మరణాన్ని శాసించిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!

నా పేరు నేల్లురుపల్లి సుమన్. నాకు 15-7-2010న యాక్సిడెంట్ అయింది. ఆ రోజు గురువారం. నేను ఇంకొకతను ఉదయం 7 గంటలకు కోటలో బాబాకు అభిషేకం సేసుకొని ఆరతి ఇచ్చుకొని ఉదయం నెల్లూరుకు బండిమీద పని మీద వెళ్ళి తిరిగి మధ్యాహ్నం 1-30 గంటలకు  వచ్చుచుండగా మనుబోలు మధ్యలో కారు గుద్దింది. అతనేమో ముందు కూర్చున్నాడు. నేను వెనుక కూర్చున్నాను. కారు వెనుకనుంచి గుద్దింది. వెనుక నుంచి గుద్దినప్పుదు నేను చనిపోవలసిందిపోయి అతను అక్కడికక్కడే చనిపోయాడు. నాకు మోకాలు క్రింది భాగం విరిగింది. బాగా దెబ్బలు తగిలాయి.నెల్లూరు జయాభారత్ హాస్పిటల్ లో కాలు ఆపరేషన్ చేశారు.నాకు ప్రాణదానం చేసిన బాబా, గురూజీలకు నా సాష్టాంగ ప్రణామములు తెలుపుకుంటున్నాను

యాక్సిడెంట్ అయిన రెండోరోజు అనగా 16వ తేది ఆపరేషన్ చేశారు, చేసిన రెండోరోజు డాక్టరుగారు వచ్చి కాలు కదిలించమన్నాడు. కాలు అస్సలు కదలించలేక పోయాను. మా అమ్మ రోజూ సాయిచరిత్ర పారాయణ చేస్తుంది.హాస్పిటల్లో కూడా నా మంచం దగ్గర కూర్చొని పెద్దగా చేసింది. అది వింటూ నీద్రలోకి జారాను.అప్పుడు కలలో ఎవరో ఒకతను తెల్లగుడ్డలు ధరించి వున్నాడు. నా కాలు పట్టుకొని కదిలించసాగాడు. నేను ఎవరు నువ్వు? నా కాలు పట్టుకొని ఎందుకు లాగుతున్నావు? నాకాలు దగ్గరలే, అని పెద్దగా పైకి అరవసాగాను.
అంటే విచిత్రంగా కాలు కదిలింది. అప్పటి నుంచి కాలు నేనే స్వయంగా కదిలించసాగాను. డాక్టరుకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది.అప్పుడు అనిపించింది బాబానే నాకాలు కదిలించారని మంచం చుట్టు తిరిగి తర్వాత కనపడలేదు. అప్పటినుంచి బాబా రోజూ నా మంచం చూట్టూ తిరుగుతూ కనిపిస్తూనే వున్నారు.ఇప్పుడు మిద్దె మెట్లు దిగి బాగా నడుచుచున్నాను.నాకు అంగవైకల్యం లేకుండా నాకు కాలును ప్రసాదించినా బాబాకు నేను ఎంతో ఋణపడి వుంటాను.

సుమన్
కోట, నెల్లూరు (జిల్లా)

సంపాదకీయం: సద్గురులీల ( అక్టోబర్  – 2010 )
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles