Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా భక్తుడు దాసగణు వలె ఠాకూర్ రాంసింగ్ జీ కూడా పోలీసు కానిస్టేబుల్ గా చేరాడు.
అయితే రాంసింగ్ అదే శాఖలో ఉంటూ ఎత్తుకు ఎదగ గలిగాడు. ఎత్తుకు ఎదగటమంటే, కేవలం పదవిలో కాదు, శాఖలో కాదు, ప్రజలందరిచే మన్ననలను పొంది రాం మహాశయ్ గా పిలువబడి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు.
నిలువెత్తు నిజాయితీ ఆయనది. అయన గురువు పేరు మహాత్మా రామచంద్రాజీ.
ఒకసారి రాంసింగ్ రీంగస్ నుండి జైపూర్ వెళ్ళాలి. అయన టికెట్టు కొనేందుకు కూడా సమయం లేదు.
రైలు కదులుతోంది. వెంటనే అయన రైలు ఎక్కాడు. టికెట్టు లేకుండా ప్రయాణం చేయటం నేరమని ఆయనకు తెలుసు.
తరువాత వచ్చే స్టేషన్ లో టి.టి.ఇ ని కలసి విషయం చెప్పాడు. టికెట్టుకు డబ్బు ఇవ్వబోయాడు రాంసింగ్ జీ.
ఇంతకు ముందే రాంసింగ్ జీ పేరు ప్రతిష్టలను తెలుసుకున్న టి.టి.ఇ. తరువాత తీసుకుంటానని అప్పుడు టికెట్టు డబ్బు తీసుకోలేదు. రైలు దిగిన తరువాత కూడా డబ్బు ఇవ్వబోతే, టి.టి.ఇ. తీసుకోలేదు.
ఏం చేసేది లేక రాంసింగ్ వెళ్ళిపోయాడు. రాంసింగ్ లాంటి మహనీయుడు తమతో ప్రయాణం చేయటమే పుణ్యమని భావించాడు టి.టి.ఇ.
ఇక రాంసింగ్ కు జైపూర్ లో పని అయిపోయింది. స్టేషన్ లో దింపటానికి ఒక వ్యక్తి వస్తే, ఆతనిచే రెండు టికెట్లు తెమ్మన్నాడు.
దీనినంతా రాంసింగ్ కు పరిచయమున్న వ్యక్తి గమనిస్తున్నాడు. రెండు టికెట్లు రాగానే, ఒక టికెట్టును చింపి పారవేశాడు రాంసింగ్.
కారణం అడిగాడు రాంసింగ్ ను గమనిస్తున్న వ్యక్తి. “నేను గతంలో రైల్వేకి బాకీ పడ్డానులే. అది తీర్చివేశాను” అన్నాడు నవ్వుతూ రాంసింగ్.
రాంసింగ్ కు తెలిసినవారు, తనతో చదివిన వారు ఎందరో ఆ శాఖలో ఉన్నారు. మూల్ సింగ్ ఆ శాఖలో ఉన్నతాధికారి.
“పోలీస్ శాఖలో ఉండి సొమ్ము చేసుకొనని వాడవు నీవు ఒక్కడివే” అన్నాడు మూల్ సింగ్ తో.
“నేను త్రాగుడుకు బానిసనయ్యాను. బయటకు రాలేకపోతున్నాను ఆ అలవాటు నుండి” అన్నాడు మూల్ సింగ్.
“నీకు ఇంతకంటే ఆనందాన్నిచ్చేది చూపిస్తే, మందు మానేస్తావా?” అడిగాడు రాంసింగ్. “అట్లాగే” అన్నాడు మూల్ సింగ్.
రాంసింగ్ ధ్యానం నేర్పాడు. మూల్ సింగ్ కన్నులలోకి చూచాడు. ధ్యానంలోనికి వెళ్లి ఆనందాన్ని పొందిన మూల్ సింగ్ మరల గంట తరువాత స్పృహలోకి వచ్చాడు.
రాంసింగ్ తో నీవు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు అని ఆనందించాడు. రాంసింగ్ అందరికీ అప్తుడే.
ఒక మంగలి తన చిన్న దుకాణంలో రాంసింగ్ ఫోటో పెట్టుకుని పూజించేవాడు. ఒక అధికారి తన సిబ్బందితో వచ్చి “నీవు మూడు రోజులలో ఈ దుకాణాన్ని తీసేయి. ఈ దుకాణం మీదుగా రోడ్డు పోతుంది” అని వెళ్ళిపోయినాడు.
ఆ మంగలి రాంసింగ్ ఫోటో ముందు నిలబడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆ రాత్రి ఆ అధికారికి నిద్రపట్టలేదు.
ఏదో కలవరం. వెంటనే మంగలి వాని జాలి ముఖం కనిపించింది. వెంటనే ఆ మంగలి షాపు పడగొట్టకుండా ప్లాను మార్చి, ఆమోదం పొందాడు. ఇది రాంసింగ్ ప్రేమ, ఆప్యాయత.
ఠాకూర్ రాంసింగ్ సెప్టెంబరు 3 (1898)న జన్మించాడు. నేడు అయన జయంతి. అయన సూక్తితో ఆయనను స్మరించెదము గాక!
“భగవంతుని వైపు రెండు అడుగులు వేస్తే, భగవంతుడు నాలుగు అడుగులు మన వైపు వేస్తాడు.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- విరోధి?! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 20
- న్యాయవాది …..సాయి@366 జూలై 26….Audio
- మట్టి బొమ్మలను మహారణానికి …. మహనీయులు – 2020… అక్టోబరు 21
- రాధాస్వామి…. మహనీయులు – 2020… ఆగస్టు 25
- మాధవ సేవ … … …. మహనీయులు – 2020… ఆగస్టు 5
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments