బాబావారు కలలో కనిపించి ప్రసాదమిచ్చుట.—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

This Audio prepared by Mr Sri Ram

  1. బాబావారు కలలో కనిపించి ప్రసాదమిచ్చుట 2:06

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శివలంక కాంతమ్మ,ఉచ్చులూరివారిపాలెం,కోట మండలం,నెల్లూరు జిల్లా

బాబా,గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగనమస్కారములు అర్పిస్తూవారు ప్రసాదించిన అనుభవము పంచుకొంటుంటే ఎంతో ఆనందంగా ఉంది.

ఈ అనుభవము నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది.

పూజ్యులు సద్గురు దేవుల ప్రథమ ఆరాధనోత్సవాలకు శిరిడీకి పోతుంటే షకీరా(కోట)వాస్తవ్యురాలు నాకు 50 రూపాయలు బాబాకి దక్షిణగా సమర్పించమని ఇచ్చింది.

నేను ఆమె ఇచ్చిన తరువాత శిరిడీకి తీసుకొని పోయాను.డొనేషన్ కట్టే కౌంటరులో కడితే ఊదీ,ప్రసాదము ఇస్తారు అని గురుబంధువులు చెప్పారు.

నేను మరచిపోయి 50 రూపాయలు హుండీలో వేసాను.వేసేసిన తరువాత డొనేషన్ కౌంటరులో కడితే  రసీదు,ఊది,ప్రసాదము ఇస్తారు కదా అని బాధపడ్డాను.

సరేలే ఎట్లా నేను ప్రసాదమును కొన్నాను కదా దాంట్లో కొంత ప్రసాదము,నేను శిరిడీలో కలెక్ట్ చేసిన ఊదీ పొట్లాలలో  ఒకటి ఇస్తాములే అనుకున్నాను.

నేను గురూజీ ఆరాధనోత్సవాలలో పాల్గొని ఆనందంగా కోటకి వచ్చేసాను.నేను ప్రసాదము ఊదీ తీసుకొని బాబాకి దక్షిణ ఇచ్చిన షకీరా ఇంటికిపోయినప్పుడు ఆమె చెప్పిన మాటలు విని నిశ్చేష్టురాలయ్యను.నువ్వు శిరిడీకి పోయిన తరువాత కలలో రెండు సార్లు బాబా కన్పించి ప్రసాదమిచ్చారు అని.

నాకు,ఆమెకు చెప్పనలవికాని ఆనందం కలిగింది.ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్న బాబా,గురూజీలకు జీవితాంతము ఋణపడి వుంటాను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles