నాకు కష్టమైన,నష్టమైనా ఇష్టమైనా కూడా అది బాబానే అయి ఉండాలి, కానీ వేరొకరు కాదు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

ఒకరోజు టెంపుల్ లో ఒక ఫ్రెండ్ మియాపూర్ లో నాంపల్లి బాబా టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఒకసారి అని చెప్పారు.

నాంపల్లి బాబా ఎవరు అని అడిగితె తాను కూడా గొప్ప మహాత్ములు,నాంపల్లి లో ఉండేవారు ఇప్పడు సమాధి అయ్యారు అని చెప్పారు.నేను ఓకే ఎప్పుడైనా బాబా పంపిస్తే వెళతాను కానీ,ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పా,తానూ ఇప్పుడు ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు వెళితే బెటర్.తాను చాల పవర్ ఫుల్ అనుకుంటే వెంటనే జరిగిపోతుంది అని చెప్పారు.నేను కావచ్చు కానీ నాకు బాబా అంటేనే ఇష్టం అని చెప్పా.

అతను అక్కడ కూడా బాబా టెంపుల్ ఉంటుంది అన్ని టెంపుల్స్ ఉంటాయి.అని చెబితే నాకు ఈ టెంపుల్ యే ఇష్టం.ఇక్కడ బాబా ఉన్నాడు కదా నేను  బాబాకి తప్ప ఇంకెవరికి అంత తొందరగా కనెక్ట్ అవను అని చెపితే,బాబా అంటే ఇష్టం ఉన్నా అందరి దగ్గరికి వెళ్ళాలి.

బాబా చెప్పారుకదా అన్ని నా రూపాలే అని ఆ రూపాలకు నువ్వు గౌరవం ఇవ్వవా ?అని అడిగాడు.నేను అందరిని గౌరవిస్తాను కానీ బాబాను ఇష్టపడతాను.ఇప్పుడు నేను అక్కడికి వెళితేనే వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు కాదు కదా అన్నాను.సరే నీ ఇష్టం. నువ్వు మంచి భక్తురాలివి కదా అని చెప్పాను అంతే అన్నారు.నేను కూడా సరే అని ఊరుకున్నాను.

 కొన్ని రోజుల తరువాత మా ఫ్రెండ్ ఒకమ్మాయి నాంపల్లి బాబా టెంపుల్ కీ వెళ్లి వచ్చింది.తాను నాంపల్లి బాబా గురించి చెపుతూ తాను చాల పవర్ ఫుల్ అట.మళ్ళీ వెళదామా అని అడిగింది.

నేను రాను నాకు బాబా చాలు అని చెప్పాను.దానికి తాను నాకు బాబా ఆంటే ఇష్టమే కానీ,నాంపల్లి బాబా కూడా బాబా అవతారమే అట.బాబా అయిదవ అవతరమైతే నాంపల్లి బాబా ఆరవ అవతారమట.

బాబా ఐన కర్మలని లేట్ గా తొలిగిస్తారట కానీ,నాంపల్లి బాబా చాల తొందరగా తెసివేస్తారట.బాబా అయిదు సంవత్సరాలలో తీసివేసేది నాంపల్లి బాబా ఒక సంవత్సరం లోనే తెసివేస్తారట.కానీ తాను బాబా లాగా సాఫ్ట్ కాదట.నాంపల్లి బాబా కీ భక్తులుగా అవడం అంతే చాల కష్టం అట.చాల కొద్దిమంది మాత్రమే తన భక్తులు అవగలరట.అంది.ఆలా ఐతే నాకెందుకులే నేను రాను అని చెప్పాను.తరువాత వాళ్ళు వెళ్లి వచ్చారు.

ఒకరోజు టెంపుల్ స్టెప్స్ దిగుతుంటే ఒకతను కొన్ని బుక్స్ తీసుకుని వచ్చి నన్ను బుక్స్ తీసుకోమన్నాడు.చుస్తే అది నాంపల్లి బాబా జీవిత చరిత్ర.

నాకు వీళ్ళందరూ చెప్పినవి గుర్తొచ్చింది.ఆలోచిస్తుంటే తాను బుక్ తీసుకోండి అన్నాడు.ఒక మహాత్ముని బుక్ ఆలా ఎదురుగా వచ్చి తీసుకోమని చెపుతుంటే తీసుకోకుండా ఉండడం ఎందుకులే అని తీసుకున్నాను.

ఈవెనింగ్ చదువుదాం అనుకుని బుక్ ఓపెన్ చేశా కానీ,చాల ఏడుపు వస్తుంది.అంతకుముందు చెప్పిన వాళ్ళ మాటలు గుర్తొచ్చి.అసలు నేను ఈ బుక్ ఎందుకు తీసుకున్నాను.ఎందుకు చదువుదాం అనుకుంటున్నాను.నేనేమైన తెలియకుండా వాళ్ళ మాటలకు ప్రబావితమయ్యాన ఏంటి? నాకు తెలియకుండా నేను కూడా వాళ్ళ లాగా నాంపల్లి బాబా బుక్ పారాయణ చేసి తొందర కర్మలు తొలిగించుకోవాలనుకుంటున్నానా ?ఇన్ని డౌట్స్.నాకు ఒకటే ఏడుపు.

నాకు తెలియకుండానే నేను చాల సేపు ఆలా ఏడిచేసా.నాంపల్లి బాబా నా కర్మలు ఒక సంవత్సరం లో తీసేసిన నాకు అవసరం లేదు.అదే కర్మలు బాబా నాకు అయిదు,ఏడు సంవత్సరాలవరకు తీసేయకున్న ,నాకు కష్టం ఉన్నసరే నాకు బాబా నే కావాలి కానీ,బాబా కాకుండా ఇంకెవరు ఇంకెంత మంచి చేసిన నాకు ఎవరు వద్దు అని బాబా ఫోటో ముందు కూర్చొని బాగా ఏడుస్తున్నా.

ఆలా ఏడుస్తున్నా టైం లో అనిపించింది.ఇప్పుడు ఏమైంది.నిన్నెవరైనా బలవంత పెట్టారా నాంపల్లి బాబా దగ్గరికి వెళ్లుమని లేదు కదా.జస్ట్ బుక్ చదవడానికి ఇంత ఏడుస్తున్నావు.బుక్ చదవాలనిపిస్తే చదువు లేదంటే లేదు కానీ ఇలా ఎవరో కొట్టినట్టు ఏడవటం ఏంటి అని.ఐన కన్నీరు ఆగడం లేదు.ఒక మహాత్ముని బుక్ చదువుతా అని తీసుకున్నాక చదవకుంటే తప్పు ఆలా అని చదివితే వాళ్లలాగే నేను కూడా నెమో అని.

ఆలా ఒక గంట తరువాత సరే బుక్ ని తొందర తొందర చదివి పక్కన పెట్టేద్దాం అనుకుని నెక్స్ట్ డే మొత్తం చదివేసి పక్కన పెట్టి హమ్మయ్య అనుకున్నా.ఆలోచిస్తే స్టార్టింగ్ లో బాబాని వద్దు అని అంతలా తిట్టుకున్నా దాన్ని ఇప్పుడు బాబా తప్ప ఇంకొకరిని పూజించడం పక్కన పెడితే అసలు వేరొకరి బుక్ చదవాలంటేనే ఏడిచేసే స్టేజి కీ వచ్చేసా.

నాకు కష్టమైన,నష్టమైనా ఇష్టమైనా కూడా అది బాబానే అయి ఉండాలి, కానీ వేరొకరు కాదు. అన్నంతగా అయిపోయా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నాకు కష్టమైన,నష్టమైనా ఇష్టమైనా కూడా అది బాబానే అయి ఉండాలి, కానీ వేరొకరు కాదు

Sreenivas

మంచి సంకల్పం…బాబా మీద మీకు ఉన్న ఇష్టానికి అభినందనలు…సాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్….సాయి బాబా …సాయి బాబా …సాయి బాబా

prathibha sainathuni

thank u srinivas garu..saibaba saibaba saibaba..

Sai Suresh

సూపర్ సాయి మీ అనుభవం. మీ వర్ణన చాలా బాగుంది. బాబా పట్ల మీ స్వచ్చమైన ప్రేమ, దృఢ విశ్వాసం చాల అద్భుతం సాయి

prathibha sainathuni

thank u suresh garu… saibaba saibaba saibaba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles