Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
ఓం సాయి రామ్ నా పేరు మేడా లక్ష్మి ప్రసన్న,హైదరాబాద్.
బాబా గారు నా అనారోగ్య సమస్యని స్వయంగా బాగుచేసిన లీల మీతో పంచుకునేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
ఒక ఆరు నెలల కిందట నేను తీవ్రంగా అనారోగ్యనికి గురి అయ్యాను.
ఏంటో తెలియదు ఒళ్ళు మొత్తం వాపులు, నొప్పులు, అక్కడక్కడ గడ్డలు, ముఖ్యముగా వీపుకు నిమ్మకాయ పరిమాణంలో గడ్డలు మరియు కడుపులో బాద ఏమి తినలేను, నిద్రలేదు మొత్తంగా మంచం పట్టాను.
నేను నా ఇద్దరు చిన్న పిల్లలు, మా వారు, అంతా మా అమ్మ మీద పడ్డట్టుగా అయ్యింది.
పాపం మా అమ్మకి కూడా ఆరోగ్యం బాగోలేక ఉన్నారు, కిడ్నీ లో రాళ్ళూ, మోకాళ్ళ నొప్పులు తో బాధ పడుతున్నారు ఆమె వయస్సు పెద్దది.
ఇవి అన్ని చూడలేక నాకు మానసిక బాద కూడా పెరిగింది.
డాక్టర్ ని కలిసాము ఉపయోగం లేదు అన్ని రకాల పరీక్షలు చేసారు అన్ని మాములుగానే ఉన్నాయ్.
నా పరిస్థితి మాత్రం బాగాలేదు.
పది రోజులు సైతం తిండి, నిద్ర లేదు ఇంత వరకు బాబాని నేను అడగలేదు ఎందుకు అంటే బాబా ని అడగవలసినవి వేరే ఉంటాయి ఇది నా కర్మ నేను అనుభవించాలి బాబాకి చెప్తే మన కర్మలు ఆయన తీసుకుంటారు అని ఓపికగా ఉన్నాను.
కానీ భరించలేని నొప్పులు, కడుపులో బాద, వీపు మీద గడ్డలతో పడుకోలేక ఇంక బాబాని వేడుకున్న, భరించు అన్నారు మళ్ళీ ఒక వారం రోజుల పాటు బాధ పడ్డాను.
ఇక నా బాధ చూడలేక మావారు అన్నారు డాక్టర్ కి అర్ధం కాలేదు, తగ్గడంలేదు ఇలా అయితే ఎలా ఇక షిర్డీబయలుదేరుదాము ఆయనే చూసుకుంటారు అని అన్నారు.
కానీ నేను ఉన్న పరిస్థితి లో కదలలేను నన్ను తీసుకొని ఎలా వెళ్తారు అన్నాను కొంత వాదన తరువాత నన్ను ఒప్పించి తీసుకొని వేళ్ళారు.
బాబా మీద భారం వేసి ఉన్నాను.
నాగర్సోల్ నుండి వాన్ వెక్కాము ఆ వాన్ చెడిపోఇంది.
చూసారా నా పరిస్థితి అసలే బాగాలేదు ఓపిక లేదు అంటే ఇంకా సమయం పడుతుంది.
చివరకు పశువుల పాక లో పడుకున్న వెళ్లి అంత ఓపికలేదు నాకు.
తరువాత వ్యాన్ బాగా చేసారు షిర్డీచేరుకున్నాము వ్యాన్ దిగాను అంతే కాషాయo కలర్ బట్టలు వేసుకున్న అతను నా దగ్గరకు వచ్చారు.
ఆయన్నిచూడగానే నా మనసుకు అర్ధం అయ్యింది బాబా వచ్చారు అని అంటే నా మనసుకు చెప్పలేని ఆనందం కలిగింది ఎదో తెలియని అనుభూతి ఇక ఈ జీవితానికి ఇది చాలు అనే విధముగా ఉంది.
అయన నా వీపు అంతా నిమిరారు కొద్ది నిమిషాలు నాతో మాట్లాడుతున్నారు నిమురుతున్నారు రెండు ఒకేసారి జరుగుతున్నాయి.
ఈమె నన్ను ప్రేమతో నా కాళ్ళు కట్టేసింది నన్ను ఎటూ పోనివ్వడంలేదు అని, నా పక్కన ఉన్నవాళ్ళకి చెప్పారు.
ఈమె చిన్న పాప నాకు చాల జన్మల నుంచి తెలుసు అని అన్నారు, నన్ను నువ్వు కొట్టావ్ చూడు ఎంత దెబ్బతగిలిందో అని తన నుదురు మీద ఒక ప్లాస్టర్ వేసుకొని ఉన్నారు అది చూపించారు.
అయ్యో బాబా నేను మిమ్మల్ని కొట్టడమా లేదు బాబా అన్నాను కాదు నువ్వ్వే కొట్టావ్ అని అన్నారు.
నేను క్షమాపణచెప్పుకున్నాను. హా అని ఆ ప్లాస్టర్ తెసివేసారు అక్కడ ఏగాయము నాకు కనిపించలేదు, నాకు చెప్పులు కావాలి అని అడిగారు నేను కొనను అన్నాను ఎందుకు అంటే కొద్ది రోజులుగా నాకు బాబాకి మద్య చెప్పుల గొడవ నడుస్తుంది అది మా ఫ్రెండ్స్ కి మా ఇంట్లో వాళ్ళకి అందరికి తెలుసు సమయం వచ్చినపుడు ఆ విషయాలు కూడా పంచుతాను.
ఇక బాబా వెళ్లి జామకాయలు రెండు కొన్నారు వాటిని ఏంతో ప్రేమతో ముద్దులు ఆడారు ఆ జామకయని నాకు ఇచ్చిఇది నువ్వు తిను అన్నారు చాలా రోజుల తరువాత కడుపునిండుగా అనిపించింది తిన్నాను.
ఇంకోటి నా పక్కన ఉన్న ఆమె కి ఇచ్చారు .
ఇంక బాబా వెళ్లారు నేను ఆలోచిస్తున్న బాబా ని ఎప్పుడు కొట్టాను అని, అప్పుడు తట్టింది మనసుకు మా పెద్ద బాబు సాయి హేమల్ ని మూడు రోజుల కిందట కొట్టాను ఆ విసురులో మా ఇంట్లో ఉన్న ఊయల వెళ్లి వాడి నుదురు మీద తగిలింది.
ఆ దెబ్బ బాబా కి తగిలింది అయ్యోసాయినాథ్ అనుకున్న ఎప్పుడు మా బాబు ని కొట్టినా బాబా వారు నన్ను కొట్టావ్ అని అడిగిన సందర్బాలు చాల ఉన్నాయి.
కానీ ఏమిచేయను వాడి అల్లరి అలా ఉంటుంది.
బాబు నా కడుపులో ఉన్నపుడే బాబా చెప్పారు నేనే ఉన్నది అని, ఎప్పుడు, ఏ రోజు పుడతాడో కూడా చెప్పారు బాబా. అదే రోజు పుట్టారు.
ఇలా అన్ని గుర్తు చేసుకున్నాను. తరువాత చుస్తే నా గడ్డలు లేవు నిజంగా నిజం ఇది. నా నీరసం లేదు బాబాగారి చేతి స్పర్శ నన్ను రోగ విముక్తురాలిని చేసింది.
చేయి పెట్టి నా వీపు నేను నిమురుకున్న ఏవి నా గడ్డలు లేవు నేను చేతులు వెనక్కి ముందికి బాగా తీసుకుంటున్నా అప్పుడు నా ఆనందానికి ఎల్లలు, అవధులు హద్దులు, ఏమి లేవు.
నిజంగా నా వయసుకు రావలసిన బాద కాదు అది. ఈవిధముగా నా ఆరోగ్యం బాగుచేసారు బాబా గారు .
ఈవిధముగా వెంట ఉండి కాపాడే బాబా కి మనం ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలం.
సదా బాబా సేవలో ఉంటూ ప్రాపంచిక విషయాలకు ఆకర్షితులు కాకుండా బాబా లీలనే చెప్పుకుంటూ , నామస్మరణ చేస్తూ ఆయన చరణాలలో ఐక్యం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నా.
ప్రేమ నేర్పించిన బాబా కే ప్రేమతో బాబా సేవకుకురాలు లక్ష్మీ ప్రసన్న.
ఓం సాయి రామ్ .
సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను.
Latest Miracles:
- బాబా గారు నా అనారోగ్య సమస్యని స్వయంగా బాగుచేసిన లీల
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- బాబా నా ఆరోగ్యాన్ని సరి చేసిన లీల అద్భుతం అనిర్వచనీయం.–12
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా గారు నా అనారోగ్య సమస్యని స్వయంగా బాగుచేసిన లీల”
Maruthi Sainathuni
April 12, 2018 at 5:20 amSai Baba…Sai Baba…Sai Baba