Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
మానవులకు మూడు అవస్థలుంటాయి:
(1) జాగ్రదావస్థ (2) స్వప్నావస్థ (3) సుషుప్త్యావస్థ. సాయిబాబాకు మానవుల వలె మూడు అవస్థలుండవు. ఆయనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు సాక్షాత్కరిస్తాడు.
జాగ్రదావస్థలో బాలారాం మాన్కర్, నానా సాహెబ్ చందోర్కరు మొదలైన వారికి సాక్షాత్కరించాడు.
స్వప్నావస్థలో బోధించే వాడు – సాఠేకు గురు చరిత్రను బోధించినట్లు. హెచ్చరికలు చేసేవాడు – ప్రధాన్ భార్యకు, బిడ్డలకు రాబోయే ఆపద గురించి. సందేశాలు అందచేసేవాడు .
అబ్దుల్‌ను పంపమని ఆయన గురువుకు చెప్పినట్లు. ఇంకా సాయి స్వప్నావస్థను తన భక్తుల రోగములను కుదుర్చుటకు వాడుకున్నాడు.
సరోజాబాయి భర్త కడుపులో వ్రణంతో వేరే ప్రదేశంలో ఉంటున్నాడు. ఆ భార్యాభర్తలకు సాయినాథుడు ఎవరో కూడా తెలియదు. అప్పటికే సాయి మహా సమాధి చెందాడు.
ఒకనాటి రాత్రి సరోజాబాయికి పీడకల వచ్చింది. ఆ కలలో తన భర్త మరణించినట్లు. ఆయన శరీరాన్ని అంత్యక్రియలకై తీసుకుపోతున్నట్లు కల వచ్చింది.
ఆ కలలోనే పెద్దగా ఏడుస్తోంది ఆమె. అప్పుడు ఒక ఫకీరు తేజస్సుతో దర్శనమిచ్చాడు ఆమెకు స్వప్నంలోనే. ”ఎందుకు ఏడుస్తావు? నీ భర్తకు తిరిగి ప్రాణం వస్తుంది” అన్నాడు.
ఆ ఫకీరు ఆ మాట అనగానే, మరణించిన భర్త లేచి కూర్చున్నాడు.
సరోజాబాయికి స్వప్నం వచ్చిన రోజున ఆమె భర్తకు ప్రాణం పోయిందనే అనుకున్నారట అందరూ. ఎంతో ఆశ్చర్యంగా తిరిగి ప్రాణాలు వచ్చాయట. వెంటనే ఆమెకు స్వప్నంలో కనిపించిన ఫకీరు గుర్తుకు వచ్చాడు.
కొంత కాలం తరువాత స్వప్నంలో కనిపించింది సాయిబాబా అని తెలుసుకుంది. ఫకీరు ఉన్న ప్రదేశం ద్వారకామాయి అని తెలుసుకున్నది.
భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి వెళ్ళి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు సాయికి.
బేలాపూర్ సమీపంలోని తుర్భేగాంలో శాంతాబాయి అనే బాబా భక్తురాలు నివసించేది.
ఆమె ఎడమ చేతి వ్రేలి ఎముక మీద ఒక కురుపు లేచి ఆమెను ఎంతో బాధించసాగింది. బాబా ఆమెకు కలలో కనిపించి ”వ్రణం మీద డికేమాలి రాయి” అని చెప్పాడు.
ఆమె డికేమాలిని రాసుకుంది. కురుపు నయమై బాధ పూర్తిగా తొలగింది.
ఈ విషయాన్ని ఆమె సెప్టెంబరు నెలలో (1918) సాయిబాబా పేరున ఒక ఉత్తరం వ్రాసి, అందులో ఈ విషయాలను తెలిపింది.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భాగ్యనగరిలో సాయి ఫకీరు…..సాయి@366 జూన్ 14….Audio
- గ్యారా సాల్ బాద్ ….సాయి@366 సెప్టెంబర్ 19….Audio
- సింహపురిలో సాయికి భోజనం…..సాయి@366 సెప్టెంబర్ 27….Audio
- మాటే .. మంత్రం ….సాయి@366 సెప్టెంబర్ 13….Audio
- జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “స్వప్న చికిత్సలు….సాయి@366 సెప్టెంబర్ 20…Audio”
Narahari
September 21, 2020 at 6:57 pmPlease use the correct language to address Saibaba, use words like chestaru, unnaru, chendaru etc not the other words you used in the above article…Sai@366 sep 20 article in telugu. lets show some respect addressing Lord Sainath.
Sai Baba
September 23, 2020 at 12:07 pmThank you Sai for your correction.
Many devotees treating a Baba like Father and Mother etc…So they consider the Baba as Family member and known person instead of God and Guru.
So they are using such words.
Even me Also many times some times thought like you.
When We dedicatedly connected with Baba then Baba will break the difference between you and me.
So all text book authors might have such relation with Baba. So they never feel and think about such words when they are writing the Books.