Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
నా పేరు మహేశ్వరీ , మా నివాసము విద్యానగర్, నెల్లూరు జిల్లా.2010వ సంవత్సరంలో మార్చి లేదా ఏప్రియల్ లోనో మా ఇంటి ప్రక్కన సాయి బాబా వారి భజన పెట్టుకున్నారు. నేను భజనకు పోతూ టెంకాయ, కర్పూరము తీసుకొనిపోయినాను. రెండు అరటిపళ్ళు మాత్రం మరచిపోయాను. భజనలో వున్నంతసేపు అరటిపళ్ళు మరచిపోయానే అని బాధ పడుతుండినాను . ఇంటికి వచ్చిన తరువాత అరటిపళ్ళు తిందమనుకోగానే అయ్యో బాబా కోసం తీసుకున్నాము కదా అని గుర్తువచ్చి బాబాను క్షమించమని అడిగి తినకుండా అట్లే ఉంచినాను. మరుసటిరోజు గురువారం ఆరోజు మధ్యాహ్నం మా ఇంటి గుమ్మము ముందు 70 లేదా 80 సంవత్సరాలు ఉండే సాధువు కాషాయ వస్త్రాలు కట్టుకొని నిలబడి వున్నారు. అప్పుడు సరిగా మధ్యాహ్న హారతి సమయము. ఇంట్లోకి వచ్చేదా అని అడిగినారు. ఆయన్ని ఇంట్లోకి పిలవమని మా వారికి చెప్పినాను. భోజన సమయం కదా, భోజనం చేయండి స్వామి అన్నాను. వద్దమ్మా అన్నారు. ముందురోజు భజనకు తిసుకుపోని రెండు అరిటిపళ్ళు అట్లే ఉన్నాయి కదా అని అనుకోని అవి స్వామికి ఇచ్చినాను. వారు తిన్నారు. నేను బాబా భజనకు తిసుకోనిపోని పళ్ళను బాబావారే మా ఇంటికి వచ్చి స్వయంగా తీసుకున్నట్లు నిదర్శనమైనది. శిరిడికి పోతున్నాను, దక్షిణ ఏమైనా ఇవ్వండి అని అడిగినారు. దక్షిణ సమర్పించాను. దక్షిణ తీసుకోని వెళ్ళి పోయినారు.
సాయి పాదరేణువు
మహేశ్వరీ,
విద్యానగర్, నెల్లూరు జిల్లా.
సంపాదకీయం: సద్గురులీల (జనవరి – ఫిబ్రవరి 2011)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- సద్గురు దర్శనం…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 3
- భక్తురాలి ఆపరేషన్ జరుగుతున్నంత సేపు, భయం తెలియకుండా షిరిడి దర్శనం చేయించిన బాబా వారు
- సద్గురు సాయి మందిర పునాది….. సాయి@366 ఫిబ్రవరి 21….Audio
- ఆమె ఆరోగ్యం బాగలేక మంచం పట్టింది.
- షిరిడీ తోటలోని వాటర్ ఫాల్ లో సాయి దర్శనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “భక్తురాలి ఆర్తి – సద్గురు సాయి దర్శనం!!”
B.mallesh
September 5, 2016 at 7:51 amIts really superb