Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!
This Audio prepared by Mr Sreenivas Murthy
- Mir-10 ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము 1:58
బాబా విచిత్ర లీలలలో నింకొకదానిని వర్ణించెదను.
అమరావతి నివాసియగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను.
కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను.
తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బుట్టీవాడావద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగ బోయెను.
వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను.
బాబా యామెతో కారుణ్యముతో, నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నది గాని యవి చెదిరి పోయి కొద్దిసేపట్లో నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా యోదార్చెను.
అట్లనుచు తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్దవి నాలుగు ప్లేగు పొక్కులను అచటవారికి జూపెను. “చూచితిరా! నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో! వారి కష్టములన్నియు నావిగనే భావించెదను.” ఈ మహాద్భుతలీలలను జూచి యోగీశ్వరులు భక్తులకొర కెట్లు బాధ లనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను.
యోగీశ్వరుల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నెలవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువులవలె జూచెదరు
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ప్లేగు జబ్బు
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 9 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 17 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 10 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- 3(G.S Khaparde)–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments