బాబా వచ్చి అక్షింతలు చల్లి త్రిశూలం ని గీయమని చెపుతాడు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

దుని దగ్గర దీపాలు వెలిగిద్దాము అనుకున్నాను కదా.నేను ఒక్కదాన్నే కాకుండా అయన భక్తులందరం కలిసి వెలిగిస్తే అయన హ్యాపీ గా ఫీల్ అవుతారు కదా అని.టెంపుల్ కి వచ్చే మా ఫ్రెండ్స్ ని నాకు తెలిసిన వాళ్ళందరిని పిలిచాను.అందరం కలిసి దీపాలు వెలిగించాము.

అక్కడ మొత్తం దీపాలతో వెలిగిపోతున్నాడు బాబా. రజని అక్క వచ్చింది అనుకోకుండా సాయిబాబా సాయిబాబా నామం కూడా చెప్పుకున్నాము హ్యాపీ గా హాస్టల్ కి వచ్చాను.
నేను నిద్రపోయాను.కలలో,నేను వెల్లికిలా పడుకున్నాను నా వీపు కి కుడి వైపు గురువుగారి కాలు ఉంది మొత్తం బుజం నుండి నడుము వరకు.అంటే గురువుగారి కాలిపై నేను పడుకున్నాను అన్నమాట.వైట్ పంచ కనిపిస్తుంది.నాకు ఆర్డమవుతుంది అది గురువుగారు అని.మెల్లి మెల్లిగా ఆ కాలు నాకు బరువనిపిస్తుంది.నొప్పిగా ఉంది.

ఐన కూడా నేను భరించగలుగుతున్నాను.గురువుగారు ఉన్నారు కాబట్టి ఇంత నొప్పిని కూడా, తక్కువ బాధతో భరించగలుగుతున్నాను .లేకుంటే అంత నొప్పిని భరించలేకపోయేదాన్ని అని అనుకుంటున్నాను.

తరువాత,లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చింది.గురువుగారు నా కర్మలను ఆలా తొలిగిస్తున్నారు అని అనుకుంటున్నాను.తరువాత గురువుగారు కాళ్ళు కడుక్కోవడానికి టాప్ ఆన్ చేసారు.నేను గురువు గారు వచ్చాక గురువుగారికి పాద నమస్కారం చేసుకుందాము అనుకుంటున్నాను.

టాప్ సౌండ్ వినిపిస్తూనే ఉంది గురువుగారు ఇంకా రావట్లేదు నేను ఇంకా రావట్లేదు ఏంటి గురువుగారు, అని బలవంతంగా కళ్ళు తెరిచి చూసాను.కొంత సేపటి వరకు అర్ధం కాలేదు అది కల అని.ఆ టాప్ సౌండ్ ఇంకా వినిపిస్తున్నట్టే ఉంది.కల అని నమ్మలేనంతగా ఉంది.రియల్ గా గురువుగారే వచ్చారు అనిపించింది.

నాకు బాబా రాకుండా ఈయనెందుకు ఇలా వస్తున్నారు.నేను వద్దంటున్న కూడా నా దగ్గరికెందుకు రావాలి.అని కోపంగా, ఎలా వచ్చాడు అసలు అనుకుని పక్కన విండో కర్టెన్ ని కోపంగా మూసివేసా ఈ విండోలో నుండే వచ్చి ఉంటారు .ఈ విండో మూసివేసాక ఎలా వస్తాడో చూస్తా అని.

అప్పుడు సడన్ గా మేఘుడు గుర్తొచ్చాడు.మేఘుడు కూడా ఇలాగె ఒకసారి పడుకుని ఉన్నప్పుడు బాబా వచ్చి అక్షింతలు చల్లి త్రిశూలం ని గీయమని చెపుతాడు.అది కల అనుకుని మేఘుడు అనుకుంటే,అది కల కాదు నేనే స్వయంగా వచ్చాను. నేను ఎలా అయినా రాగలను,నాకు వాకిలి అవసరం లేదు అని అంటాడు. అది గుర్తుకువచ్చింది.

మహాత్ములు ఎలాగైనా రాగలరు .మళ్ళీ వస్తాడా? ఈసారి డైరెక్ట్ గా రియల్ గానే వస్తే ఎలా ? అని మళ్ళీ బయమేసింది.నిద్రపోయా.

ఉదయం రాత్రి జరిగింది గుర్తొచ్చి,అయన ప్లేస్ లో బాబా వస్తే ఇప్పటికి యెంత హ్యాపీ గా ఫీల్ అయ్యేదానిని.గురువుగారు రియల్ గానే వచ్చినట్టు నాకు ఆ అనుభూతి ఇంకా అనిపిస్తుంది.తాను రియల్ గానే మహాత్ముడే కానీ,నాకు అవసరం లేదు .కానీ ఈ మధ్య ఊరికే వస్తున్నాడు అనుకున్నా .

నైట్ కోపంగా ఆలా కర్టెన్ వేయడం గుర్తొచ్చి బాధనిపించింది.ఒక మహాత్ముడు వస్తే నేను రాకు, వెళ్ళు అని వెళ్లగొట్టి అవమానించినట్టు అనిపించింది.

నేను ఏంటి ఇలా చేశాను.మాములు మానవులనే ఆలా అంటే బాబా కి నచ్చదు. అలాంటిది ఒక మహాత్ముడి తో ఆలా కోపంగా ప్రవర్తిస్తే బాబా ఏం అనుకుంటారు?మరి నేనేం చేయాలి నాకు బాబా తప్ప ఇంకెవరు వద్దంటే ఈయనేమో పదే పదే ఇలా వస్తున్నాడు.

పైగా మెలుకువ వచ్చాక తిట్టుకుంటున్నా కానీ కలలో మాత్రం తనని గురువుగారు అని అనుకోవడం,పాద నమస్కారం చేసుకోవాలి అని అనుకోవడం గుర్తొచ్చి, ఆమ్మో నేనేంటి కలలో ఆలా అనుకున్నాను.నన్ను బాబాని దూరం చేయాలనుకుంటున్నాడేమో అనిపించింది.

అయినా బాబా కి నా మనసు తెలియదా.నన్ను తప్పుగా అనుకోడులే అనుకుని.బాబా ప్లీజ్ శరత్ బాబూజీ గారు మళ్ళీ నా కలలో రాకుండా మీరే చూసుకోవాలి.మీరు కాకుండా తాను వస్తే నాకు కోపం వస్తుంది. కోపం లో ఏవేవో తిట్టుకుంటున్నాను.సారీ బాబా కానీ తాను రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అనుకున్నాను.ఎంతైనా శరత్ బాబూజీ గారు మహాత్ములు,నేను తనపై అంత కోపం పెంచుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా వచ్చి అక్షింతలు చల్లి త్రిశూలం ని గీయమని చెపుతాడు.

Sai Suresh

sairam sairam

prathibha sainathuni

సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా ….

సాయినాథుని ప్రణతి

So nice experience prathiba garu. Meru guruvu garini samadhi chandaka mundu chusara . mi experience chaduvutu nanu na pata smurutu lani gurtutachukuntunanu. నా recent గా జరిగిన ఒక అనుభవం ఒకరోజు మావారికి మద్యనం పడుకొని వునపుడు గురువుగారు కలలో దర్శనం ఇచ్చరట .అది అసలు కళ లాగె అనిపించలేదట real గా వచారా గురువుగారు సమాది చెందారుగా ఇదెంటి అనుకునారట టచ్చ చేసి చుసారట నిజంగా గురువుగారే ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని ముదుపెటుకునారట .ఎంతో ఆనందంగా అనిపించింది .నాతో చెపారు మావారు గురువుగారు మా ఇంటికి వచారని ఎంతో ఆనందంగా అనిపించింది.ఆయన రాకతో మా ఇల్లు మా మనస్సులు పావనం చేసారు. ఆయన ఇచ్చిన బరోసా ఎంతో ఆనందాని కలిగిస్తుంది.

prathibha sainathuni

లేదు ప్రణతి గారు,.2013 మధ్యలో,నుండే గురువుగారు పరిచయం.సమాధి చెందక ముందు అసలు గురువుగారెవరో కూడా తెలియదు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles