Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తన భక్తుడైన దాసగణు, షిరిడీలో ఒకరి ఇంట విందు జరిగితే వెళ్ళలేదు. సాయి కారణం అడిగాడు.
“అతడు నాకు విరోధి” అన్నాడు దాసగణు. సాయి “ఈ విందు ఏమిటి? ఎవరు దేనిని ఎవరికిత్తురు? ఎవరు భుజింతురు?” నీకు విరోధి అని ఎవరిని గూర్చి పలుకకుము. ఎవరు ఎవరికీ విరోధి? ఎవరి ఎడ ద్వేషభావము వహించకుము. ఎల్లరు ఒకరే, అభిన్నులే” అన్నాడు.
ఒకసారి గురుగోవింద్ సింగ్ ముస్లింలతో యుద్ధం చేస్తున్నారు. సైన్యంలో ఇరు పక్షాల వారు గాయపడుతున్నారు. దాహంతో తపించిపోతున్నారు, మరణిస్తున్నారు.
యుద్ధం అలా జరుగుతున్నప్పుడు గురుగోవింద్ సింగ్ వద్దకు, అయన వద్దే పనిచేసే కన్నయ్య అనే వ్యక్తిని, సిక్కు సైనికాధికారులు దోషిగా హాజరు పరచారు.
కన్నయ్య మీద నేరం ఏమిటంటే, యుద్ధంలో కన్నయ్య విరోధి వర్గం వారైన ముస్లిం సైనికులకు కూడా త్రాగు నీరు ఇస్తున్నాడని. గురుగోవింద్ కన్నయ్యను సంజాయిషీ అడిగాడు.
“నాకు మన సైనికుల మధ్య, శత్రు సైనికుల మధ్య ఏ తేడా కనిపించుట లేదు. అందుకనే వారందరకూ నీటిని ఇస్తున్నాను.
గురూజీ, అందరూ దైవముచేత సృష్టింపబడిన వారే కదా. భగవంతుని సృష్టిలోని జనులందరూ సమమే అని గదా తమరు చెబుతుంటారు” అని కన్నయ్య సమాధానం చెప్పాడు.
గురు బాణిని సరియైన విధానంలో అర్ధం చేసుకున్నాడు కన్నయ్య అని గురు గోవింద్ సింగ్ ఎంతో సంతసించాడు.
కన్నయ్య నేరస్తుడు కాడని, ఇంకా లేపనములు ఇచ్చి వాటిని అవసరమైన వారికి పూయమని చెప్పారు గురుదేవుడు. ఇంకా “భాయ్” అని అతడిని సంబోధించాడు కూడా.
చదువుట మాత్రమే కాక, వినుట మాత్రమే కాక, ఆచరణలో పెట్టిన ఏకత్వపు విలువ అది, గ్రహించిన వాడు కన్నయ్య.
అయితే యుద్ధరంగంలో గాయపడిన విరోధులలో కూడా ఏకత్వాన్ని పాటించటం ఉత్తమ మానవ ధర్మం.
ఈ అంశమే 1828లో పుట్టిన హెన్రీడ్యునాంట్, తాను స్థాపించిన రెడ్ క్రాస్ ద్వారా ఆచరణలో చూపాడు.
రెడ్ క్రాస్ ఆవిర్భావానికి వంద ఏండ్ల ముందుగా దానిని ఆచరణలో పెట్టిన కన్నయ్య, సద్గురు గురుగోవింద్ సింగ్ లు విశ్వ మానవ కల్యాణానికి పునాది రాళ్లవంటి వారు.
భాయ్ కన్నయ్య సెప్టెంబర్ 20, 1718న మహాసమాధి చెందాడు.
నేడు సెప్టెంబర్ 20. కన్నయ్య వర్థంతి.
ఆయనను స్మరించి తరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- మట్టి బొమ్మలను మహారణానికి …. మహనీయులు – 2020… అక్టోబరు 21
- దిక్కులేనివారికి సద్గురువే దిక్కు… మహనీయులు @2020 – జనవరి 11
- రెండు అడుగులు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 3
- రాధాస్వామి…. మహనీయులు – 2020… ఆగస్టు 25
- మాధవ సేవ … … …. మహనీయులు – 2020… ఆగస్టు 5
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments