నీవు ఇంకొంత కాలం బతుకుతావు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

భక్తుడు: శ్రీనివాస మూర్తి

నివాసం: హైదరాబాద్

నా పేరు శ్రీనివాస మూర్తి. ఇంట్లో నన్ను చిన్నప్పటి నుండి గారాబంగా పెంచారు.

ఇంట్లో అమ్మ, అన్నయ్యలు మంచి  దైవ భక్తులు.

“గురు చరిత్ర పారాయణ”, వివిధ దేవత “అష్టోత్తర నామాలు” వారికి నోటికి వచ్చు.

నేను మాత్రం స్నానం  చేయగానే దేవుని గదిలోకి వెళ్లి బొట్టు పెట్టుకోవడం వరకే చేసేవాడిని.

నా జీవితంలో భగవంతుని మీద ఆసక్తి 1999 సం.లో కలిగింది. నేను రాంచి (జార్ఖండ్ స్టేట్  లో  MBA లో చేరాను) సరిగ్గా ఒకటిన్నర నెలలలో అంటే మే లో హాలిడేస్ కి ఇంటికి వచ్చా.

బాగా సిక్ (sick) అయి వచ్చా. కానీ దాని గురించి అంతగా పట్టించుకోలేదు.

ఒక నెల తరువాత మరల రాంచికి వెళ్ళాను. అక్కడికి వెళ్లిన తరువాత  నాకు అనారోగ్యము ఎక్కువ అయింది.

నేను ఫస్ట్ సెమిస్టరు  ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు. దసరాకి హాలీడేస్ ఇచ్చారు.

వైజాగ్ లో ఉన్న అన్నయ్య  వద్దకు వెళ్ళాను. నన్ను చూడగానే మా అన్నయ్యకు కూడా భయం వేసింది.

అప్పటి నా పరిస్థితి ఎలా ఉంది అంటే నేను చాలా నీరసంగా ఉన్నాను. చాలా సన్నబడ్డాను. ఏమైంది అని అన్నయ్య అడిగితే, నెల రోజుల నుండి సరిగా నిద్రలేదు.

భయంగా ఉంది  అని చెప్పాను. అన్నయ నన్ను వైజాగ్ లో ఉన్న సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్లారు.

అయినా నా అనారోగ్యంలో మార్పు రాలేదు.

అక్కడి నుండి ఇంటికి (గుంటూరు జిల్లా నెమలిపురి) కి వచ్చాను.

అప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి నాకు, మా కుటుంబానికి కష్టాలు.

అనారోగ్యముతో ఉన్న నన్ను చూసి ఊరి వారందరు మా కుటుంబంతో మాట్లాడడం మానివేశారు.

ఒకరకంగా ఆ ఊరిలో మమ్ములను వెలివేసారు. ఒక్క మా పెద్దమ్మ (పద్మావతి) కుటుంబం తప్ప మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు.

ఆ సమయములో మా కజిన్స్ కొందరు అయ్యప్ప మాల వేసుకున్నారు. వారు మా ఊరి పక్కనే ఉన్న స్వయంభువెంకటేశ్వర స్వామిఆలయంనకు నిద్రకు వెళుతూ, నాకు ఇష్టం లేకున్నా బలవంతంగా వాళ్లతో పాటు నన్ను తీసుకువెళ్లారు.

ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాతి మీద వెలిశారు. అయన ముందు ఉన్న గుంటలో నెయ్యి పోస్తే అయన నేతిలో మత్స (చేప) అవతారంలో కనిపిస్తారు.

ఎప్పటిలాగే ఆరోజు కూడా నిద్ర పట్టలేదు.

ఒక్క అయిదు నిముషాలు మాత్రం మగతగా నిద్ర పట్టింది.

అప్పుడు కలలో నాకు “షిరిడి సాయిబాబా” స్వయంభు వేంకటేశ్వరస్వామి రాతిలో  నుండి చేయి చాచి నా తలపై పెట్టబోతు ఉన్నారు.

నేనేమో వద్దు బాబా నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ వెనక్కి జరుగుతున్నాను.

ఆ సమయంలో నా ఉద్దేశ్యము నేను చనిపోవాలని, బాబా నా తలపై చేయి వేస్తె బతుకుతానని నా భయము.

నేను బతకకూడదని వెనక్కి వెనక్కి వెళుతుంటే బాబా వారు తన చేతిని కూడా చాలా బారుకి చాచి నా నెత్తి మీద చేయి వేసి నీవు ఇంకొంతకాలము బతుకుతావు, అని ఆశీర్వదించారు.

తరువాత కొద్దిరోజులకే నా ఆరోగ్యము కుదుటపడడము, ఊర్లో జనములో కూడా మార్పు రావడము జరిగింది.

అప్పుడు “నేను బాబాకి ఏమి చేశాను, బాబా వారు నన్ను బ్లెస్స్ (Bless) చేయడానికి” అని ఆలోచిస్తే గుర్తు వచ్చింది.

అంతకు ముందు సంవత్సరం నేను, మా కజిన్స్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాము.

అంతకు ముందు ఎప్పుడు శబరిమలై యాత్ర చేసేటప్పుడు సౌతిండియన్ తీర్థ యాత్రలు చేసుకుంటూ వెళ్లడం మా ఊరిలో సాంప్రదాయం.

కానీ నేను, మా కజిన్స్ పట్టుబట్టి ఫస్ట్ శిరిడీ చూడాలి. ఆ తరువాత ఏదైనా అన్నాము.

దాంతో మా యాత్రలో ఫస్ట్ శిరిడీ చేర్చారు.

నేను టికెట్స్ డబ్బులు కాకుండా రెండు వేలు ఖర్చులకు అని తీసుకుని వెళ్ళాను.

నేను అప్పుడు “నా హాఫ్ అమౌంట్ అంటే వేయి రూపాయలు ఇక్కడే ఖర్చు పెట్టాలి.

మిగిలినది తరువాత యాత్రలకని” అనుకున్నాను.

అనుకున్నట్లుగానే వేయి రూపాయలు శిరిడీలో ఖర్చు పెట్టి, మిగిలినవి మిగితా యాత్రలలో ఖర్చుపెట్టాను.

తిరుపతి చూసుకుని ఇంటికి వస్తున్నాము. నేను మరల బస్సు కాంట్రాక్టర్ (గురుస్వామి) ని మరల పట్టు బట్టాను.

ఏమని అంటే రిటర్న్ లో ఒంగోలు సాయిబాబా టెంపుల్ చూడాలని, అతను తన దగ్గర డబ్బులు లేవని, పార్కింగ్ కి నువ్వే ఇవ్వాలని నన్ను అన్నాడు.

నేను సరే అన్నాను. అప్పటికి సరిగ్గా నా జేబులో యాభై రూపాయలే ఉన్నాయి.

నేను ఆ యాభై ఆయనకు ఇచ్చాను. ఆరోజు గురువారం అందరం లాయరుపేటలో  భరద్వాజ్ మాస్టర్ గారు కట్టించిన సాయిబాబా టెంపుల్ చూసి ఇంటికి వచ్చాము. 

మా శబరిమలై యాత్రలో మేమనుకున్న మొదటి యాత్ర శిరిడీ, చివరి యాత్ర ఒంగోలు లోని సాయిబాబా టెంపుల్.

ఏదో నేను కేవలం ఒక సామాన్య భక్తుడిగా శిరిడి వెళ్ళినా, బాబా మాత్రం ప్రేమతో నన్ను తన రక్షణ లోకి తీసుకున్నారు.

అందుకే వెంకటేశ్వర స్వామి రాతిలో దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించి, నా మనసులో చెడు ఆలోచనలను తుంచివేసి, రక్షించి నన్ను తన వాడిగా చేసుకున్నారు. అప్పటినుండి నాకు బాబా పట్ల భక్తీ, విశ్వాసాలు పెంపొందాయి. ఇప్పుడు బాబా యే నా సర్వస్వము.

~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “నీవు ఇంకొంత కాలం బతుకుతావు

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

murali

Oh great srinivasa murthi garu super, Chala manchi anubhavam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles