Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
బాబా నాకు ప్రసాదించిన అనుభవము మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందముగా ఉంది.
నా పేరు పట్నం మునుస్వామి. మా నివాసము నెల్లూరు, వేదాయపాలెం, వయసు 52 సంవత్సరాలు.
2009 సంవత్సరములో నాకు కాలు, చెయ్యి, నోరు పడిపోయినాయి.
డాక్టర్లు పక్షవాతముగా నిర్దారించారు.
రెక్కాడితే గని డొక్కాడని కుటంబము మాది.
నేను ఆటో డ్రైవర్ని, నేను డాక్టర్కి చూపించినప్పుడు వారు నీకు 50 సంవత్సరములు దాటినది కాబట్టి కాలు, చేయి, నోరు రావడం కుదరదు అని అన్నారు.
నయమైన కొంచెం నయం కావలిసిందే కానీ పూర్తిగా నయం కాదు .
నీవు ఆటో డ్రైవింగ్ చేయడం కుదరదు అన్నారు.
మంచం మీద నుండి నా భార్య నన్ను లేపితే లేచి కఱ్ఱపట్టుకొని నిలబడి ఆమెను పట్టుకొని వాకిట్లో అరుగుదాకా వచ్చి అరుగుమీద పడుకొనేవాడిని.
ఒకరోజు ఇంటిముందుగల అరుగుమీద పడుకొని ఉన్నాను.
ఆరోజు గురువారం, బాబాను చిన్నబండిలో పెట్టుకొని ఒక ఆయన వచ్చి దక్షిణ అడిగినాడు.
నా భార్య ఇంటిలోనుండి బియ్యము తీసుకొని వచ్చి అయన పాత్రలో వేసింది.
అప్పుడు నేను బాబాతో బాబా పెళ్ళికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉంది.
నేను చుస్తే లేవలేని పరిస్థితి. ఇల్లు జరగకుండా కష్టముగా ఉంది.
నాకు ఏమో ఈపరిస్థితులలో చనిపోవాలి అని ఉంది.
మీరే దిక్కు అని నమస్కారము చేసుకొన్నాను.
ప్రక్కరోజు చేయిలో కొద్దిగా కదలిక వచ్చింది.
రోజు రోజుకి కాలు చెయ్య, నోరులో మార్పు వస్తున్నది.
40 రోజులకి పూర్తిగా ఆరోగ్యము కలిగినది.
మాములుగా మనిషి లా తయారయ్యాను .
40 రోజులగా దుమ్ముపట్టిన ఆటో తీసి “బాబా” కృపతో నడపకలిగాను.
కొంతకాలానికి మా అమ్మాయికి పైసా నా దగ్గర లేకపోయినా బాబా కృపతో బంధువుల సహాయసహకారములతో పెండ్లి చేయకలిగాను.
నా ఆరోగ్యం బాగయినప్పటినుంచి బాబాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అలవాటుఅయింది.
నేను షిర్డీ కి పోగలనా? అనుకున్నాను.
అటువంటిది బాబా కృపతో షిర్డీకి పోయి బాబాని దర్శించుకుని వచ్చాను.
వేదాయపాలెం, అయ్యప్ప గుడి ఎదురుగా ఉండే బాబా గుడిలో ప్రతి గురువారం అన్న ప్రసాద వినియోగంలో ఉదయము నుంచి మధ్యాహ్నము వరకు అక్కడే ఉండి బాబా సేవ చేసుకుంటున్నాను.
గతము కన్నా ఎప్పుడు ఎంతో మనస్సంతి గా ఉన్నాను.
బాబా చేసిన మేలు జీవితాంతము మరిచి పోలేను.
బాబాకి ఏమి చేసిన అయన ఋణం తీర్చుకోలేను.
అయన నాకు పునర్జన్మను ప్రసాదించి, నా కుమార్తెకు వివాహము చేయించి నాకు షిర్డీ దర్సనమును ప్రసాదించిన బాబాకి కృతజ్ఞతా పూర్వక సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం
- శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
- బాబా వారి సేవ చేసిన భక్తురాలి కుమార్తెకు సాయినాథుని దయతో బ్యాంకు జాబ్ వచ్చుట.
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- మా మీద దయతో మా కుటుంబ సభ్యునిగా మారిన బాబా వారు ……!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా దయతో పక్షవాతము నయమైంది.”
Maruthi
September 8, 2017 at 1:43 amSai Baba…Sai Baba
Madhavi
September 8, 2017 at 7:15 amSarvam sainaatharpanamastu?.Bhale vundhi.