Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
1910సం. లో లక్ష్మణ్ బజీ అవరె అనే అతనికి రెండు కళ్ళలో నొప్పి వచ్చింది. రెండు కళ్ళ నుండి నీరు కారసాగింది. చివరికి కంటి చూపు పోయింది. నయం చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు, మందులు ఏవి పని చేయలేదు. ఆ కుటుంబానికి తెలిసిన ఒక స్నేహితుడు శిరిడి వెళ్ళమని సలహా ఇచ్చారు. బాబా దర్శనం చేసుకుంటే భాధ నయం కాగలదని చెప్పారు. ఒక గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా లక్ష్మణ్ వైపు కరుణతో చూసి “అల్లా అచ్చా కారేగా” అంటూ ఉదీ ఇచ్చారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక కళ్ళ నీరు రావడం ఆగింది, నొప్పి కూడా తగ్గింది. అప్పటినుండి ఆరు నెలల పాటు వారు ప్రతి గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.
తర్వాత ఆ గ్రామస్తులు అతని తల్లితో అతనిని బొంబాయి లో జె.జె. హాస్పిటల్ కి తీసుకోని వెళ్ళమని చెప్పారు. వారు బొంబాయి బయలుదేరిన రోజు లక్ష్మణ్ ఒళ్ళు అంత మంటలుపుట్టి భాధ కలిగింది. బ్రిటిష్ కంటి వైద్యుడు లక్ష్మణ్ ను పరీక్షించి అతని కళ్ళు బాగా చేడిపోయినవని, కంటి చూపు మరి రాదని చెప్పారు. వాళ్ళు చాలా బాధపడుతూ తిరిగి ఇల్లు చేరారు.
లక్ష్మణ్ కంటి చూపు వచ్చిన, రాకున్న షిర్డీ వెళ్ళి సాయి చెంత ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ కుటుంబమంతా షిర్డీ వచ్చి కొన్ని రోజుల పాటు షిర్డీ లో ఉన్నారు. తర్వాత అతని తల్లి, కొడుకుని బాబా చెంత విడిచి తన స్వగ్రామం వెళ్ళిపోయారు. లక్ష్మణ్ కు బాబా యందు సంపూర్ణ విశ్వాసం కలదు. ప్రతి రోజు బాబా ముఖం కడుగుకొనే నీళ్ళతో అతడు తన కళ్ళను కడుగుకునేవాడు. ఈవిధంగా ఒక నెల రోజులపాటు చేసారు. అకస్మాత్తుగా ఒకరోజు పూర్తిగా కాకుండా కొంచెం కంటి చూపు వచ్చింది. తరువాత ఒక సాయంత్రం చావడిలో బాబా దర్శనం చేసుకున్నారు. అప్పుడు బాబా లక్ష్మణ్ గుండెపై చేతితో తట్టి, “ఇతనికి మళ్ళి కంటి చూపు ప్రుర్తిగా వస్తుంది. ఇకపై అంత స్పష్టంగా చూడగలడు” అన్నారు. మరుక్షణమే లక్ష్మణ్ కు చూపు వచ్చింది. బాబా చేసిన మేలుకు లక్ష్మణ్ కృతజ్ఞత బావంతో పరవశించిపోయారు. రాధాకృష్ణ మాయి లక్ష్మణ్ ను బావి నుండి నీరు తెమ్మని చెప్పేవారు. మరి కొన్ని సేవలు కూడా ఆమె అతనికి చెప్పేది. లక్ష్మణ్ తనకు కంటి చూపును తిరిగి ఇచ్చిన సాయి పై కృతజ్ఞత బావంతో ఆ సేవలను సంతోషం తో చేస్తుండేవాడు. బాబా సమాధి చెందే వరకు షిర్డీ లోనే ఉండిపోయారు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- కాకా దీక్షిత్, లక్ష్మణ్ భట్–Audio
- బాబా నిర్ణయించిన మొత్తమే ముట్టింది(దీక్షిత్, లక్ష్మణ్ భట్)–Audio
- కలుషితం కాదు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 23
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 9వ. అధ్యాయము–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments