అహంకారాన్నే అణచాలని బాబా సంకల్పం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-69-1103-అహంకారాన్నే అణచాలని బాబా సంకల్పం 5:32

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

My story – Part-2 – సాయి లీల-3

ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఉంటూ పెద్డగా సంపాదించ లేనని  భావించి విదేశాలకు వెళ్తే ఎక్కువగా సంపాదించ వచ్చని, అదే సరియైన మార్గమని బాబాని ప్రార్ధించాను.

మొదట బాబా వద్దన్నా, తర్వాత నా బాధ భరించలేక నా సాఫ్ట్ వేర్ నేర్చుకునే ప్రయత్నాలకు పచ్చ జెండా చూపించారు.

విదేశాలకు వెళ్ళే  ఉద్యోగాలకు కావలసిన అర్హతలు సంపాదించుకున్నాను ఆ రెండు సంవత్సరాలలో.  బాబా దయవల్ల విదేశంలో (అమెరికా – న్యూ జెర్సీ లో) ఒక ఉద్యోగానికి ఆహ్వానం వచ్చింది.

1998 లో వెళ్ళాను. [ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవలసి వస్తుంది – మన ప్రారబ్దంలో ఉన్న కర్మలను అనుభవింప చేస్తూనే ఆ ప్రారబ్దంలో  లేనివాటిని కూడా మనకు ప్రసాదించగల సర్వ సమర్ధ అద్భుత దైవం మన సాయిబాబా.

నాకు విదేశాలకు వెళ్ళే అవకాశం, అర్హత లేక పోయినా బాబా నా ఆర్తిని అర్ధంచేసుకుని నాకు అవకాశం ఇచ్చాడు అన్నది నిర్వివాదాంశం.]

అయినా నా ప్రారబ్దంలో  ఉన్న కష్టాలను అనుభవింప చేయాలి కాబట్టి అవి కూడా సమాంతరంగా ప్రసాదించారు.

విదేశంలో ఒక 6 నెలలు ఉద్యోగం లేకపోయినా మిగిలిన కాలం అంతా ఏదో ఒక ఉద్యోగం  అనుభవింప చేసేటట్టు చేసాడు కాని  సంపాదన మాత్రం ఎక్కువగా లేదు.

నామ మాత్రంగానే సంపాదించాను.  అయినా నేను బాగా సంపాదించగలనన్నమొండి ధైర్యంతో ఉన్నాను.

నా ప్రారంబ్ధం కొద్దీ “Y2K (Year 2000)” అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సమస్య వచ్చింది, నా ఉద్యోగం పోయింది.

ఒక 3 నెలలు ఊరికినే ఉండి ఇక ఉండలేక 2001 లో ఇండియా తిరిగి వచ్చేసాను.

 My story – Part-2 – సాయి లీల-3 (continues)

నా మొండి ధైర్యం ఎంతవరకు తీసుకువెల్లిందంటే నా బంగారం లాంటి (గెజిటెడ్ ఆఫీసర్ హోదా) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒడులుకోనేలా చేసింది.

ఇండియా లోని నా ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ (నవంబర్ 2000) తీసేసుకున్నాను. 30 సంవత్సరాల సర్విసుతో (ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉండగా).

రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే అక్కడ విదేశంలో మార్చ్ కల్లా నా ఉద్యోగం కూడా పోయింది.  ఇదంతా సాయి చేస్తున్న లీల – నన్ను వెనక్కి రప్పించడానికి.

నాలో ఆయన మీద విశ్వాసం పెంపొందించుకోడానికి నాకు అవకాశం ఇవ్వడానికి. 

కాని నేను ఒక మొండివాడిని, అహంకారిని.  నా ఆత్మ విశ్వాసమే నా అహంకారం.

అహంకారాన్నే అణచాలని బాబా సంకల్పం.  అక్కడ ఉద్యోగం పోయేసరికల్లా నాలో భయం పట్టుకుంది.

కొద్ది కొద్దిగా బాబా మాటలని విశ్వసించడం మొదలైంది.  కాని అంత తొందరగా నా వోటమిని ఒప్పుకుంటానా? లేదు లేదు. అలాగే 3 నెలలు కష్టపడి ఎదురుచూసాను.

అయినా నా వెనుకనున్న దెవరు – సాయిబాబా.  ఆయన ముందర  నా కుప్పిగంతులు?  ఒక మూడు నెలలు దుర్భరంగా గడిపి ఇంక ఉండలేక స్వదేశం తిరిగి వచ్చాను.

 My story – Part-3 – సాయి లీల (మహిమ) -4

ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఊరికినే ఉండలేక (ఎక్కువుగా సంపాదించాలనే ఆశ నన్ను దొలిచేస్తుంది – ఎందుకంటే నా ఇంటి అవసరాలు అట్లా ఉన్నాయి కాబట్టి)  నాకున్న అనుభవంతో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని మొదలుపెడదామని అనుకుని బాబాని అడిగాను.  ఒప్పుకోలేదు.

మళ్లీ వేధించాను.  ఆయన విగ్రహం ముందు చీటీలు వేసేను.  వ్యాపారం చెయ్యొద్దు అని వచ్చింది.

రెండవసారి వేసాను, ఈసారి కూడా వద్దు ఏదేని ఉద్యోగం చేసుకో అని వచ్చింది.

అయినా వినలేదు.  కంపెనీ మొదలుపెడితే బాబానే సహాయం చేస్తాడు కదా అని, నా భార్య సమ్మతించక పోయినా ఒక కంపెనీని స్టార్ట్ చేశాను.

(ఇక్కడ మీరు సరిగానే అర్ధం చేసుకుని ఉండాలి నా మొండి పట్టుదల గురించి.  నేను పక్కా బ్రాహ్మణుడను.  సాధారణంగా బ్రాహ్మణులకు వ్యాపారం అచ్చిరాదు.

ఒక పక్క బాబా ఒప్పుకోలేదు. మరో పక్క నా భార్యకి కూడా ఇష్టం లేదు నేను బిజినెస్ చేయడం. ఇటువంటి తీవ్ర వ్యతిరేక వాతావరణంలో నా పట్టుదల నా ధైర్యం అవాంఛనీయం.

కాని నా ప్రారభ్ధం నన్ను వీటిని పెడచెవిని పెట్టేలా చేసింది.)

నా పట్టుదల బాబాకి తెలుసు.  అందుకే బాబాకి ఇష్టం లేకపోయినా నన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఊరుకున్నారు.

నా ప్రారబ్ధం అదే అని బాబాకి తెలుసు.  వారించినా వినడం లేదు వీడు.  సరే అవసరం వచ్ఛినపుడు కాపాడదాం లే  అని నన్ను, నా చర్యలని కనిపెడుతూ ఉన్నారు.

రేపు తరువాయి భాగం …..

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “అహంకారాన్నే అణచాలని బాబా సంకల్పం–Audio

Sai Pavan

అమ్మ మీ లీలలు వింటుంటే మనసు ప్రశాంతగా ఉంటుంది. మీ తో ఒక్కసారి మాట్లాడవచ్చా.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles