస్అప్పోయింట్ చేయవలసి వస్తుందే అని బాధ పడుతూ, కార్లో ఒక కాలు కూడా పెట్టేసాను.

అప్పటిదాకా నన్నెవరూ ప్రసాదం అడగలేదు, ఇంకెవరు రారేమోఅని రెండవ కాలు కూడా కార్లో పెట్టే లోపల, అప్పుడే స్కూల్ వదిలి నట్లున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ,కారు తలుపుకి తట్టుకొని లోపల పడ్డారు.

వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు. సంతోషి మాత అమ్మవారిని, లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపం లో కొలుస్తాము .

ఈ ముగ్గురే, ఆ ముగ్గురి ఆడపిల్లల రూపంలో వచ్చి ప్రసాదం తీసుకున్నారని అనుకున్నాను. అలా దాని పెళ్లి అయిపోయింది. దానికి అడుగడునా బాబా ప్రేమ చూపిస్తాడు .

మా పెద్దమ్మాయికి చెవుల్లోంచి చీము కారుతూ ఉండేది. రెండు ఆపరేషన్లు కూడా చేసాము, అయినా తగ్గలేదు.

ఒకరోజు నాకు శివుడు కనిపించి ”నేను తగ్గిస్తాను, నాకు కట్టు” అని చెప్పాడు.  ఆ కట్టటం ఏమిటో నాకు అర్ధం కాలేదు.

అదేదో డబ్బులిచ్చి చేయించే పూజ కాదని నాకర్ధం అయింది. కొన్నాళ్ల తర్వాత నేను సంతోషీ మాత గుడికి వెళ్ళాను.

అమ్మావారి ముందు ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఆ గుడి ఫౌండర్ జగన్నాధం గారని ఉన్నారు. (అంతకు ముందు రోజు రాత్రి శివుడు అర్ధ నారీశ్వర రూపంలో నృత్యం చేస్తున్నట్టు కల వచ్చింది).

ఆ అమ్మవారి గుడిలోనే శివుడు కూడా ఉన్నాడు. జగన్నాధం గారు నా దగ్గరికి వచ్చి ”అమ్మా! అమ్మా!” అంటూ డిస్టర్బ్ చేస్తున్నాడు .

”ఏంటండీ! నేను చాలా దూరం నుంచి దర్శనానికి వచ్చాను, నేను ధ్యానం లో ఉండగా ఎందుకు నన్నిలా డిస్టర్బ్ చేస్తున్నారు ”, అంటే

”మీకు కొంచెం చెప్పాలి” అంటూ శివలింగం దగ్గరికి తీసుకెళ్లి, మాలిన్యం అంతా తుడిచి నాకా లింగం చూపించారు.

అది అర్ధ నారీశ్వర లింగం. దాని వెనుక కూడా చూపించి ,”ఇదంతా పడిపోయిందమ్మా !ఇది మీరు చేయించండి” అన్నాడు . ”నాకు కట్టు ” అంటూ కలలో ఆయన చెప్పిన మాట గుర్తుకువచ్చింది .

ఆ ఫౌండర్ ని నేను కసిరాను, ఆ గుడి చాలా దూరంలో ఉంది. చిన్న పిల్లలతో కస్టపడి ఇంతదూరం వెళితే  నన్ను ప్రశాంతంగా పావు గంట సేపైనా కుర్చోనియ్యలేదని కసిరాను.

ఆ రాత్రి నేను పడుకోబోతు ఎప్పటిలాగా బాబా ఫోటో ముందు నిలబడి, దండం పెట్టుకుంటూ ఉంటే, అందులోనించే బాబా సూటిగా తిట్టాడు .

”పెద్ద మనుషులతో ఇలాగేనా మాట్లాడేది ” అని అన్నాడు. ఆ గుడి పూజారి తన సొంత స్థలం లోనే గుడి కట్టించాడు. ఆయన పెద్ద మనిషని బాబా సర్టిఫై చేసారు.

నన్ను సరి అయినా మార్గంలో  నడిపించమని  బాబాని నేను కోరుకున్నాను.

మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, ఒక రోజు తెల్లవారు ఝామున నేను ధ్యానం చేసుకుంటుంటే, ధ్యానంలో బాబా నా ఎదురుగా ద్వారకామాయి లో లాగా కూర్చొని, పిల్లల్ని చూపిస్తూ ”వీళ్ళకి నీకు ఎటువంటి సంభందం కావాలి?” అని అడిగారు.

నేను కొంచెం వివేకం ప్రదర్శించి, ”డబ్బుతో పని లేదు బాబా! ఇద్దరూ అనుకూలంగా, ఆనందంగా చివరి దాక కలిసి ఉండాలి” అని కోరాను.

ఇంతలో ఆయన నా భుజం వెనుకకు ఉన్న మీరాను చూసి ”మీరా! గురుస్థానంలో ఎవర్ని తలచుకుంటున్నావు? అన్నారు. నా ధ్యానానికి బ్రేక్ పడింది.

కళ్ళు తెరిచి చూస్తే మా చిన్న పాప మీరా నిద్రలేచి కాళ్ళునులుము కుంటూ నా భుజం పట్టుకొని నిలబడి ఉంది.

”దేవుడి ముందు నువ్వు ఏ స్తోత్రాలు చదువుతావమ్మా?”. అని అడిగాను.

వెంటనే మీరా ”శుక్లాం భరధరం అని వినాయకుడిని ”తలచుకుంటూ” సర్వ మంగళ మాంగల్యే” అని అమ్మవారిని తలుచుంటాను, చివరిలో ”గురు బ్రహ్మ గురు విష్ణు అని ఎవ్వరిని తలచుకోదట”.

ఆలా ఎందుకని నేను అడిగితే  ”ఎందుకంటే మా పూజా మందిరంలో సాయి బాబా, రామకృష్ణ పరమహంస, యోగానంద, వివేకానంద, రాఘవేంద్ర స్వామి, ఫిరోజి బాబా లాంటి గురువులు ఎంతో మంది ఫోటోలు ఉన్నాయిగా” నేనెవరినీ గురువుగా తలచుకోను?” అని మా పాప అడిగింది.

నేను చాలా ఆశ్చర్య పోయాను.”బాబానే నీ గురువు” అని పాప కి చెప్పాను..

మా దగ్గర చాలా రోజుల క్రితం ఒక 8 ఏళ్ల అమ్మాయి పనిచేసేది. మా పిల్లలది కూడా అదే వయసు.

ఒక సారి మా ఇంట్లో బాబా భజన పెట్టించాము. ఆ పని పిల్ల వచ్చి భజన సమయంలో  నా పక్కన కూర్చోబోయింది. మా పిల్లలు మొహాలు చిన్నబుచ్చుకున్నారు.

నేను ఆ పని పిల్లని కొంచెం పక్కకి తప్పుకుంటే అందరూ నా పక్కనే కూర్చునే వారు కదా అంటూ కసిరాను.

ఆ రాత్రి బాబా నాకు కలలో కనిపించి నన్నేమీ అనలేదు .”అమ్మా లక్ష్మీ!”అని పని పిల్లని పిలిచి, (దాని పేరు లక్ష్మి) దానికి అరటిపళ్ళు, బిస్కెట్స్ అవీ ఇస్తూ నన్ను చూసి ”నేను దాని తాతని” అని చెప్పాడు .

మేము కొత్త కారు తీసుకున్నాము. కారులో శిరిడి వెడదామని నేను మా తమ్ముడిని తోడు వస్తావా అని అడిగితే , అంతకు ముందు వస్తానాన్నవాడు, బాబాకే భాధ అనిపించి నట్లుంది,

బాబా వెంటనే ”వాడా! నీకు దారి చూపించే వాడు” అని తిట్టాడు. వాడు కాదు నేను నీకు దారి చూపేవాడిని అని చెప్పినట్లయింది.

ఆ తర్వాత మా తమ్ముడు శిరిడి కార్లో వెళ్లి దారి తప్పితే  బాబాయే అడ్డంగా పడుకొని ”అటు కాదు ఇటు” అంటూ దారి చుపించాడుట.  బాబాకి ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం ఇష్టం ఉండదు.

ఇలా ఎన్నెన్నో ఆయన శరీరంతో లేడని ఎప్పుడూ అనిపించలేదు. ఆర్తితో మన మనసు ఎప్పుడు అల్లాడిన  నాకేమి కాదు . ఎవరికైనా, ఆ పవిత్ర సద్గురు పాదాలే శరణ్యం.

The above miracle has been typed by. Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles