Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కెలూత యొసగి యెక్కించుకొనియె” అంటారు అల్లసాని పెద్దన కృష్ణ దేవరాయలను గూర్చి.
కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన కనబడినపుడు, తన ఏనుగుపై ఎక్కుంచుకునేవాడు. “విద్వాన్ సర్వత్ర పూజితే” గదా!
వివేకానంద స్వామి చికాగో మహాసభకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేసిన వారిలో భాస్కర సేతుపతి ఒకరు.
ఆయన రామనాథ మహారాజు. పూర్తి పేరు హిరణ్యగర్భయాజి రవికుల ముత్తు విజయ రఘునాథ భాస్కర. చదువు, సంధ్యలు, సంస్కారం మూర్తీభవించిన వ్యక్తి.
సనాతన ధర్మ ప్రతిభను చికాగో నుండి ప్రపంచానికి చాటిన వివేకానందులు 1897 సంవత్సరంలో ఒక మంగళవారం సాయంకాలం పాంబన్ లో దిగారు.
భాస్కరసేతుపతి మనోహరంగా అలంకరించబడిన పడవలో వివేకానందుని రామనాథపురానికి తీసుకుపోవటానికి వచ్చాడు. వారి కలయిక దృశ్యం అపూర్వం.
రాజు, ఆయనతో వచ్చిన వారు, స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామీజీని సింహాసనంపై ఆశీసులను చేసి, స్వామీజీ పాదరక్షలపై తన శిరస్సునుంచి “అమూల్యమైన వజ్రాన్ని శిరస్సున ధరించటంకన్నా దీనిని మహదానందంగా పరిగణిస్తున్నాను” అన్నారు.
ఘనస్వాగతం అనంతరం వివేకానందులను విడిదికి తీసుకుపోయేందుకు ఆరు గుర్రముల జగ్గీని ఏర్పాటు చేసారు సేతుపతి.
కొంచెం దూరం కాలినడకన తన పరివారంతో నడిచారు సేతుపతి. బండికి కట్టిన గుర్రములను విప్పేయమన్నారు సేతుపతి.
స్వయంగా ఆ గుర్రపు బగ్గీని లాగటం మొదలు పెట్టాడు భాస్కర సేతుపతి. వివేకానందులు వరిస్తూనే ఉన్నారు రాజును.
“యథారాజ తథాప్రజ” అని కదా అంటారు. రాజుతోపాటుగా జనులు కూడా ఆ వాహనాన్ని బసకు చేర్చారు సంతోషంగా.
దొరకునా ఇటువంటి సేవ!
రాజైనా భాస్కర సేతుపతి ధన్యుడు.
రాజును అనుసరించే ప్రజలు ధన్యులు.
సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన వివేకానందులకు కీర్తి కిరీటాన్ని ధరింపచేసిన దినమే జనవరి 26 , 1897 .
సనాతన ధర్మమును పాటింతుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మాధవ సేవ … … …. మహనీయులు – 2020… ఆగస్టు 5
- భావన కాదు యదార్దమే! . …. మహనీయులు – 2020… అక్టోబరు 15
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
- నానారాజ్య సందర్శనం …. మహనీయులు – 2020 – జనవరి 28
- మహేశ యోగం … మహనీయులు @2020 – జనవరి 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments