సద్గురు కృపాసాగరాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై… సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై …

నా పేరు మెరువ సాంబ శివయ్య , మా నాన్న గారికి ఎన్.టి.ఆర్. కాలనీలో ప్రభుత్వం వారు ఇల్లు ఇవ్వడం జరిగింది. (6-6) డోర్ నెమరు గల ఇల్లే మా ఇల్లు. అయితే అది 2003 వ సంవత్సరంలో ఆర్దిక ఇబ్బందులవల్ల అమ్మివేయటం జరిగింది.
అయితే నేను కాశిపేటలో బాడుగకు ఉండటం జరిగింది. కాని కాలనీలోనే చిన్నప్పటి నుండి పెరగడం వాళ్ళ కాశిపేటలో ఉండలేక, కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకొని వచ్చేయడం జరిగింది. ఆ తరువాత కొద్ది నెలల తరువాత సాయిబాబా మందిరం దగ్గరలో అదే వీధిలో లాస్టు ఒక ప్లాటు కొనడం జరిగింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి సన్నద్దమైన పరిస్థితుల్లో మా అన్నదమ్ములు చిట్టచివరన ఇల్లు కట్టుకోవడానికి ఒప్పుకోలేదు. నన్ను వాదించడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అంతలాస్టు తీసుకోవడం మంచిది కాదు. అవతల రెండు మూడు ఇల్లులన్న ఉంటే బాగుంటుందని నాకు చెప్పారు. ఆ కారణంతో ఆ ప్లాటు అమ్మేయాలని నిర్ణయించు కొన్నాను. బాబా, గురుదేవుల కృపవల్ల గురు బంధువులే దానిని కొనడం జరిగింది. ఇక అప్పటి నుండి మరలా ప్లాటు కోసం నావేట ప్రారంభమైంది. కాలనీలో నాలుగైదు ప్లాట్లు బేరం చేయడం జరిగింది. కాని అత్యధికమైన ధరవల్ల దేనిని నేను కొనలేక పోయాను. అటువంటి పరిస్థితుల్లో మరలా నేను బాబా గురువుగారికి లెటరు రాసుకోవడం జరిగింది. అందులో ఈ విధంగా రాశాను. బాబా నాకు ఎన్.టి.అర్. కాలని వదలి వెళ్ళడం ఇష్టంలేదు. ఇక్కడే ఉంటూ నీ మందిరంలో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకొనే అవకాశాన్ని ప్రసాదించండి అని లెటరు రాయడం జరిగింది. ఈ లెటరు నేను మన మందిరం పడగొట్టిన తరువాత ప్రక్కన చిన్న మందిరం ఏర్పాటు చేసినప్పుడు పెట్టాను. ఆ లెటరు పెట్టినది గురువారం, అదే రోజు మురళి  నాతొ వేరే బిట్ ఒకటి మన గురుబందువుది ఉంది అయితే  అతను కొనడమే కాని అమ్మడం జరగదు. కాని గురుదేవుల దయఉంటే అసాధ్యమేది లేదు. కాబట్టి ఇంకొక లెటరు రాసిపెట్టు. బాబానే చూసుకొంటారు అని నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను రెండవ లెటరు వైకుంఠ ఏకాదశిరోజున శుక్రవారం బాబా మందిరంలో ఉంచడం జరిగింది. నేను చాలా సంవత్సరముల నుండి ఎన్.టి.ఆర్. కాలనీలో(శ్రీ రాముని) మందిరంలో భజన సభ్యుడిగా ఉన్నందువల్ల వైకుంఠ ఏకాదశిరోజున వేరే భక్తుడికి ప్రసాదం కొనేందుకు వీలులేక డబ్బులు ఇస్తే నేను ప్రసాదాన్ని కొని ఆరోజు భజన కార్యక్రమానికి ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడి నుండి నేను రాక ముందే స్థలం ఇస్తామని మా ఇంటికి మనిషిని పంపడం జరిగింది. నేను వచ్చిన తరువాత ఇంట్లో వాళ్ళు చెప్పడంతో నేను మురళి దగ్గరకు వెళ్ళడం అక్కడ కాసేపు ఆ బిట్ గురించి  చర్చజరగటం చివరకు నాకు తక్కువ ధరకే అది నాకు ఇవ్వడం జరిగింది. ఇదంతా బాబా గురుదేవుల మహిమ కాక మరొకటి లేదని నేను ప్రగాఢముగా నమ్ముతున్నాను.
గురుబంధువు,
మెరువ సాంబశివయ్య,
ఎన్.టి.ఆర్. నగర్, నెల్లూరు.
సంపాదకీయం: సద్గురులీల (జనవరి – ఫిబ్రవరి 2011)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles